January 4, 2014

మధుమేహం – లైంగిక సమస్యలు

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యదికం శాతం మానసిక దుర్బలత్వం, భయం, డయాబెటిస్‌ వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధిత వ్యాధుల లోపాల వలన అంగస్తంభన శీఘ్రస్కలన సమస్య, సెక్స్‌ కోరికలను తగ్గటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిస్‌ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లను ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్ధ్యం మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భయం, […]
November 22, 2010

హైపర్‌టెన్షన్‌తో బహుపరాక్‌

ఒక వయస్సుకు చెందిన వారిలో ధమనులలోని రక్తపోటు సాధారణ స్థాయికన్నా ఎక్కువ ఉంటే దానిని ‘హైపర్‌ టెన్షన్‌’ అంటారు. దీని బారిన పడిన వారిలో దాదాపు 85 శాతం మందిలో దీనికి సంబంధిం చిన ఎటువంటి లక్షణాలు కనుపించనందున దీనిని నిశ్శబ్ద మృత్యువు (silent killer) అంటారు.అంతేకాదు ఈ వ్యాధి అనేక ప్రమాదకర సమస్యలకు దారి తీసేందుకు దోహదం చేస్తుంది. గుండెపోటుతో సంభవించే మరణాలలో 57శాతం, హృద్రోగ సంబంధిత మరణాలలో […]
January 3, 2011

స్థూలకాయం జన్యుకారణమా?

తల్లిదండ్రులు స్థూలకాయులైతే తాము కూడా స్థూలకాయంగా వుంటారనే అపోహ చాలా మందిలోవుంది. కానీ వారు తీసుకునే ఆహారం, వ్యాయామం చేయకపోవడం వల్ల వీరిలో స్థూలకాయం పెరుగుతోంది. స్థూలకాయానికి జన్యువులు ఎలా కారణమని ఒక పరిశోధన చేశారు.  జన్యుపరంగా స్థూలకాయం వస్తుందనేది ఒక కారణమే. కానీ నిజానికి అది కారణం కాదు. వృద్ధాప్యంలో స్థూలకాయం రావొచ్చు. చిన్న వయసు నుంచే మితంగా ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ స్థూలకాయం రాదు.
May 31, 2011
మహిళల్లో సంతానలేమి

మహిళల్లో సంతానలేమికి చికిత్సలు

మహిళల్లో సంతానలేమి ఉందని నిర్ధారణ అయినప్పుడు అందుకు చేసే చికిత్స వివిధ రకాలుగా ఉంటుంది. – మొదట ఆ జంటకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరువాత జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులను గురించి వివరిస్తారు. – పోషకాహారం ఆవశ్యకతను వివరించడంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాల్సిందిగా సూచిస్తారు. – ఆ తరువాత సైకోసెక్సువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. – అవసరాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు) లాంటి పరీక్షలు […]
April 24, 2014
పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు

వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలు, గృహిణులు, వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్ర్తిలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, ఆహార పదార్థాలలో అధికంగా కారం మసాలాలు సేవించేవారు, ఎండలో పనిచేసే వివిధ వృత్తులవారు, మూత్ర విసర్జనకి వీలుకాని సందర్భం తోడైనపుడు, ఇతరేతర కారణాలవల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంట, మూత్ర విసర్జనాంతరం పొత్తి  కడుపు నొప్పి, మూత్రదోహం, జ్వరం, మూత్ర విసర్జనపుడు దుర్వాసన, నడుము నొప్పి, వాంతులు మొదలగు లక్షణాలు ఏర్పడతాయి. కిడ్నీలు […]
July 28, 2013

కాలేయ క్యాన్సర్‌

సమతౌల్యం లేని ఆహారం, మద్యం అధికంగా సేవించడం, ధూమపానం, విపరీతమైన ఒత్తిళ్ళతో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, అతివేగంతో కూడిన జీవనశైలి వల్ల రాష్ట్రంలో ఉదరకోశ వ్యాధులు పెరిగిపోతున్నాయి.కాలేయం దెబ్బతినడానికి 40 నుంచి 50 శాతం వరకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణమైతే, 30 నుంచి 40 శాతం మందిలో క్యాన్సర్‌ దెబ్బతినడానికి అతిగా మద్యం సేవించడమే ముఖ్యకారణం. ఆహారం, నీరు కలుషితమైనవి తీసుకోవడం వల్ల హెపటైటిస్‌ ఎ,ఇ వైరస్‌లు […]
November 23, 2010

ఒళ్లంతా పచ్చగా

పచ్చకామెర్లు వైరస్‌ వల్ల కలిగే కాలేయ వ్యాధి. ఈ వైరస్‌లో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ అనే ఆరు రకాలున్నాయి. దీనిలో ముఖ్యంగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి చెప్పుకోతగ్గవి. వీటి గురించి తెలుసుకుందాం. హెపటైటిస్‌-ఎ సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు. ఇది ఒక్కోసారికి సమాజంలో చాలా మందికి రావచ్చు. ఇది ‘ఫీకో ఓరల్‌’ రూట్‌ ద్వారా కలుగుతుంది. అంటే మలం నుండి తినే ఆహారం గాని, నీరుగాని కలుషితమైతే […]
June 10, 2014
మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు […]
October 25, 2010

అధిక బరువు… నష్టాలు

స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది మూత్రపిండాల్లో రాళ్లు    ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా […]
December 7, 2010

చికిత్సకు లొంగే సోరియాసిస్‌

సోరియాసిస్‌ అన్నది చర్మానికి సంబంధించిన అనారోగ్యం. ఈ వ్యాధి అయిదు సంవత్సరాల వయస్సు నుంచి 25 సంవత్సరాల వయస్సులోపల ఏ వయస్సులో నయినా రావచ్చు. స్త్రీలలో మెనోపాజ్‌ స్థితికి చేరుకున్న వారికి కూడా రావచ్చు. ఈ వ్యాధి స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద, వయస్సు తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. ఈ వ్యాధి శీతల ప్రాంతంలో నివశించేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి ఆరంభమయిన తర్వాత, త్వరగా తగ్గదు. […]
June 3, 2011

తాజా శ్వాసతో… దగ్గరగా రా…!

నవ్వు ఒక వరం. హాయిగా నవ్వేవారికి ఎలాంటి రుగ్మతలు రావు అని ఒక నమ్మకం. కానీ కొందరు వివిధ కారణాలతో హాయిగా నవ్వలేకపోతారు. ఇలా పదిమందితో నవ్వుతూ మనస్ఫూర్తిగా నోరు విప్పలేకపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ప్రధానమైనది నోటి దుర్వాసన. కొందరికి తమ నోటి నుంచి దుర్వాసన వెలువడుతున్న విషయమే తెలియదు. మరికొందరికి దుర్వాసన వస్తున్నట్లు తెలిసినా ఏం చేస్తే అది పోతుందో తెలియదు. ఈ రెండు అంశాలతో పాటు, నోటి […]
July 3, 2011

చర్మసౌందర్యానికి గోరింటాకు

గోరింటాకు కేశ సౌందర్యానికే కాకుండా చర్మానికి కూడా చేసే మేలు అంతా ఇంతా కాదు. లేత గోరింటాకు ప్యాక్‌ చేసుకుంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే మీ ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది. ఈ ప్యాక్‌ ఎలా చేసుకోవాలంటే… ఐదారు టీస్పూన్ల తేనె, లేత గోరింటాకు ముద్ద, తగినన్ని పాలు కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా ముఖానికి వేసుకుని 5,10 నిమిషాల పాటు మర్ధన చేసి ఆపై కడిగేసుకుంటే ముఖంలో తాజా దనానికి […]