ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది.
*కష్టతరమైన పనులు చేసేవారు – వ్యవసాయ కార్మికులు, రిక్షా తొక్కేవాళ్లు, దూరం నుండి నీళ్లు తెచ్చుకునేవారు, హమాలీలు.. ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.
* ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది.
* రోజువారి పనులు నడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది.
* ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి.
* మీకు ఆనందానిచ్చే వ్యాయామాన్ని ఎన్నుకోండి. వ్యాయామానికి వయస్సుతోనిమిత్తం లేదు.
* దీర్ఘకాలిక వ్యాధులు కలవారు, 40 ఏళ్లు దాటిన వారు కొత్తగా వ్యాయామం మొదలు పెట్టాలంటే డాక్టరు సలహా తీసుకోవాలి.
* ఏ వ్యాయామమైనా ఒక్కటే.
* శక్తికి మించి వ్యాయామం చేయకూడదు.
* ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది.
* నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించాలి. టైము ముఖ్యం కానీ సమయాల్లో దగ్గర పనులకు నడిచి వెళ్లాలి.
మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !
డాక్టర్ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్
2 Comments
Sir my name is sandeep age 22 hight 5.7 weight 75 naa kaalu thodalu lavuga unnai thaggalante em cheyyali please replay me
సందీప్ గారు ప్రతి రోజూ తప్పక నడవండి. అలాగే డాక్టరు గారు చెప్పిన సలహాలు పాటించండి.