అవలోకన చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయ్‌

చర్మసౌందర్యానికి గోరింటాకు
July 3, 2011
కాల్షియం లోపిస్తే………..
July 4, 2011

అవలోకన చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయ్‌

కాలానుగుణంగా యువతరం భావాలలో పెను మార్పులు వస్తుండటంతో ప్రేమ పెళ్లిళ్లలోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాలతో భార్యాభర్తలైన వారి మధ్య కూడా వివాదాలు పెరిగిపోతూ… అభి ప్రాయ భేదాలు పొడచూపి, ఆనందాలు నెలకొనాల్సిన సంసార జీవితంలో పెను విషాదాలకు తెరలేపుతుండటం ఆందొ ళన కలిగించే అంశం.

నేటి యువతరం తమ వైవాహిక జీవనం పట్ల్ల పరస్పర అవగాహన లోపించడం వల్లే ఈతరహా వివా దాలు పెరిగి చివరకి విషాదాం తాలు గా మిగిలిపోతున్నాయన్నది మాత్రం వాస్త్తవం.

అయితే భార్యాభర్తలు తమ మధ్య అంతరిస్తున్న ఆనందాలకు, పెరిగి పోతున్న వివాదాలకు కారణాలు అన్వేషించుకుని తదనుగుణంగా తమ జీవనశైలిలో నూ పెను మార్పులు తీసుకు రాగలిగితే.. వారి జీవితం ఆనందభరితమవుతుందనటంలో సందేహం లేదు. భార్యాభర్త్తలు తమ తమ అభిప్రాయాలు పరస్పరం పంచుకోవటంతో పాటు ఎదుటివారు చెప్పేదానికి అంత విలువ ఇవ్వగలగాలి.

అసలు నేటి తరంలో భార్యాభర్త్తల మధ్య ఏర్పడు తున్న దూరానికి కారణాలు అన్వేషిస్తే…. నేటి సమాజం లో వైవిహిక సంబంధాలు ఎక్కువగా విఛ్చిన్నమవుతు న్నది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలలో నే… ఆర్ధిక లావాదేవిలు, ఏదో ఒక వ్యాపారమో, వ్యవ హారమో నిత్యకృత్యమైపోయిన ధనిక వర్గాల లోనూ కొంత మేర ప్రభావం చూపినా ఇతరులతో పోల్చుకునేంతగా విషా దం నింపుకోవటం ఈ వర్గం లో ఉండే వారికి అవ సరంలేదన్నది కొంత మేరకు వాస్తవమైతే…ఈ వర్గం కొంతమేరైనా తమ కల లు సాకారం చేసుకునేందుకు కావాల్సిన పెట్టుబడులని తీసుకు రాగలరు. వారినున్న కలిమి కూడా కొంత తోడై ఆలోచనల్ని భిన్నంగా చేస్తుంది.

ఇక క్రింది స్ధాయి వర్గం విషయంలో చూస్తే ఏ రోజు కారోజు ఎంత సంపాదించుకున్నాం.. హాయిగా తిన్నామా? ఆనందించామా? పడుకున్నామా?లేదా అనేందుకే అధిక ప్రాధాన్యత.. వీరిలో మానసిక వైకల్యాలే కాదు మానసిక రోగాలు కూడా తక్కువ గా ఉండటం వల్ల కూడా ఎదుట వ్యక్తులతో పోల్చుకోకుండా తమకున్న దానిలో సంతృప్తి పొందేందుకు ప్రయత్నించడమే కాకుండా సర్దుకుపోగల మనస్ధత్వం ఉంటుంది.

ఇక మధ్య తరగతి వర్గాల విషయానికి వస్తే…పూర్వం నుండి పెద్దలు పెట్టిన ఆచార వ్యవహారాలు, ఆడంబరాలను వదులుకో లేక వాటిని ఆచరించకపోతే ఎదుట వ్యక్తు లెక్కడ తమని కించపరిచేలా చూస్తారన్న భయంతోనో ఖర్చుకి వెనకాడకుండా అప్పులైనా చేసి మరి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు.

వీరిలో ప్రచార మనస్ధత్వం అధికంగా ఉండటంతో ఎదుటివారి దగ్గర ఉండే సౌకర్యాలు మన దగ్గ రా ఉండాలని, ఆభరణాలు, వాహ నాలు ఇలా ఏదైనా సరే తమ సొంత చేసుకునేందుకు తపన పడతారు. తమ సంపాదనని తమ లక్ష్యాల వైపు మరల్చు కోవటం ఓ వం తెతే… అటు వైపు పయనిం చలేని వారు మానసిక వత్తిడికి లోనవుతారు.

ఈ నేపధ్యం లో భార్యభర్తల నడుమ అభిజాత్యాలు, అహంకారాలు బహర్గతమై మాటా మాటా పెరిగి చివరకి కొట్లాటుకోవటానికి కూ డా వెనకాడని పరిస్ధితి నెలకొంటుంది. ఒకరి ఇగోని ఒకరు ఎత్తి చూపడం ద్వారా జీవితాన్ని నరకంలోకి నెట్టేసుకుంటున్న కుటుంబాలెన్నో.

