కారణం తెలియని కడుపునొప్పి
October 25, 2010
మీకు సూది పిచ్చి ఉందా?
October 25, 2010

కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు

వ్యాయామం విషయంలో రోగులలో అనేక అపోహలున్నాయి. అధిక వ్యాయామం వల్ల మెట్లు ఎక్కడం వల్ల, నేలమీద కూర్చోవడం వల్ల ఇంకా అరుగుదల ఎక్కువైతుందని భావిస్తారు. కానీ వ్యాయామం తగినంత మోతాదులో చేయడం, క్రమ పద్ధతిలో నడవడం వల్ల బరువు తగ్గుతారు. మధుమేహం, రక్తపోటు తగ్గుతాయి. ఎముకలు, కీళ్ల పక్కన గల కండలు, టెండాన్స్గట్టిపడి ఎముక మీద పడే బరువులో కొంత భాగం కండల మీదకు మార్పిడి జరిగి దీర్ఘకాలం మన్నడానికి, కీళ్లలోని సైనోవియల్ద్రవం గుణాత్మకంగా పెంపొందడానికి ఎంతో తోడ్పడుతుంది.

ప్రతీ కీలు మూలకదలికలను వ్యాయామంలో రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి ఆక్టివ్‌ ఎక్సర్‌సైజ్‌, రెండు పాసివ్‌ ఎక్సర్‌సైజ్‌.ఆక్టివ్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే ఒక కీలు స్వయం సిద్ధంగా వివిధ కోణాలలో కదపగలగడం. అంటే కాలి వేళ్లు, చేతి వేళ్లు, మోకాలి కీలు, తుంటికీలు సహజసిద్ధంగా కదిలే మోతాదులో బాగా కదపడం, బస్కీలు తీయడం, పరుగెత్తడం వంటివి. పాసివ్‌ ఎక్సర్‌సైజు అంటే ఒక కీలు సంపూర్ణంగా కదలడానికి వీలుగా వేరొక కీలు లేక ఇతర పరికరాల సహాయంతో కదపడం. ఉదాహరణకు బిగుసుకుపోయిన కీళ్లను సరిచేయడానికి ట్రాక్షన్‌ పద్ధతిలోగాని వేరొక కీలుసహాయంతో సాగదీసే ప్రయత్నాన్ని కాని పాసివ్‌ ఎక్సర్‌సైజ్‌ అంటాం.

 తుంటికీలు (హిప్‌, కటివలయం) ఎక్సర్సైజులు

నేలపై చాప పరిచి వెల్లకిలా పడుకోవాలి. ఒక్కొక్క కాలును నిలువుగా భూమి నుంచి 40 డిగ్రీల ఎత్తు వరకు 2 నిమిషాల చొప్పున నిలబెట్టాలి. కుడి పక్కకు తిరిగి ఎడమ కాలిని నిలువుగా సైడుకు ఎత్తాలి. అదేవిధంగా ఎడమ పక్కకు తిరిగి కుడికాలిని ఎత్తాలి. ఇదే వ్యాయామం కాలి కొన భాగంలో బరువును కట్టి దాన్ని నిలువుగా వివిధ కోణాలలో కాలిని ఎత్తడం ద్వారా తుంటికీలు బాగా బలం పొందుతుంది. వీలును బట్టి సంపూర్ణ పద్మాసన వ్యాయామం, బస్కీలు తీయడం కూడా చేయొచ్చు.

ఐసొమెట్రిక్‌, ఐసోటానిక్వ్యాయామాలు

ఒక ఎత్తైన బల్లమీద కూర్చొని మోకాలిని కిందకు వేలాడదీసి, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం. కాలికింద భాగంలో బరువు వేలాడదీసి దాని ద్వారా నిలబెట్టడం, కాలిని ఊపడం చేయాలి. ఈ వ్యాయామం ద్వారా కాలి కండరాలు గట్టిపడతాయి. కీలు లూబ్రికేషన్‌ బాగా పెరుగుతుంది.

మడిమ, పాదాల వ్యాయామం

వేడి నీళ్లలో మధ్య కాలు వరకు మునగనిచ్చి, ఆంకిల్‌ కీలు, పాదం వేళ్లను వివిధ కోణాలలో కదపడం, ముని వేళ్ల మీద నిలబడి బస్కీలు తీయడం ద్వారా మడిమ కీలు, పాదం వేళ్లలోని కీళ్లు గట్టిపడతాయి.

మణికట్టు, చేతి వ్యాయామం

పై పద్ధతిలాగా వేడి నీటి సహాయంతో అన్ని కదలికలు చేయాలి. మెత్తటి బంతి ద్వారా, రిస్ట్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా బాగా బిగించి వదలడం వల్ల చేతి కండరాలు మంచి పటుత్వాన్ని పొందుతాయి. అవతలి చేతి సహకారంతో చేసే పాసివ్‌ ఎక్సర్‌సైజు వల్ల వేళ్లు, రిస్ట్‌ వేళ్లలోని బిగుతు చాలా వరకు తగ్గుతుంది.

మోచేయి వ్యాయామం

మోతి కీలు వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలును ఒక టేబుల్‌ పై సమాంతరంగా ఉంచి బలంగా ముందుకు వెనక్కు కదపాలి. వేడి నీళ్లలో మోచేతిని ముంచి గుండ్రంగా తిప్పడానికి ప్రయత్ని ంచాలి. స్క్రూడ్రైవర్‌ సహకారంతో స్క్రూను తిప్పడం వంటి ఎక్సర్‌సైజు ద్వారా మోచేతి, మణికట్టు రొటేషన్‌ బాగా చేయొచ్చు.

భుజం, భుజవలయం వ్యాయామాలు

భుజం కీలును రెండో చేతి సహాయంతో పైకి కిందకు కదపడం, మొత్తం చేతిని గోడకు ఆనిచ్చి సున్నితంగా గోడపైకి చేతిని పాకిస్తూ భుజాన్ని పైకి కదపడం. షోల్డర్‌ వీల్‌ ఉపయోగించి భుజం, భుజవలయంపై వరకు కదపడం వంటి వ్యాయామం చేయాలి.

ఎట్టి పరిస్థితులలోను భుజం, మోచేయి, రిస్ట్‌ కీళ్లపై ఆయింట్‌మెంట్సు, జెల్స్‌, ఆయిల్స్‌ వంటివి పూయరాదు. కేవలం వీటి వల్లే ఈ కీళ్లపై ఉన్న పలుచని కండలు (రిబ్బన్‌ కండరాలు), టెండాన్స్‌ పూర్తిగా పట్టుకుపోయి కీళ్లు కదలడం చాలా కష్టమైతుంది. భారతీయ సాంప్రదాయక వైద్యంలోని ఈ మసాజ్‌ ప్రక్రియ భుజం, మోచేయి, రిస్ట్‌, చేతి వేళ్లలోని అనేక దుష్ఫలితాలు చూపిస్తుంది.

డాక్టర్జె. భాను కిరణ్

ఆర్థొపెడిక్సర్జన్

డాక్టర్వెంకట రామప్ప హాస్పిటల్

సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ

బెంగళూరురోడ్డు, అనంతపురం.

ఫోన్‌ : 08854272881

(మూలం – ప్రజాశక్తి, 25 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.