క్యారెట్‌తో మేధో వికాసం!

కాల్షియం లోపిస్తే………..
July 4, 2011
గర్భిణీలూ.. “సెల్‌’ మాటలు తగ్గించండి…..
July 30, 2011

క్యారెట్‌తో మేధో వికాసం!

పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్‌ ఎంతో మంచిదంటున్నారు డాక్టర్లు.

సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టప డరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందు లోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసి కంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.

వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యా రెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకు న్నట్ల యితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లబి ్థస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇంతే కాక క్యారెట్‌లో విటమిన్‌ ఃఎః ఉంటుంది. ఃఎః విటమిన్‌ వల్ల కంటిచూపుకు ఎంతో మేలు కల్గుతుంది. క్యారెట్‌ను అధికంగా తింటే కంటిజబ్బులు కూడా మటుమాయమవు తాయి. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక చెప్పవచ్చునంటు న్నారు డాక్టర్లు. క్యారెట్‌ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్‌ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉంటూ కాలిన గాయం బాధ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కూడా కల్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు దోహదపడు తుంది. అంతే కాక కాలిన గాయాల మచ్చలు కూడా క్యారెట్‌ రసం పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.

ఇక చిన్నారులు ఈ క్యారెట్‌ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు సేవించినట్లయితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్‌ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది. క్యారెట్‌ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి. అలాగే ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్‌ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

ఇక ఈ క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంత గానో దోహదపడతాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. క్యారెట్‌ను తీసు కోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తే జపర్చడమే కాక, ఆలోచనాశక్తి కూడా పెరిగేలా చేస్తుందంటు న్నారు నిపుణులైన వైద్యులు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్‌ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తే జంగా ఉండేలా చేస్తుంది. క్రీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానికలాేగా ఉపయోగ పడుతుంది. రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యారెట్‌తోపాటు కాస్త తేనెను కలిపి పిల్లలకు ఇచ్చినట్లయితే వారి చర్మం కాంతివంతంగా తయారవు తుంది. దీర్ఘకాలిక రోగాలను సైతం క్యారె ట్‌లోని యాంటీ యాక్సిడెంట్స్‌ నయం చేస్తాయి. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.

ఇంకా ఈ క్యారెట్ల జ్యూస్‌ వల్లా, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తినడం వల్లా నోటి అల్సర్‌ నివారణ సాధ్య మవుతుంది. క్యారెట్‌, టవెూటా, బత్తాయి పండ్ల రసాలను సమపాళ్ళలో తీసుకుని రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వాడి నట్లయితే, నోటి అల్సర్‌నున పూర్తిగా నివారించవచ్చు. ఇంతే కాక నిద్రలేమి కి కూడా క్యారెట్‌ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకనే చిన్నారులకు రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌ ఇచ్చి నట్లయితే వారు ఎంతో హాయిగా చక్కగా నిద్రిస్తారు. మంచి ఆహారం, మంచి నిద్ర పిల్లల మేథోవికాసానికి, భౌతిక వికాసా నికి ఎంతో దోహదపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. క్యారెట్‌ తినడం వల్ల మంచి పోషక విలువలు దేహానికి లభించి, మంచి ఆరోగ్యం చేకూరుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

మరి ఇంత మేలు చేసే, ఇన్ని ఔషధ గుణాలున్న క్యారెట్‌ను అమ్మతో చెప్పి చేయించుకుంటారు కదా బాలలూ!

ఈ రోజు పిల్లలకు క్యారట్‌ పెట్టాం కదా అని వదిలేయక, క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో క్యారెట్‌ను మీ చిన్నారులకు పెడితే, వారి ఆరోగ్యం పదికాలాలపాటు చక్కగా వర్ధిల్లుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.

-బాలప్రభ డెస్క్‌

3.

అంతా మన మంచికే!

అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు విక్రమ సింహుడు. అతడు పరాక్ర మానికి పెట్టింది పేరు. అతడి ప్రధాన మంత్రి ఆదిత్యుడు. అతడు సత్య సంపన్ను డు, పరిపాలనా దక్షుడు, శివభక్తుడు, ఆస్తి కుడు. ఏమి జరిగినా ‘అంతా మన మం చికే’ అని భావించేవాడు.

విక్రమ సింహునకు ఓ సోదరుడు. అతడి పేరు వనవీరుడు. మహా జిత్తుల మారి. అన్నను ఎలా పడగొట్టాలా అని ఎపðడూ పన్నాగాలు పన్నుతూ ఉండే వాడు. రహస్య కుట్రలు పన్నేవాడు. అత డికి ఎపðడూ సింహాసనాన్ని ఎలా ఆక్ర మించాలా అనేదే ధ్యాస. సింహాసనాన్ని కాజేయాలనే దురాశ.

ఓ పర్యాయం విక్రమసింహుని వ్రేలు ప్రమాదవశాత్తూ తెగిపోయింది. దీని గురించి తన ప్రధానమంత్రి ఆదిత్యునితో చెబితే, యథా ప్రకారం ‘అంతా మన మం చికే ప్రభూ’ అన్నాడాయన. దాంతో రాజు కు చిర్రెత్తుకొచ్చింది. ఒళ్ళు మండిపోయింది. మనస్సు చివుక్కుమంది. అలా అంటాడేమి టని తోక తొక్కిన త్రాచులా బుసకొడుతూ ‘ఈ ప్రధాన మంత్రిని కారాగారంలో తోసే యండి’ అని ఆజ్ఞాపించాడు.

