మీకు తల తిరుగుతుందా ?
December 6, 2010
కదలండి-ఆరోగ్యంగా ఉండండి
December 6, 2010

అన్నవాహిక కేన్సర్‌

అన్నవాహిక కేన్సర్‌ ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కన్పిస్తుంది. శరీరంలో వచ్చే కేన్సర్‌లలో ఇది ఐదవది. ఎక్కువ వచ్చే కేన్సర్‌ దీనిలో రెండు రకాలుగా వుంటుంది. అన్నవాహిక పైరెండు భాగాలలో వచ్చేది ‘స్క్వామస్‌సెల్‌’ కేన్సర్‌. అన్నవాహిక కింది భాగంలో వచ్చేది అడినో కేన్సర్‌. ఇది అల్సర్‌లాగా చుట్టూరా పాకుతూ పొడవుగా కూడా కనిపిస్తుంది.

కారణాలు 

 దీనికి ఇదమిత్తంగా కారణమంటూ చెప్పడం కష్టం. అయితే… మద్యపానం సేవించేవారిలో, పొగతాగే వారిలో ఎక్కువ. కారం, మసాలా దినుసులు వాడే వారిలో, అన్నవాహికలో అవరోధమున్న వారిలో, ఎక్కువ రేడియేషన్‌కు గురైన వారిలో, ఎక్కువ వేడిగల కాఫీ, టీలు తీసుకొనేవారిలో విటమిన్‌- ఎ, జింకు, మాలిబ్డినం లోపమున్న వారిలో ఎక్కువగా కన్పిస్తుంది.

లక్షణాలు

ఆరంభంలో గట్టి పదార్థం మింగడానికి కష్టంగా వుంటుంది. తర్వాత ద్రవ పదార్థాలు మింగడానికి కష్టంగా వుంటుంది. త్వరగా బరువు కోల్పోవడం. ఛాతీలో నొప్పి. స్వరం క్షీణించడం. నోట్లో నుండి రక్తంతో కూడిన వాంతి. అధికంగా రక్తంలో కాల్షియం వుండడం.

నిర్ధారణ

డబుల్‌ కాంట్రాస్ట్‌ బేరియం స్వాలో. జి.పి ఎండోస్కోపి ద్వారా. బయాప్సీ పరీక్ష కూడా చెయ్యెచ్చు. అవసరమైతే సిటి స్కానింగ్‌ చేయాలి.

చికిత్స 

 ‘స్వ్కామస్‌సెల్‌’ కేన్సర్‌కు ఎక్కువ ఓల్టేజి రేడియోథెరపీ చేస్తారు. అన్నవాహిక కింది భాగంలో వచ్చే కేన్సర్‌కు ఆపరేషను ముందు, రేడియోథెరపీ తర్వాత ఆపరేషన్‌ చేస్తారు. ఇంకో విధానం కూడా అమలు చేస్తారు. కింది భాగం వచ్చే ‘అడినోకేన్సర్‌’కు ఆ భాగానికి ఆపరేషన్‌ చేసి మళ్లీ రేడియేషన్‌ థెరపీ. ఇస్తారు.

కొందరు వైద్యులు ‘సిస్‌ప్లాటిన్‌’ అనే కీమోథెరపీ మందు వాడుతూ ఆపరేషన్‌ చేయాలి. ఆపరేషన్‌ వీలుకాకుంటే ఉపశమనం కొరకు ‘లేసర్‌ అబ్లేషన్‌’, బైపాస్‌ సర్జరీ చేస్తారు. ఆహారం శరీరానికి అందించే ందుకు గ్యాస్ట్రాస్టమి కూడా చెయాల్సి వుంటుంది. పోషకవిలువలు కల్గిన ఆహారం దావ్రక రూపంలో ఇవ్వాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి

చీఫ్‌ ఫిజిషియన్‌,

మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌, ఎంహెచ్‌ భవన్‌

అజామాబాద్‌, హైద్రాబాద్‌.

ఫోన్‌ : 9676376669

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.