వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా…
October 11, 2010
మహిళలను బాధించే ఆస్టియోపొరొసిస్‌
October 11, 2010

ఇదీ ‘అవాండియా’ కథ

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా సెప్టెంబర్‌, 2010లో ఐరోపా దేశాల్లో నిషేధించారు. అమెరికాలో దీనివాడకంపై మరిన్ని షరతులు విధించారు. మనదేశంలో ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. 1999 నుండి చలామణీలో ఉన్న ఈ మందువల్ల ఈలోగా ప్రజలకు జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? మనదేశంలో ఈ పరిస్ధితి ఎప్పటినుండో ఉంది. గతంలో మనదేశంలో చలామణీ అయిన ట్రోగ్లిటజోన్‌ పేరు గుర్తుంది కదా! ఎక్కడో విన్నట్లు ఉందని అనుకుంటున్నారా? ఇదే గ్రూపు(ధయజోలిడిన్‌డయోన్స్)కు చెందిన మరో పాత ఇన్సులిన్‌ సెన్సిటైజర్‌ గడిచినగాధ. సుమారు 63 మరణాలు -10లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ సంభవించాక 2000సం.లో నిషేధించబడింది. ఇప్పుడు అదే కధ పునరావృతమైతున్నది అవాండియా విషయంలో. అందుకే ఈ నేపధ్యంలో గ్లిటజోన్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!

భారతదేశంలో సుమారు 5కోట్ల మందికిపైగా డయా బెటిస్‌ రోగులున్నారు. ఇందులో 90శాతం పైగా టైప్‌2కోవకు చెంది నవారే.

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా సెప్టెంబర్‌, 2010లో ఐరోపా దేశాల్లో నిషేధించారు. అమెరికాలో దీనివాడకంపై మరిన్ని షరతులు విధించారు. మనదేశంలో ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. 1999 నుండి చలామణీలో ఉన్న ఈ మందువల్ల ఈలోగా ప్రజలకు జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా? మనదేశంలో ఈ పరిస్ధితి ఎప్పటినుండో ఉంది. గతంలో మనదేశంలో చలామణీ అయిన ట్రోగ్లిటజోన్‌ పేరు గుర్తుంది కదా! ఎక్కడో విన్నట్లు ఉందని అనుకుంటున్నారా? ఇదే గ్రూపు(ధయజోలిడిన్‌డయోన్స్‌)కు చెందిన మరో పాత ఇన్సులిన్‌ సెన్సిటైజర్‌ గడిచినగాధ. సుమారు 63 మరణాలు -10లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ సంభవించాక 2000సం.లో నిషేధించబడింది. ఇప్పుడు అదే కధ పునరావృతమైతున్నది అవాండియా విషయంలో. అందుకే ఈ నేపధ్యంలో గ్లిటజోన్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!

భారతదేశంలో సుమారు 5కోట్ల మందికిపైగా డయా బెటిస్‌ రోగులున్నారు. ఇందులో 90శాతం పైగా టైప్‌2కోవకు చెంది నవారే.

అవాండియా అంటే ? : అవాండియా అనేది కంపెనీపేరు. ఇందులో ఉండే రసాయనం పేరు రోసిగ్లిటజోన్‌. ఇది ధయజోలిడిన్‌డయోన్స్‌ అన్న గ్రూపుకు చెందినది. దీని తయారీదారు గ్లాస్కోస్మిత్‌క్లైన్‌ కంపెనీ 1999లో యుఎస్‌ఎఫ్‌డిఏ నుండి మార్కెటింగ్‌ అనుమతి పొందింది. మనదేశంలో ఇదేకంపెని ఉత్పత్తులైన విండామెట్‌, విండియా లాంటి కాంబినేషన్స్‌లో కూడా ఈ మందు ఉంటున్నది. ఇదిగాక ఇంకో ఆరేడు కంపెనీలు దీని జెనెరిక్‌ వెర్షన్స్‌ని మనదేశంలో చలామణీ చేస్తున్నాయి. మొత్తంగా మనదేశంలో రోసిగ్లిటజోన్‌ని సుమారు కోటిమంది టైప్‌2డయాబెటిస్‌ రోగులు వాడుతున్నట్లు అంచనా.

ఇన్సులిన్‌ సెన్సిటైజర్‌ అంటే? : టైప్‌ 2 డయాబెటిస్‌లో ప్రధాన సమస్య ఇన్సులిన్‌ నిరోధకత. అంటే టైప్‌1డయాబెటిస్‌లో లాగ ఇన్సులిన్‌ తయారీకి కోరతఉండదు. కానీ ఇన్సులిన్‌ ప్రభావం చూపాల్సిన కణజాలాల వద్ద ఉండే సమస్యవల్ల తయారవుతున్న ఇన్సులిన్‌ చూపాల్సినంత ప్రభావం చూపలేకపోతుంది.దీన్నే ఇన్సులిన్‌ నిరోధకత అంటాము. దీన్ని అధిగమించేట్లు చేయగలిగే మందుల్ని ఇన్సులిన్‌ సెన్సిటైజర్స్‌ అంటాము. రోసిగ్లిటజోన్‌(అవాండియా) కూడా ఇన్సులిన్‌ సెన్సిటైజర్‌గా పనిచేస్తుంది.

