ఆరోగ్య రక్షణలో అయోడిన్‌

మహిళలను బాధించే ఆస్టియోపొరొసిస్‌
October 11, 2010
చిన్న పిల్లల్లో ఆస్తమా అపొహాలు – వాస్తవాలు
October 18, 2010

ఆరోగ్య రక్షణలో అయోడిన్‌

అక్టోబర్‌ 21ని ప్రపంచ అయోడిన్‌లోప వ్యాధుల దినంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య రక్షణలో అయోడిన్‌ పాత్ర గురించి తెలుసుకుందాం…

అయోడిన్‌ ఒక మూలకం. ఉప్పు, కొన్ని కూరగాయలు, సముద్రం నుండి లభించే కొన్ని ఆహార పదార్థాలలో అయోడిన్‌ ఉంటుంది.

మన దేశంలో ప్రతి ఐదుగురులో ఒకరు ఏదో ఒక స్థాయి అయోడిన్‌ లోపంతో బాధపడుతున్నారు.

మనం గొంతుపై బంతి లాంటి గడ్డ ఉన్నవారిని చూస్తుంటాం. దీన్ని గాయిటర్‌ అంటారు. ఈ గడ్డకు కారణం అయోడిన్‌ లోపమే.

మనం సర్కస్‌ కంపెనీలలో మరుగుజ్జులను చూస్తుంటాం. తల్లికి గర్భధారణ సమయంలో అయోడిన్‌ లోపం ఉంటే మరుగుజ్జులు పుట్టవచ్చు.

గర్భవతులలో అయోడిన్‌ లోపం ఉంటే – పిల్లలు తెలివి తక్కువతో, చెవుడు, మూగ, మెల్లకన్ను సమస్యలతో పుట్టొచ్చు.

అయోడిన్‌ లోపముండే గర్భవతులలో గర్భస్రావాలు కూడా ఎక్కువ.

మన శారీరక, మానసిక ఎదుగుదల అయోడిన్‌పై ఆధారపడి ఉంటుంది.

మనకు రోజూ కావాల్సిన అయోడిన్‌ 150 మైక్రోగ్రాములు. అంటే గుండు సూది తలపై పెట్టేంత మాత్రమే. ఈ లెక్కన జీవితాంతం ఒక స్పూను అయితే సరిపోతుంది.

కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలలో అయోడిన్‌ లోపం ఎక్కువ.

ఇప్పుడు అయోడిన్‌ కలిపిన ఉప్పు ప్రతి చోటా లభిస్తోంది.

అయోడిన్‌ కలిపిన ఉప్పునే వాడండి. భావితరాలు చురుకుగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.