చర్మపు ముడతలకు నివారణ
March 26, 2014
కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని
March 29, 2014

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా!

గర్భ నిరోధక మాత్రలు

ఆరోగ్యవంతంగా తల్లి, శిశువు ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్‌ తప్పనిసరి. కాన్పు,కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా క్షేమంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌‌స ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగక రంగా ఉంటాయి.

గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులు న్నాయి. ఇవి పర్మనెంట్‌, టెంపరరీ పద్ధతులుగా చెప్పుకోవ చ్చు. టెంపరరీ పద్ధతిలో గర్భనిరోధక మాత్రలతో పాటు కండోమ్స్‌ వాడకం, ఇంట్రాయిన్‌ లూప్‌ కాంట్రసెప్ట్‌ డివెైజ్‌లను ఉపయో గిస్తారు. వీటితో పాటు హార్మోన్‌ ఇంజెక్షన్లను కూడా వాడతారు. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్ట్రోన్‌ హార్మోన్‌ మాత్రలనే గర్భనిరోధక మాత్రలుగా పేర్కొంటా రు. ఇవి మహిళల్లో అండం తయారుకా కుండా నిరోధిస్తా యి. దీంతో వారిలో ప్రెగ్నెన్సీ రాదు.

ప్రస్తుతం తక్కువ మోతాదులోని గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స తక్కువగా ఉంటాయి.

ఎవరు తీసుకోవాలి…

గర్భనిరోధక మాత్రలను 18 నుంచి 40 సంవత్సరాలున్న మహిళలందరూ తీసుకోవచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడడం మంచిది. అంత కుమించి వాడాలను కుంటే డాక్టర్ల సలహాను తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే ముందుడాక్టర్లను తప్పని సరిగా సంప్రదించాలి. వారు సూచించిన మేరకు తమకు అనువెైన మాత్రలను వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

వివిధ రకాలుగా…

నేడు గర్భనిరోధక మాత్రలు సాధారణంగా రెండు రకాలు లభిస్తున్నాయి. వీటిలో 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ ఒకటైతే రెండవది 28 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ మరొకటి. 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ ను మెన్సెస్‌ వచ్చిన ఐదవ రోజు నుంచి 25 వ రోజు వరకు వేసుకోవాలి. ప్రతి రోజు రా త్రి పడుకునే ముందు ఈ మాత్రలను తీసు కోవాలి. ఏదెైనా రాత్రి మరచిపోతే మరుస టి ఉదయం వేసుకొని రాత్రి ఎప్పటిలాగే మ ళ్లీ మరొక మాత్ర వేసుకోవాలి. 21 టాబ్లెట్లు పూర్తయిన తర్వాత 2,3 రోజుల్లో మెన్సెస్‌ వస్తాయి ఆ తర్వాత అయిదు రోజుల గ్యాప్‌ తో మళ్లీ ఈ మాత్రలను తీసుకోవాలి. 28 టాబ్లెట్ల స్ట్రిప్‌ను ఉపయోగిస్తే ప్రతిరోజు ఒక మాత్రను వేసుకోవాలి. గర్భనిరోధక మాత్ర లను డాక్టర్‌చేత చెకప్‌ చేయించుకొని వేసు కోవాలి. వీటిని వేసుకోవడం ప్రారంభించే ముందు బరువు, బిపి చెక్‌ చేస్తారు. యుటిరస్‌ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఇటీవల కొత్తగా గర్భనిరోధక మాత్రలు వచ్చాయి. వీటిని వారానికి రెండు సార్లు మూడు నెలల పాటు వాడిన అనంతరం వారానికి ఒకటి వాడితే సరిపోతుంది. ఇవి గర్భనిరోధానికి ఎమర్జెన్సీ పిల్‌గా కూడా పనిచేస్తాయి.

కాన్పు తర్వాత…

శిశువుకు పాలిస్తున్న తల్లి ఆరు నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడ డం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్రలతో తల్లిలోపాలు తగ్గే అవకాశం ఉంది. గర్భనిరోధ మాత్రలను వాడుతు న్నప్పుడు మధ్యమధ్యలో డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. డాక్టర్‌ బ్రెస్ట్‌ ఎగ్జా మినేషన్‌, యుటిరస్‌ టెస్ట్‌, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం గర్భ నిరోధక మాత్రలను ప్రభుత్వం రూరల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంట ర్లు, ప్రభుత్వ ఆసుపత్రు ద్వారా ఉచితంగా సరఫరాచేస్తోంది.

ఉపయోగాలు…

గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టంలేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్నీ ప్లానిం గ్‌తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు. గర్భనిరోధక మాత్రల సక్సెస్‌ రేట్‌ ఎంతో ఎక్కువ. ఫెయిల్యూర్‌ రేట్‌ కేవలం 0.4 శాతమే. కొంత మంది స్త్రీల లో పీరి యడ్స్‌లో బ్లీడింగ్‌ వస్తుంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈబ్లీ డింగ్‌ తగ్గుతుంది. బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బా ద పడుతుంటారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వినియోగంతో గర్భాశయం ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. హెక్టోపిక్‌ ప్రెగ్నె న్సీ రాకుండా ఉంటుంది. రుమాయిటెడ్‌, ఆర్థరెైటిస్‌ ఉన్నవాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటాయి. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్‌ మెంట్‌ గా పనిచేస్తాయి. బ్లీడింగ్‌ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.

ఎవరు వాడకూడదు…

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వాడకూడ దు. బి పి ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు వీటిని వేసుకోకూడదు. కాలే యం సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నవాళ్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు ఈ మాత్రలను ఉపయోగించకూడదు. 40 సంవ త్సరాలు పెైబడిన వాళ్లు, స్మోక్‌ చేసేవాళ్లు కూడా వీటిని వాడకూడదు.

సైడ్ ఎఫెక్ట్స్…

గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పిన ట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్‌ ప్రాబ్లమ్‌తో వారు ఇబ్బంది పడుతుం టారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపిస్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడి ంగ్‌ అవుతుంది. కొందరికి వెజెనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. లివర్‌ సమస్య కూడా రావచ్చు. టిబి ఉన్నవారు వీటినివేసుకుంటే ఇబ్బందులుఎదురవుతాయి కొంత మందికితలనొప్పిరావచ్చు.బరువుపెరుగుతారు.రక్తనాళాల్లోరక్తంగడ్డ కట్టుకుపో తుంది. ఇటువంటి సమస్యలు ఎదురెై నప్పుడే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

(సూర్య దినపత్రిక13జనవరి 2014)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.