మొలకగింజలలో పోషకాలు!
November 29, 2010
వెరికోస్‌ వీన్స్‌ వాటి బాధలేమిటి ?
December 6, 2010

ఒబెసిటీతో గర్భం ప్రమాదమే

ఒకప్పుడు లావుగా ఉన్న గర్భిణులే ఆరోగ్యవంతమైన శిశు వుకు జన్మనిస్తారని అనేవారు. కానీ నేటి పరిస్థితుల్లో గర్భి ణులు రోజు రోజుకూ లావు అవుతుంటే ఇబ్బందే అంటున్నా రు నేటి డాక్టర్లు. రోజు రోజుకు బరువు పెరుగుతూ లావు అవుతుంటే అది ఒబెసిటీ కావచ్చని వారు చెబుతున్నారు. గర్భిణీలు ఒబెసిటీలో బాధపడుతుంటే ప్రమాదమే.

గర్భం ధరించినప్పుడు ఒబెసిటీతో ఇబ్బంది పడు తుంటే పుట్టే శిశువు తక్కువ బరువుతో జన్మించ డమే కాకుండా కొన్నిసార్లు డెలివరీ ఫెయిల్యూ ర్‌ కూడా కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో మారుతున్న జీవన విధానం, వాతావరణ కాలుష్యం మూలంగా గర్భిణు ల్లో ఒబెసిటీ శాతం ఉన్న వారు పెరుగుతు న్నారని డాక్టర్లు చెబుతున్నారు.

గర్భిణు ల్లో ఒబెసిటీతో పాటు హై బ్లడ్‌ ప్రెషర్‌ ఉంటే వారికి తక్కువ బరువు ఉన్న శిశు వు జన్మించడంతో పాటు కొన్నిసార్లు డెలివరీ ఫెయిల్‌ అవుతుందని విఎల్‌సి సి ఆర్‌ అండ్‌ డి హెడ్‌ డాక్టర్‌ వీణా అగర్వాల్‌ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్ర్తీలు పోష కాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చె ప్పారు.

గర్భిణులు డైట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. తక్కువ బరువుతో పుట్టే బిడ్డలు తిరిగి బరువు పెరిగేందుకు సమయం పడుతుందన్నారు. ఓవర్‌ఫీడింగ్‌తో హెల్దీగా మార్చడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో వారు మెటబాలిక్‌, కార్డియోవాస్క్యులర్‌ హెల్త్‌పై ప్రభావం పడుతుందని చెప్పారు. ఇటీవల పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఓ సర్వేలో గర్భిణీల్లో ఒబెసిటీ ప్రభావం తెలిసింది.

పట్టణ ప్రాంతాల్లోని గర్భిణీలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారని ఇందులో తేలింది. ఇక్కడ జరిగిన కాన్పుల్లో దాదాపు 24 శాతం మంది శిశువులు తక్కువ బరువుతో జన్మి స్తుండగా 14శాతం సాధారణ బరువుతో పుడుతున్నారని, మిగతా శిశువులు ఆరోగ్యంగా జన్మినిస్తున్నారని ఈ సర్వే తేల్చింది.

ఒబెసిటీ గర్భి ణీకి జన్మించిన శిశువు తక్కువ బరువుతో పుడితే అతనికి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌తో పాటు టైప్‌2 డయాబిటీస్‌, కార్డియోవాస్క్యులర్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీగా ఉన్నప్పుడు తల్లి బరువు ఎంతో ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. గర్భం ధరించకముందు ఎంత బరువు ఉన్నారు, గర్భం ధరించిన తర్వాత బరువు ఏ విధంగా పెరుగుతున్నారో తెలుసుకోవడం అత్యవసరమని వారు అంటున్నారు.

అదేవిధంగా ఒబెసిటీతో ఉన్న గర్భిణీకి లావుగా ఉన్న కొడుకు పుడితే అతను కూడా ఒబెసిటీతో భాధపడే అవకాశాలున్నాయని అంటున్నారు. ెహల్దీ ప్రెగ్నెన్సీ కోసం, తక్కువ బరువుతో పుట్టే శిశువు జననాలను తగ్గించేందుకు తల్లులు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని వారు సూచిస్తు న్నారు. పౌష్టికాహారం తీసుకున్న గర్భిణీలకు ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారు. ‘హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌తో బాధపడే గర్భిణీలకు ఒబెసిటీ తప్పనిసరిగా వస్తుంది.

ఈ పరిస్థితుల్లో తల్లులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గర్భిణీలు అనుసరించే జీవన విధానం, వ్యాయామాలు, రెగ్యుర్‌ స్క్రీనింగ్‌ గురించి వారికి తెలియజేయాలి. వారు హై న్యూట్రిషన్‌ ఫుడ్‌ తీసుకోవాలి. హై ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌తో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే కడుపులో బిడ్డ ఆరోగ్యవంతంగా ఎదగగల్గుతారన్న విషయం గర్భిణీలు తెలుసుకోవాలి.

వారు ప్రతి రోజు తప్పనిసరిగా 2000 క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుగుణ శుక్లా అన్నారు. పౌష్టికాహారంతో పాటు గర్భిణీలకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కూడా ఎంతో ముఖ్యం. తొమ్మిది నెలల గర్భం సమయంలో ఇది ఎంతో అవసరం. డాక్టర్ల సలహా ప్రకారం ప్రెగ్నెన్సీ ఎక్సర్‌సైజులు చేయడం కూడా మంచిది. ఆల్కహాల్‌, పొగాకుకు గర్భిణీలు దూరంగా ఉండాలి. వీటి మూలంగా పుట్టే శిశువుకు ఎంతో హాని జరుగుతుందన్ని విషయాన్ని వారు తెలుసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.