విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం
October 10, 2010
ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి
October 11, 2010

కొంధరు అకారణంగా మానసిక అలజడికి గురవుతుంటారు. సమస్యలు లేనప్పటికి దిగులు పడుతుంటారు. గుండెల్లో గుబులు, చేతుల్లో చెమటతో బాధపడుతూంటారు. కొన్ని సందర్భాలలో భ్రమలు, భ్రాంతులకు లోనవుతుంటారు. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు మానసిక సమస్యగా భావిస్తుంటాము. సైకాలజిస్టులు సైకియాట్రిస్టులను సంప్రదిస్తాము. అయితే అక్కడి కౌన్సెలింగ్, చికిత్సలు సరైన ఫలితాలు ఇవ్వవు. దీంతో వైద్యులను మార్చడమో, మంత్ర తంత్రాలమీద ఆధారపడటమో చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో థెరాయిడ్ పరీక్షలు చేయిస్తే మంచిది. థెరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేసినా, తక్కువయినా, మనోశారీరక సమస్యలు తలెత్తుతాయి.

థైరాయిడిజాన్ని ప్రధానంగా హైపర్, హైపోథెరాయిడిజంగా వర్గీకరించారు. వీటికి అనుబంధంగా హైపో పేరాథెరాయిడిజం, హైపర్ ఫేరాథైరాయిడిజంను చెప్పుకోవచ్చు. అలాగే చంటిపిల్లల్లో వచ్చే థైరాయిడ్ సమస్యను క్రిటినిజం అంటారు. వీటిని సూక్ష్మంగా పరిశీలిస్తే పలు లక్షణాలు, కారణాలు కనిపిస్తాయి.

హైపర్ థెరాయిడిజం

ఈ సమస్యకు కారణం థెరాయిడ్ గ్రంథి అత్యధికంగా పనిచేయడమే. ఇది పురుషులకంటే స్ర్తిలలో ఆరురెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. వయస్సులో ఉన్నవారిలోనే అధికంగా రుగ్మత తలెత్తే అవకాలున్నాయి. కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా వస్తుంటుంది. హైపర్ థెరాయిడిజంతో బాధపడేవారు నిరంతరం ఆందోళన, ఆతృత, భయం, గందరగోళానికి గురవుతుంటారు. గుండె, నాడి వేగంగా కొట్టుకుంటుంది. చేతులు అప్పుడప్పుడు వణుకుతాయి. ముఖం, మెడ, ఇతర భాగాల్లో చెమట అధికంగా ఉంటుంది. కనుగుడ్లు పైకి ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారిలో కొవ్వు కరిగిపోయి బరువు కోల్పోతారు. తరచు విరేచనాలు అవుతాయి.

హైపోథైరాయిడిజం

థెరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి కావడాన్ని హైపోథైరాయిడిజం అంటారు. పుట్టుకతో కలిగే థెరాయిడ్ లోపం, పిట్యూటరీ గ్రంధం, హైపోథలమస్ పనిలో లోపం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. దీర్ఘకాలం ఐయోడిన్ లోపం ఒక్కోసారి కారణం కావచ్చు. వంశపారంపర్య లక్షణంగా రావచ్చు. ఈ సమస్య కూడా పురుషులకంటే స్ర్తిలలో ఆరురెట్లు ఎక్కువగా వస్తుంది. సాధారణంగా 35 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ రుగ్మత దీర్ఘకాలం కొనసాగితే మిక్సిడీమా అనే వ్యాధి కలుగుతుంది. ఈ సమస్యవల్ల స్థూలకాయంవచ్చే అవకాశాలు ఎక్కువ. అలసట, మొహం ఉబ్బరం, కాళ్లు, చేతులు నీరు పట్టడం ………. అక్కడక్కడ తెల్లపొర రావడం జరుగుతుంది. గొంతు వద్ద థెరాయిడ్ గ్రంథి రణితిలా తయారవుతుంది. నాడి తక్కువగా కొట్టుకుంటుంది. ఒక్కోసారి కార్డియాక్ ఫెయిల్యూర్ కావచ్చు. మానసిక కృంగుబాటు, నత్తగా మాట్లాడటం జరిగే అవకాశాలున్నాయి. చేతులు, కాళ్ళు తిమ్మిర్లు, కండరాలనొప్పి, మలబద్ధకం, రక్తహీనత, సంతాన లేమి సెక్స్ బలహీనత కనిపిస్తుంది.

హైపర్ పేరాథెరాయిడిజం

పేరాథెరాయిడ్ గ్రంథికి కేన్సర్ రావడం, కాల్షియం తగ్గిపోవడం తదితర అంశాలు దీనికి ప్రధాన కారణాలు. ఈ రుగ్మతతో బాధపడేవారు గందరగోళానికి గురవుతుంటారు. కండరాలలో బలహీనత, అలసట, ఆకలి తగ్గడం, వికారం, మలబద్ధకం, అల్సర్లు, ఎముకల్లో నొప్పులు సహజంగా వుంటాయి. కొందరిలో అతిగా ఆకలి వేయడం, అతి దాహం, అతి మూత్రం లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

హైపో పేరాథెరాయిడిజం

పేరాథెరాయిడ్ గ్రంథి చెడిపోవడం, ఆపరేషన్ సమయంలో పాడవటం, అకారణంగా సరిగా పనిచేయకపోవడంవల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే శరీరంలో సీరం, మెగ్నీషియం స్థాయి తగ్గిపోవటంవల్ల వచ్చే అవకాశాలున్నాయి. ఈ రుగ్మత వున్నవారిలో ఫిట్స్…….. రక్తంలో కాల్షియం తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్ళు, కీళ్ళు, ఎముకల్లో నొప్పులు వస్తాయి. భ్రమలు భ్రాంతులు కలుగుతాయి.

క్రిటినిజం

చంటిపిల్లల్లో తలెత్తే హైపోథెరాయిడిజంను క్రిటినిజం అంటారు. ఇలాంటి పిల్లల్లో చురుకుదనం తగ్గిపోతుంది. ఎప్పుడు నీరసంగా ఉంటారు. మాట సరిగా మాట్లాడరు. ఎదుగుదల ఉండదు. పొట్ట ఉబ్బుగా ఉంటుంది. నాలుక పెద్దగా కనిపిస్తుంది. మొహం, కంటిరెప్పలు, కాళ్ళు, చేతులు, పొట్ట నీరు పట్టినట్టు వుంటుంది. మలబద్ధకంతో బాధపడుతుంటారు.

చికిత్స

థెరాయిడ్ సమస్యకు డాక్టర్ల పర్యవేక్షణలో తగిన చికిత్స చేయించాలి. తగిన పరీక్షలు చేసి సమస్యను నిర్థారించి మందులు వాడాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కొందరు జీవితకాలం మందులు వాడవలసి వస్తుంది. మందులతోపాటు యోగ, ధ్యానం, శారీరక వ్యాయామాలు పాటిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. సైకాలజిస్టుల కౌనె్సలింగ్ ద్వారా మానసిక శక్తిని కలిగించవచ్చు.

– డా.ఎన్.బి.సుధాకర్ రెడ్డి

 

2 Comments

  1. i am suffering from hyper thyroid since june 2010.kindly help me out from it.i am expecting for your suggestions

  2. Dear sir/madam,

    my wife is having thyroid problem, she is pregnent currently she is 3 rd month carrying baby.
    she is having thyroid TSH is 10 .
    kindly suggest how to control thyroid and it effects to pregency.
    kindly advise, which food to she has to take and which medicine she is have it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.