దగ్గు… ప్రేరకాలు
November 9, 2010
సంతానలేమికి చక్కటి పరిష్కారం ఐవిఎఫ్‌
November 9, 2010

కీళ్ల నొప్పులు.. హోమియో చికిత్స

నేటి ఆధునిక యుగంలో కీళ్ళ నొప్పులు చాలా మందిని వేధిస్తున్నాయి. ఒకప్పుడు కీళ్ళ నొప్పులు వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే సమస్యగా భావించేవారు. కాని మారిన జీవనశైలి విధానం వలన కాలంతో పరుగులు తీస్తూ, సరియైన పోషక ఆహారం తీసుకోక, వ్యాయామం చేయుట వీలుకాక, ఎక్కువసేపు కదలకుండానే విధులను కూర్చుండే నిర్వర్తించ వలసి రావడంతో ఊబకాయం కూడా తోడై కీళ్ళ సమస్యను నేడు ఇరువై, ముప్ఫైయి ఏళ్ళ వయస్సులోనే ఎదుర్కోవడం జరుగుతుంది. సాధారణంగా కీళ్ళకు సంబంధించిన వ్యాధులను ‘ఆర్థరైటీస్’ అంటారు. ఆర్థరైటిస్ అనగా – కీళ్ళలో వాపుతో పాటు నొప్పి అధికంగా ఉండి కదలలేక పోవుట. ఆర్థిరైటిస్ చాలా రకాలున్నాయి. వయసును బట్టి, కారణాలను బట్టి శరీరములోని వివిధ ప్రాంతాలు ఆర్థరైటిస్‌కు గురికావడం జరుగుతుంది.
(1) రుమటాయిడ్ ఆర్థరైటీస్ (2) ఆస్టియో ఆర్థరైటీస్ (3) గౌట్

రుమటాయిడ్ ఆర్థిరైటిస్

మోకాళ్ళు, మోచేతులు, చీలమండలు, కాలి వేళ్ళు, మణికట్టు, భుజాలు, నడుము, వెన్నుముక భాగాలు వాపుతో కూడిన నొప్పితో బాధిస్తూ ఉంటాయి. ఈ సమస్యతో మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు జ్వరం రావటం, వ్యక్తి కదల్లేకపోవటం సంభవిస్తుంది. కీళ్ళ ప్రాంతంలో ‘నాడ్యుల్స్’ అనబడే బొడిపెల వంటి ఎముకల ఉబ్బెత్తులు ఏర్పడి ఉంటాయి. ఈ ముఖ్య లక్షణం ఆధారంగా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌గా గుర్తించాలి. ఈ వ్యాధి శరీరం లోని అన్నిరకాల కీళ్ళకు సంభవించవించే అవకాశాలు ఉన్నాయ

ఆస్టియో ఆర్థిరైటీస్

 సాధారణంగా ఎక్కువ శాతం మందిలో వచ్చే కీళ్ళనొప్పి ఈ రకానికి చెందినదేఉంటుంది. బాగా బరువును మోసే కాళ్ళు ఈ వ్యాధికి ఎక్కువగా గురికావటం జరుగుతుంటుంది. ముఖ్యంగా మోకాళ్ళు ఈ వ్యాధికి గురై నొప్పి, వాపును కలిగి ఉండి కదలటం కష్టంగా మారుతుంది. స్థూలకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా కూర్చోవడం కదలటం, ఇబ్బందిగా మారుతుంది.

గౌట్

గౌడ్ వ్యాధి మొదట కాలి బొటన వేలుతో మొదలై తరువాత మోకాళ్ళు, భుజము, మోచేయి, మణికట్టు, వేళ్ళ కణుపులు నొప్పికి గురై బాధిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు కీళ్ళు కదిలించటం కష్టంగా ఉంటుంది. ఈ వ్యాధి రక్తంలో ‘యూరిక్ ఆసిడ్’ స్థాయి పెగడం వలన సంభవించే అవకాశాలు ఉంటాయ.

కీళ్ళ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

(1) ఉడ్గ (2) గ.. ఘషఆ్య (3) సీరం యూరిక్ ఆసిడ్ (4) గేజ (5) ఎక్స్‌రేలు ఆయా కీళ్ళకు సంబంధించినవి (6) ళఱ-కీళ్ళ నొప్పులకు హోమియో వైద్యంలో చక్కని చికిత్స కలదు. వ్యాధి తొలి దశలోనే ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.

 

జాగ్రత్తలు

* ఆల్కహాలు, స్మోకింగ్ మానివేయాలి.
*కీళ్ళనొప్పులు అధికంగా ఉన్నప్పుడు బరువులు ఎత్తకూడదు.
*స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గుటకు ప్రయత్నించాలి.
*కాల్షియం ఉన్న పోషక ఆహారం తీసుకోవాలి. (పాలు, గుడ్లు, పెరుగు వంటివి).
*ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవటం నివారించాలి.
*వ్యాయామం, నడక, సైక్లింగ్ వలన కీళ్ళ నొప్పులు అధికమవుతున్నట్లు అనిపించినా కూడా వ్యాయామం ప్రతిరోజు కొద్దిసేపు చేయుటకు ప్రయత్నించాలి.
*అతిగా పెయిన్ కిల్లర్స్ వాడొద్దు

చికిత్స

రుస్‌టాక్స్

 కూర్చుంటే బాధలు ఎక్కువ ఉండి, కదలిక వలన ఉపశమనం కలుగును.

బ్రయోనియా

 ఏ మాత్రం కదిలిన బాధ ఉండును. వీరికి అమిత దాహం కలిగి ఉండును. వీటితోపాటు మలబద్దకం, జిగురు పొరలు పొడి ఆరిపోతాయి.
ఏపిస

 కాళ్ళు, చేతులు నీరుపట్టి నొక్కతే గుంటలు పడతాయి. కీళ్ళు వాపును కలిగి ఉండి నొప్పి ఉంటుంది. వీరికి చల్లని వాతావరణం, చన్నీటి స్నానం హాయిగా ఉంటాయి. ఇలాంటి వారికి ఈ ఔషధం అలోచించదగినది.

ఆర్పినికం ఆల్బం

నొప్పులు అధికంగా ఉండి, జ్వరం, వాపు, దాహం ఎక్కువగా ఉంటుంది. వీరు మానసికంగా విచారం, దిగులు అపరాధ భావనతో కూడిన ఆందోళన, వ్యాధి తగ్గదని నిరాశను కలిగి ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది.

లెడంపాల్

కీళ్ళు వాచి నొప్పి పెట్టి ఉంటాయి. నొప్పులు పాదాల్లో, మడమల్లో ప్రారంభమై క్రమంగా పైకి పాకుట ఈ మందులోని ముఖ్యలక్షణం.

మెర్క్‌సాల్

 గనేరియా, సిఫిలిస్‌ల్ని అణగదొక్కడం వల్ల ఆర్థిరైటీస్ వస్తే ఇది వాడాలి. ఇలా లక్షణ సముదాయమును బట్టి హోమియో మందులను డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే కీళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చును.

 

డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, హోమియో ఫిజిషియన్, హన్మకొండ

1 Comment

  1. saikrishna says:

    hello sir…,
    please tell me treatment for mokalu arugutaki…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.