హైపర్‌టెన్షన్‌తో బహుపరాక్‌
November 22, 2010
హైపర్‌టెన్షన్‌ నియంత్రణకు ఆహార నియమాలు అవసరం
November 29, 2010

ఒళ్లంతా పచ్చగా

పచ్చకామెర్లు వైరస్‌ వల్ల కలిగే కాలేయ వ్యాధి. ఈ వైరస్‌లో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌ అనే ఆరు రకాలున్నాయి. దీనిలో ముఖ్యంగా హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి చెప్పుకోతగ్గవి. వీటి గురించి తెలుసుకుందాం.

హెపటైటిస్‌-ఎ సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు. ఇది ఒక్కోసారికి సమాజంలో చాలా మందికి రావచ్చు. ఇది ‘ఫీకో ఓరల్‌’ రూట్‌ ద్వారా కలుగుతుంది. అంటే మలం నుండి తినే ఆహారం గాని, నీరుగాని కలుషితమైతే సంభవిస్తుంది.

 లక్షణాలు

లక్షణాలు బయటపడడానికి 15 నుండి 50 రోజులు పట్టవచ్చు. వ్యాధి రావడానికి ముందే చలి జ్వరం, తలనొప్పి, వొళ్లంతా నొప్పులుగా వుంటుంది. ఆకలిలేమి, వికారం, వమనం, విరేచనాలుంటాయి. మూత్రం పసుపు పచ్చగా వస్తుంది. కళ్లు, నాలుక పచ్చగా మారుతుంది. కొద్ది రోజులకు ఒళ్లు కూడా పచ్చగా కన్పిస్తుంది. గోర్లుకూడా పచ్చగా వుంటాయి. కాలేయం కొద్దిగా పెరుగుతుంది. కాలేయ భాగం నొక్కితే నొప్పిగా వుంటుంది. కొందరిలో ప్లీహం కూడా పెరుగుతుంది. మలం తెల్లగా మారుతుంది. ఒళ్లంతా దురద రావడం, కీళ్ళనొప్పులు కూడా వుంటాయి. 3 నుండి 6 వారాల్లో వ్యాధి నయమవుతుంది.

వ్యాధి నిర్ధారణ 

 మూత్రంలో బైల్‌ పింగ్మెంట్సు కనిపిస్తుంది. రక్తంలో సీరం ఎంజైములు బాగా ఎక్కువగా కన్పిస్తాయి. రక్తంలో సీరం బలురూబిన్‌ ఎక్కువగా వుంటుంది. లివర్‌ ఫంక్షన్‌ టెస్టులో వైరుద్యమైన మార్పులు వుంటాయి. లివర్‌ మార్కర్స్‌ ద్వారా వైరస్‌ రకాన్ని బట్టి గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌లో లివర్‌ గురించి తెలుసుకోవచ్చు.

హెపటైటిస్‌ బి

కాలేయ వ్యాధి వున్న వారి రక్తం ఇంకొకరికి ఎక్కించడంవల్ల, వారికి వాడిన సూదితో వేరెవరికైనా గుచ్చినా, ఈ వ్యాధి వున్న వారితో లైంగిక సంపర్కం చేసినా ఈ వ్యాధివున్న తల్లి నుండి గర్భస్థశువునకు సోకుతుంది. ఇది హెపటైటిస్‌-ఎ కన్న చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది క్రానిక్‌ హెపటైటిస్‌గా, సిరోసిస్‌గా, లేక లివర్‌ క్యాన్సర్‌గా గాని మారవచ్చు. దీనికి చికిత్స లేదు. నివారణణే దీనికి ముఖ్యమెంది. ఏదైనా ఈ వ్యాధితో కలుషితమైన సూది గుచ్చుకుంటే వెంటనే వారికి వాక్సిన్‌ ఇవ్వాలి. వ్యాధి వున్నవారితో సెక్సులో పాల్గొంటే 14 రోజుల్లో వాక్సిన్‌, మళ్లీ ఇమ్యూనో గ్లోబిలిన్‌ కూడా ఇవ్వాలి. పసి పిల్లలకు పుట్టిన వెంటనే వ్యాక్సిన్‌ ఇవ్వాలి.

హెపటైటిస్‌- సి

సూది గుచ్చినప్పుడు, (వ్యాధితో కలుషితమైన) రక్తం ఎక్కించినప్పుడు వ్యాధి వున్నవారి నుండి సోకుతుంది. ఈ వ్యాధి హెపటైటిస్‌-బితో కూడినదైతే చాలా ప్రమాదం. ఈ వ్యాధి లివర్‌సిరోసిస్‌గా గాని లివర్‌ క్యాన్స్‌ర్‌గా మారవచ్చు. దీనికి వ్యాక్సిన్‌ కూడా పని చేయదు.

చికిత్స

విశ్రాంతి చాలా అవసరం. వాంతులు, వికారం వుంటే నోటి ద్వార ఎక్కువగా గ్లూకోజ్‌, కొబ్బరి నీళ్లు పళ్ళరసాలు ఇస్తూ, నరానికి కూడా గ్లూకోస్‌ ఇవ్వాల్సి వుంటుంది. విటమిన్‌-బి కాంప్లెక్సు ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. విటమిన్‌-సి కూడా ఇంజెక్షన్‌ రూపంలోగానీ, బిళ్లల రూపంలో గానీ ఇవ్వాలి. మద్యపానానికి దూరంగా వుండాలి. మలమూత్రంతో మురికైన బట్టలు, సిరంజలు ఐసోలేషన్‌ కంటైనర్‌లో వెయ్యాలి. మల్టీవిటమిన్‌, విటమిన్‌-కె ఇంజెక్షన్‌ ఇవ్వాలి. దద్దుర్లుగాని దురదగాని వుంటే ‘కొలిస్టరిమిన్‌’ మందు ఇవ్వాలి.

ఆకలి మామూలైనప్పుడు ఆహారం ఎక్కువగా ఇవ్వాలి. మజ్జిగ, పళ్ళరసాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. పప్పు దినుసులు, కూరగాయలు మామూలుగా వుడకబెట్టి ఇవ్వాలి. పౌష్ఠికాహారం ఇవ్వడం వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. ఇన్‌ఫెక్షన్‌ వుంటే నియోమైసిన్‌, మెట్రో నిడజాల్‌, ప్రెడ్సిసలోన్‌ మాత్రలు ఇవ్వాలి. కొన్ని మందులు కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అందుకని ఈ మందులన్నీ డాక్టరు పర్యవేక్షణలోనే వాడాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి

చీఫ్‌ ఫిజిషియన్‌,

మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్‌ క్లీనిక్‌,

ఎంహెచ్‌ భవన్‌ అజామాబాద్‌, హైద్రాబాద్‌.

ఫోన్‌ : 9676376669

 

2 Comments

 1. prasad says:

  హెపటైటిస్‌ బి గురించి mimmalni kalavali

  • Ramesh Bandi says:

   Dear sir, my son is suffering with jaundice since two days, he is 10 yrs old. Presently we taking homeo medicine along with pasara vaidyam. Please tell me which type of food I use, can I give salt, garlic, ginger to him or not?

   Waiting for your valuable reply.

   Thank you sir.

   Regards,

   Bandi Ramesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.