రోజులు గడుస్తున్నాయి. సోదరుడు వనవీరునితో వేటకై అడవికి బయల్దేరాడు విక్రమసింహుడు. అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి. అలాం టి అడవిలో ప్రవేశించారు ఒకరి వెనుక మరొకరు. అపðడు ఓ భయంకర సింహం గర్జిస్తూ మార్గమధ్యంలో ఎదురైంది. రక్షిం చుకోవడానికి మరోమార్గం లేక వెంటనే అసంకల్పితంగా నేలపై నిశ్చలంగా పడుకు న్నాడు రాజు. సింహం రానే వచ్చింది. వ్రేలు లేని చేతిని పసిగట్టి, అదో జీవం లేని దేహమని గుర్తించి వెళ్ళిపోయింది. అపðడ ర్థమైంది రాజుకు, తన తెగిపోయిన వ్రేలే తనని కాపాడిందని.

వెనకన వస్తున్న సోదరుడు వనవీరుడు, పరివారం తన కోసం వెతుకుతూ వస్తారని ఎదురు చూసిన రాజుకు నిరాశే మిగి లింది. అది నడి రాత్రి. సైనికులు చలి మంట కాచుకుంటూ పరుషంగా మాట్లాడు కుంటున్నారు. తననూ, తన ప్రధానమంత్రి ని చంపేందుకు వనవీరుడు చేసే కుట్రను మాటల్లో విన్నాడు రాజు. ఇక క్షణమా లోచించక వెంటనే సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి, ‘ఆ సైనికుల్ని బంధించండి’ అన్నాడు. అంతే ఆయన, అనుచరులతో కలిసి, మెరుపు వేగంతో వనవీరుణ్ణీ, అతని అను చరులను బంధించాడు.

తిరిగొచ్చిన రాజు కారాగారాన్ని తెరి పించి మంత్రి ఆదిత్యున్ని విడుదల చేసి హర్షాతిరేకంతో కౌగలించుకున్నాడు. తన తపðను మన్నించమని ప్రాధేయపడి, ఘనం గా కానుకలిచ్చి సన్మానించాడు మంత్రిని.

అపుడు రాజు మాట్లాడుతూ, ‘మంత్రి వర్యా! అంతా మన మంచికే అంటావు కదా! మరి నిన్ను కారాగారంలో బంధిం చాము, నీ కేమి మంచి జరిగింది అని ప్రశ్నించాడు. అపðడు మంత్రి వినయం గా, ‘రాజా! నేను శివభక్తుడ్ని, ఆయనకు దేవాలయం నిర్మించాలనుకున్నాను, తగి నంత ధనం లేక ఆ పని వాయిదా వేస్తూ వచ్చాను. మీరు నన్ను కారాగారంలో బంధించబట్టి, మీ తపðను తెలుసుకుని నాకు ఘనంగా కానుకలిచ్చి సత్కరించారు. మీరిచ్చిన ఈ కానుకలతో నేను శివాల యాన్ని కట్టించొచ్చు’ ఆ విధంగా నాకూ మంచే జరిగింది అన్నాడు.

కావున బాలలూ, ఏది జరిగినా ‘అంతా మన మంచికే’ అని ముందడుగేయాలి. ప్రతికూల ఫలితాలు వస్తే భయపడరాదు. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరు గుతుందని ఈ కథ చెబుతోంది కదా!

4.

ఫాస్ట్‌ ఫుడ్స్‌ వద్దు..పండ్లే ముద్దు..!

పిల్లలు సాధారణంగా రోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీ, తినీ విసుగుచెంది, ఫాస్ట్‌ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు.ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినేటపðడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడ్డారంటే భవిష్యత్తులో ఎన్నో సమస్య లను ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరిస్తున్నారు వైద్యు లు. బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ సెంటర్లలో లభించే చిప్స్‌, సవెూసాలు పేస్ట్రీలు లాంటి పధార్థాలు పిల్లల నోటికి రుచిగా అన్పించి పదే పదే వాటిని తినేందుకు ఇష్టపడ తారు. ఇలా వారు రోజూ ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల, అవి వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసి, అనేక అనర్థాలకు దారి తీస్తాయని చెబు తున్నారు వైద్యులు. ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌కు అలవాటు పడిన పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గుర వడమే కాక, వారిలో క్రమేణా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు. డీప్‌ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి శాతం శరీరంలో అధి కమైతే భవిష్యత్తులో గుండెపోటు రావడం కూడా ఖాయమంటున్నారు వైద్యులు. ఫాస్ట్‌ ఫుడ్స్‌ అపðడ పðడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ, రోజూ వాటికి అలవాటు పడితే ఊబకా యంతో పాటు, గుండెపో టుకు కూడా గురికాక తప్ప దని వైద్యులు హెచ్చరిస్తు న్నారు.

ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పిల్ల లకు సీజనల్‌గా వచ్చే పం డ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషకవిలు వలు చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు వారు. రోజూ క్రమం తప్పక లంచ్‌, డిన్నర్‌ తర్వాత ఒక అరటిపండును తీసుకోవడం ఎంతో మంచిదని, ఫాస్ట్‌ ఫుడ్స్‌ కంటే పండ్లే మంచి ఆహారపదార్థాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు.

-సి.అఖిల్‌

ఆంధ్రప్రభ దినపత్రిక, O2 జులై 2011

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.