అవలోకన చేసుకుంటే అపార్థాలు తొలగిపోతాయ్‌
July 3, 2011
క్యారెట్‌తో మేధో వికాసం!
July 5, 2011

కాల్షియం లోపిస్తే………..

మీ శరీరంలో కాల్షియం తక్కువగా ఉండి శారీరక దుగ్మతలు అధికంగా వస్తున్నాయన్న భావన మీలో అధి కంగా ఉందా? అయితే మీకు మీరుగా కాల్షియం టాబ్లెట్లు తీసేసుకుని వాడేయకండి. డాక్ట్టర్‌ని సంప్రదించడం ద్వారా వారు సూచించిన కాల్షియం టాబ్లెట్లను మాత్రమే విని యోగించడం మంచిది. 400, 600 మిల్లీ గ్రాములుం డే ఈ కాలియం టాబ్లెట్లలో మీ శరీరతత్వంబట్టే వినియోగిం చాల్సి ఉంటుంది. ఇవి వివిధ రకాల ఫ్లావర్లలోనూ దొరు కుతున్నాయిప్పుడు మార్కెట్‌లో.. వీటిలో మీకిష్టమైన రుచిని మాత్రమే ఎంచుకోండి. పెద్దసైజులో ఉండే టాబ్ల ట్లు మీరు మింగలేక పోవచ్చు. అందువల్ల ముక్కలుగాచేసి వాడి నా ఫలితం ఒక్కలా నే ఉంటుంది.
మీకు అవసరం ఉన్నంతవరకు మా త్రమే టాబ్లట్లని వినియోగించడం మంచిది. అయితే ఒక్కోసారి సైడ్‌ ఎఫెక్టులు రావచ్చు.

 

కడుపుబ్బరం, వికా రం, మలబద్దకం, విరేచనాలు ఇలా పలు సమస్యలు వేధించవచ్చు. ఖాళీ కడుపుతో ఎప్పుడూ కాల్షియం తీసు కోవటం మంచిది కాదు. అది మరో పరిణామానికి దారి తీయచ్చు.

నీరసంగా ఉంది కదా అని వరుసగా రెండు మూడు ట్యాబ్లట్లు తీసుకున్నా ప్రమాదమే. ఎందు కంటే రోజుకి మన శరీరం 1000 నుండి 1500 మిల్లీ గ్రాములు మాత్రమే అవ సరం అవుతుంది. అదనపు కాల్షియం మీలో చేరితే అది మూత్ర పిండాలలో రాళ్ల రూపంగా సమస్యగా మారొచ్చు. విటమిన్‌ డి తక్కువగా ఉండటం వల్లే మీ లో కాల్షియం తక్కువగా ఉండటానికి కారణం కావచ్చు.

పాలు, సోయా పాలు, వివిధ రకాల మల్టీ విట మిన్‌ లతో దీనిలోటుని పూరించవచ్చు. అలాగే పలు ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా విటమిన్‌ డిని మన శరీరానికి అందించ వచ్చు. ముఖ్యంగా ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటైనా ఉదయాన్నే సూర్య కాంతిని ఆశ్వాదించడం వల్ల కూడా ఈ లోపా న్ని సరిదిద్దుకోవచ్చు.

ఆంధ్రప్రభ దినపత్రిక, 28 జూన్ 2011

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.