అయితే ఇలాంటి పరిస్ధితుల్ని అధిగమించలేమా? అనంటే ఎందుకు కాదన్న జవాబు మీకు దొరుకు తుంది. ప్రతి చిన్న విషయానికి కీచులాడుకునే కన్నా ఓ సారి మీ ఇగోలని పక్కకు పెట్టి జరుగుతున్న పరిస్ధితిలో తమ వంతు పాత్ర ఏమిటన్నది నిజాయితీగా అంగీకరించగలగటమే కాదు. ‘జనం చెవులో పోస్తారు కానీ నోట్లో పోయరు’ అన్నది మన పూర్వీకులు చెప్పిన జీవన వేదా న్ని అక్షరాలా గమనించగలగాలి. ఇతరులు చెప్పే చెప్పు డు మాటలకు దూరం గా ఉండగలిగితే… పెళ్లయిన నాటి నుండి గడిచిన ఆనంద క్షణాలను మననం చేసుకోగలిగితే.. మీ వైవాహిక జీవితానికి రీఛార్జి చేసి నట్లే. భార్యా భర్త్తలు నిరంతర ఆనందాలను పంచు కోగలితే వారి సంసారంలో చిన్న వైరుధ్యాలు కూడా దూరమై పోతాయి. ఈ ప్రపంచంలో ఎవరూ.. ఇంకొ కరితో సమానం కాదు… ఎన్నో వైరుధ్యాలు, తేడాలు, బాధలు ఉంటునే ఉంటాయి.

అలాంటప్పుడు ఇతరులతో మనల్ని పోల్చుకోవ టం ఏమాత్రం సమంజసమో? మిమ్మల్ని మీరు ఓ సారి ప్రశ్నించుకోండి. ఎదుటివారికున్న వన్నీ మనకీ ఉండాలనుకోవటం అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవటమే అని భావించడం మంచిది. సంపద ఉన్న వారంతా సుఖంగా ఉన్నారనే భావన నుండి బైట కు రండి, సంతోషాలకు, సంపదలకు ఎలాంటి సంబం ధం ఉండదు, మన కన్నా తక్కువ వారితో చూసు కుంటే మనం గొప్పగా బ్రతుకుతున్నట్లు మీకు కనిపి స్తుందన్న విషయం మరిచిపోకండి.

గంజినీళ్లు తాగుతూ…సాధారణ జీవనాన్ని గడు పుతూ… ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా ఎందరు మన మధ్యలేరు చెప్పండి. భార్య్యభర్త్తలు షాపింగ్‌కి వెళ్లినా… అనవర వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఎదుటివారితో పోల్చుకుని వస్తువులు కొనుక్కుంటే.. అప్పులపాలు కావాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.

గతంలో ఉన్న ఆనందం ఇప్పుడు ఎందుకు ఉండటంలేదో పునరాలోచన చేసుకోండి. పెళ్లినాటి ప్రమాణాలనే కాదు… గతంలో మీరు కలసి చెప్పుకు న్న ఊసులు, ఆనాటి సరదాలు, స్నేహితులు, సంతో షాలు, అప్పట్లో తీసుకున్న ఫోటోలు చూసు కుంటూ నెమరుసుకోండి. చేసిన వాగ్ధా నాలపై మనమెంత నిబద్దతతో వ్యవ హరిస్తుా ఉన్నామో ఆలోచించు కోండి. ఖచ్చితంగా మీ జీవితంలోకి ఆనందం వచ్చి చేరుతుంది.

అడపా దడపా మీ ఇద్దరూ.. కాకుంటే మీ పిల్లల తో కలసి షికారుకెళ్లండి. పార్కుల్లో పెళ్లయిన కొత్తల్లో నో… ప్రేమించుకున్నప్పుడో చేసుకున్న బాసలు గుర్తు చేసుకొంటే… పరస్పరం ఒకరి కొకరు అవగాహన పెంచుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

పిల్లలు చేసే అల్లరులు, వారితో గడిపిన మధుర క్షణాలు, చిన్నప్పుడు వారి బోసి నవ్వులు ముద్దు ముద్దు మాటలతో మనల్ని నవ్వించిన రోజులు గుర్తు చేసుకోండి. అంతే కానీ అప్పుడెప్పుడో కోరిన కూర వండలేదని, ఎక్కడికో వెళ్ధామంటే సమయానికి తయారు కాలేదన్న ఈసడింపులు చేసుకోవదు. అలాగే శ్రావణమాసం చీర కొనలేదని, పక్కిం టి వారిదగ్గరున్న నక్లెస్‌ లాంటిది మనవద్ద ఉండాలని, షాపింగ్‌ తీసుకొచ్చి తాను మనసు పడ్డ వస్తువు కొనలేదని విరు చుకు పడి అనవరగొడవలు పెంచు కుంటే…పరిస్ధితి ఇబ్బందిగా మారుతుంది. సరదాగా బంధువుల, స్నేహితులకు వెళ్లి అనవసర భేషజాలతో, ఆరాటాలతో, అమరికల తో ప్రవర్తించకండి. ఉన్నంత సమ యాన్ని ఆనందం ఆస్వాదించాల్సిందే.

మీ స్నేహానికి గుర్తుగా చిన్న చిన్న బహుమ తులు అందించండి. ఆర్ధిక పరమైన సుఖాల కన్నా… స్నేహ పరిమిళలాలు శాశ్వతం అనే విషయం గమ నించండి. మీ పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ.. అభిజాత్యాలను పక్కన పెట్టి మనుషులుగా మసలేందుకు ప్రయ త్నిస్తే.. మీరే ఈ సమాజంలో పదిమందికీ ఆదర్శంగా నిలు స్తారు. మీకంటూ గొప్ప ఆస్తి మీ పిల్లలే వారి భవిష్యత్‌నే లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగగలిగితే సంసారం సాఫీగా.. యశోదా యకంగా మారటం ఖాయం.

ఆంధ్రప్రభ దినపత్రిక

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.