కాలేయంలోని కణాలు నశించి, దానిలో ఫైబ్రోసిస్ అనగా కాలేయం గట్టిపడటం, క్షీణించడం, ఉండలుగా (నాడ్యూల్స్) తయారవడం, దాని ఆకృతి మారిపోతుంది. దీన్నే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు.
కారణాలు
మద్యం సేవించడం. వైరల్ హెపటైటిస్. కొన్ని లివర్ మీద ప్రభావం చూపే మందులు వాడటం. పిత్తకోశం కుంచించుకుపోవడం. చాలా రోజులుగా పిత్తాశయంలో రాళ్ళు వుండడం. కంజెస్టివ్ హార్టు ఫెయిల్యూర్ (గుండె జబ్బులు), చిన్న వయస్సులో లివర్ జబ్బులు రావడం మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు.
లక్షణాలు
ఆకలి తగ్గడం. వాంతులు, విరేచనాలవటం. ఆహారం చూస్తూనే వమనం వచ్చినట్టుండడం. శరీరం బలహీనమవడం. అలసట. బరువు తగ్గడం. జ్వరము రావడం. పచ్చకామెర్లు రావడం. చర్మం రంగులో కొన్ని మార్పులు రావడం. పొట్టమీద రక్తనాళాలు బాగా కనిపించడం. గోర్లలో మార్పులు రావడం. జీర్ణాశయంలో రక్తస్రావం జరిగి రక్తపు వాంతులవడం. సెక్సు సామర్థ్యం, సెక్స్‌కోరికలు తగ్గడం. వ్యందత్వం. చర్మం మీద రోమాలు ఊడిపోవడం. చేతుల వేళ్ళు వణకడం. నిద్ర వ్యవస్థలో మార్పురావడం. కండరాలు కృశించడం . ప్లీహం పెద్దదవడం. పొట్టలో, కాళ్లలో నీరు చేరడం. గ్యాస్‌టైటిస్. అన్నవాహికలో రక్తనాళాలు ఉబ్బి రక్తస్రావం జరగడం. డిమెన్షియా ముఖ్యలక్షణాలుగా చెప్పవచ్చు. ఇవేకాక లివర్ క్యాన్సర్, మతిభ్రమించడం, కోమా, తర్వాత మరణం ఇది అంతిమ దశగా గుర్తించాలి.
వ్యాధి నిర్ధారణ
లివర్ ఫంక్షన్ టెస్టు. హెపటైటిస్ పరీక్షలు. అల్ట్రాసౌండ్ స్కానింగ్. సిటి స్కానింగ్ . లివర్ బయాప్సీి. లాప్రోస్కోప్ పరీక్షలు. రక్తపరీక్షలలో- సిబిపి, రక్తహీనత, ప్రోత్రాంబిన్ టైవమ్ ఎక్కువగా వుండడం తెలుసుకోవచ్చు.
చికిత్స
* మద్యం తాగడం వెంటనే మానాలి.
* లివర్‌కు చెడు కలిగించే మందులు ఆపాలి.
* కడుపులో, కాళ్లలో నీరు చేరితే నీరు శాతం, ఉప్పు, బాగాతగ్గించాలి.
* మంచి పోషక ఆహారం, పాలు వంటివి వాడాలి.
* ఎక్కువ శ్రమించకూడదు. బాగా విశ్రాంతి తీసుకోవాలి.
* వాపులుంటే స్పైరినోలాక్టోన్ మాత్రలు, ప్రెడ్సిసలోన్ మాత్రలు డాక్టరు సూచించిన
విధంగా వాడాలి.
* రక్తహీనతకు ఐరన్ క్యాఫూల్, బి12 మాత్రలు వాడాలి.
* సిరోసిస్ లివర్‌కు లివర్ మార్పిడే అంతిమంగా సరైన చికిత్సగా భావించాలి.
డాక్టర్ హెచ్. కృష్ణమూర్తి
చీఫ్ ఫిజిషియన్, మల్లు వెంకటనర్సింహారెడ్డి మెమోరియల్ క్లీనిక్,
ఎంహెచ్ భవన్, అజామాబాద్, హైద్రాబాద్.
ఫోన్ : 9676376669
సంబంధిత ఇతర వ్యాసాలు: