ఎయిడ్స్ ఇలా కూడా రావచ్చు….!

హిస్టీరియా
August 3, 2010
ఆయుర్వేదం – గృహవైద్యం
October 1, 2010

ఎయిడ్స్ ఇలా కూడా రావచ్చు….!

ఎయిడ్స్ రావడానికి అవకాశాలేమిటి? సెక్స్ సంబంధాలు, రక్తమార్పిడి, కొన్ని సందర్భాలలో బ్లేడ్స్ వంటివి వాడడం వల్ల ఇవేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతున్నారు డాక్టర్లు. అంగ చూషణం వల్ల, ఆ సమయంలో వీర్యాన్ని సేవించినా ఎయిడ్స్ వచ్చే అవకాశాలను బొత్తిగా తీసిపారేయలేమని వారు అంటున్నారు. ముఖ్యంగా నోటిలో పుండ్లు ఉన్నవారు, నోటి పూట వంటివి ఉన్నవారు ఇలా చేస్తే ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారు అన్గాచూషణ చేస్తే ఎయిడ్స్ మాత్రమే కాకుండా ఎదుటి వారికి ఏ సుఖ వ్యాధులున్నా అవి సోకే ప్రమాదమున్నదని స్పష్టంగా తెలిసింది. భారత దేశంలో ఎయిడ్స్ వ్యాపించే వేగం ఇటీవల తగ్గుముఖం పట్టిందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

భారతదేశంలో చాప కింద నీరులా ఎయిడ్స్ వ్యాపిస్తోందని గత దశాబ్దంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. అప్పట్లో ఎయిడ్స్ గురించ అనేక అపోహలు ప్రజలలో ఏర్పడినా అదంతా మంచికే జరిగినట్టయ్యింది. ప్రభుత్వ ప్రచారం వల్ల కూడా ఎయిడ్స్ గురించి అవగాహన మరీ పెరిగింది. అయినా కొన్ని వదంతులు మాత్రం ఇంకా ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి. అందులో మరీ ప్రముఖంగా పేర్కొనవలసింది… హేర్ఫిస్ వంటి సుఖవ్యాధులు ఎయిడ్స్ గా రూపాంతరం చెందుతాయనేది. నిజానికి ఏ సుఖవ్యాధీ కూడా ఎయిడ్స్ గా రూపాంతరం చెందడమనేది జరగదు.

ఎయిడ్స్ కారక వైరస్ వేరు, మిగిలిన సుఖ వ్యాధులకు కారణమైన వైరస్ వేరు. ఇతర వైరస్ లు ఎయిడ్స్ వైరస్ గా మారడమనేది జరగదు. కాకపొతే ఎయిడ్స్ వైరస్ లోనే గుణగణాల రీత్యా కొన్ని తేడాలుండడం, వైరస్ కొన్ని మార్పులకు తరచూ లోను కావడం వల్ల వ్యాక్సిన్ రూపొందించడం కష్టంగా మారిందన్నది నిజమే. ఇటీవల ఎయిడ్స్ వ్యాక్సిన్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించినా అది పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వగలదా అనే విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఒకవేళ మంచి ఫలితాలను ఇవ్వగలిగినట్లయితే ఒక మహమ్మారి వ్యాధి నుంచి మానవాళికి విముక్తి కలిగినట్ట్టే.

– డా. జి.సమరం

(మూలం – తెలుగువన్.కామ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.