లాభాలెక్కువా ? నష్టాలెక్కువా? : ఏదైనా మందువల్ల కలిగే చిన్నపాటి నష్టాలకంటే లాభాలెక్కువుంటేనే కదా వాడతాం! అలా అనుకునే దీన్ని 1999లో అనుమతించారు. కానీ 2007లో డా.స్టీవెన్‌.ఇ.నిస్సేన్‌ అనే వైద్యనిపుణుడు న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయన ఫలితాల ప్రకారం ఈమందు వాడుతున్నవారిలో 43శాతం మందిలో గుండెపోటు, ఇతర గుండెవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువవుతున్నట్లు వెల్లడైంది. తదనంతరం ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సేఫ్టి మెడికల్‌ ప్రాక్టీసెస్‌ సంస్ధ జరిపిన అధ్యయనాల్లో ఒక్క 2009లోనే 1354మరణాలు అవాండియా వాడకం సంబంధితమైనవిగా నిర్ధారించింది. 2010 జులైలో 13000మంది అవాండియా బాధితులు నష్టపరిహారంకై కోర్టునాశ్రయించారు. ఇప్పటికి 46 కోట్లడాలర్లతో కొన్ని కేసులు జి.ఎస్‌.కె.కంపెని సెటిల్‌చేసుకుంది.

అవాండియాను నిషేధించారా? : ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూరోపియన్‌ మెడికన్స్‌ ఏజెన్సి ఐరోపా దేశాల్లో ఈ మందు లైసెన్స్‌ను సస్పెండ్‌చేస్తూ నిర్ణయాన్ని తీసుకుని మార్కెట్‌నుండి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అమెరికాలో యుఎస్‌ఎఫ్‌డిఏ కూడా ఈ మందు వాడకంపై తాజాగా మరిన్ని షరతులు విధించింది. మనదేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ 2009లో నియమించిన స్పెషల్‌ కమిటి ఈ మందు నిషేధించాల్సిన ఆవశ్యకతపై ఇంకా పరిశీలిస్తూనే ఉన్నది. బహుశా ఇంకొన్ని వేల మరణాలు సంభవించి అమెరికాలో యుఎస్‌ఎఫ్‌డిఏ పూర్తిగా నిషేధించేదాకా మనదేశంలో కూడా నిర్ణయం వెలువడకపోవచ్చు.

వాడుతున్నవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? : ఇప్పటికే రోసిగ్లిటజోన్‌ వాడుతున్నట్లయితే, ప్రత్యేకించి మూడునెలలకు పైనుండి ఈ మందు తీసుకుంటున్నట్లయితే, తక్షణం డాక్టర్‌ని సంప్రదించండి. గుండె పనితీరులో ఏదైనా అవాంఛనీయ మార్పులు జరిగాయేమో చెకప్‌ చేయమనండి. హార్ట్‌ రిధమ్‌, లెఫ్ట్‌వెంట్రిక్యులర్‌ ఫంక్షన్‌ వంటి అంశాలు చెక్‌ చేసుకోండి. శరీరబరువులో ఎంతమార్పు వచ్చిందో సరిచూసుకోండి. ఎందుకంటే అన్ని గ్లిటజోన్స్‌తో కలిగే సాధారణ మార్పు బరువు పెరగడం ( ఎడిమా). ఈ మందుని నిలిపివేయడానికి ప్రత్యామ్నాయ మందు సూచనకై మీ డాక్టర్‌ని కోరండి.

మనం ఏం చేయాలి? : రోగులమైతే తక్షణం రోజిగ్లిటజోన్‌ వాడకం గురించి డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ మందుకై ప్రయత్నించాలి. ప్రజారోగ్య పరిరక్షణ పట్ల బాధ్యతతో ఈ అంశాన్ని వీలైనంత ఎక్కువమంది డయాబెటిస్‌ రోగులకు తెలియజేయాలి.

ఆరోగ్య ఉద్యమకారులతో కలిసి ఈ మందుపై తక్షణం నిషేధం విధించమని డ్రగ్‌కంట్రోలర్‌జనరల్‌ఆఫ్‌ఇండియా మరియు కేంద్రఆరోగ్యశాఖమంత్రిత్వశాఖకు విజ్ఞప్తులు పంపించాలి. భారతదేశంలో ఇలాంటి కొత్తమందులను మార్కెట్లోకి అనుమతించే ముందు పూర్తిస్ధాయిలో ఫలితాలపై అధ్యయనం జరిపేందుకు కావల్సిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి.

డాక్టర్‌ కె.శివబాబు

రాష్ట్ర హెల్త్ సబ్‌ కమిటీ సభ్యులు

జనవిజ్ఞానవేదిక, జహీరాబాద్‌

ఫోన్‌ : 92462 77022

ఇమెయిల్‌ : [email protected]

(మూలం – ప్రజాశక్తి, 11 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.