కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లెన్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్ కలర్‌కి మ్యాచ్ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది.
అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్ కె.ఎస్. పార్ధసారధి వెల్లడించారు.
సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్ ప్రభా వాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగా లువిపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు.
శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్ ఆఫ్ రేడి యోలాజికల్ ప్రొటెక్షన్ (ఐసిఆర్‌పి) గాగుల్స్ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.
రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.
– బి.జె.లత
2 Comments
sir,
i have sme eye problem i have 3.1 points by testing please can you suggest me any suggestion
sir..
my eyes light yellow and reddish col…
pls can you suggest me any sugges…