గర్భిణీలూ.. “సెల్‌’ మాటలు తగ్గించండి…..

క్యారెట్‌తో మేధో వికాసం!
July 5, 2011
పైసా ఖర్చు లేని మందు ఇది………..
July 30, 2011

గర్భిణీలూ.. “సెల్‌’ మాటలు తగ్గించండి…..

కొత్తగా పెళ్లయిన జంట లు, తొలిసారి గర్భం దాల్చిన మహిళలు ఖచ్చితంగా చదవాల్సిన కధనమిది…

ఎందుకంటే… గర్భంతో భర్తకు దూరంగా… పుట్టింట ఉండటం కాస్త్త కష్టమే… కానీ అంతా అయినవారు ఉన్నా మనసెరి గిన మారాజు చెంతన లేడన్న లోటు తీర్చుకునేందుకు పూర్వ కాలంలో ఉత్తరాలు రాసుకుంటే… ఇప్పుడు ఆ జంటల మధ్య దూరాన్ని తగ్గించే బాధ్యత సెల్‌ఫోన్లే తీసుకున్నా యని చెప్పాలి. దీంతో అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా సెల్‌ఫోన్లతో గర్భంతో ఉన్న వారు ఎక్కువగా తన భర్తతో మాట్లాడేస్తున్నారు

అయితే గర్భంతో ఉండే మహిళలు సెల్‌ ఫోన్‌తో ఎక్కువ గా మాట్లాడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని హెచ్చ రిస్తున్నారు పరిశోధకులు.

ఈ విషయమై కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియాలకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం జరపిన తాజా అధ్యయనంలో ఈ నిజం వెలుగు చూసినట్లు వెల్లడించారు.

కాలిఫోర్నియాలో దాదాపు 30 వేల మంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలు నిర్వహించి.. శోధించగా వారిలో 50 శాతం మందికి పైగా రేడియేషన్‌ ప్రభావా నికి గురైనట్లు తేలిందని తేల్చి చెప్పారు.

ఇందుకు కారణం ఆ బిడ్డల తల్లులు గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సెల్‌ ఫోన్‌ వాడటమే ప్రధానంశంగా తేల్చి చెప్పారు. పుట్టగానే ఆ రేడియేషన్‌ ప్రభావం పైకి కనిపించదని. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా… వయసు పెరుగుతున్న కొలది అవలక్షణాలు బైటకు వస్తున్నట్లు తాము గుర్తించినట్లు శాస్త్రవేత్తల బృందం స్పష్టం చేసింది.

తల్లి గర్భంలో ఉన్నప్పుడు రేడియేషన్‌ ప్రభావా నికి గురయ్యే చిన్నారుల 30 శాతంగా నమోదు కాగా…

చిన్నారుల ముద్దు ముద్దు మాటలకు ముచ్చట పడి సెల్‌ ఫోన్ల్లలో మాట్లాడించడం వల్ల 20 శాతం మంది రేడియేషన్‌ ప్రబావానికి గురవుతున్నారని… దీని వల్ల ఈ చిన్నారులు ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వారి ప్రవర్తనలో అసాధారణ మార్పులు కల్పించడమే కాకుం డా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటు న్నట్లు గమనించామని చెప్పారు.

గర్భిణీలు నిరిష్టకాల పరిమితిలో అవసరానికి అనుగుణంగా మొబైల్‌ వినియోగిస్తే తప్పుకా దని… రోజులో కావాల్సిన వారితో 3,4 సార్లు సంభాషిం చుకోవచ్చని అయితే ఇది 3,4 నిమిషాలకు మించకుండా ఉండాలని, అంతకన్నా ఎక్కువ సేపు మాట్లాడితే పుట్టే బిడ్డపై రేడియేషన్‌ ప్రభావం అధికంగా ఉం డటం తధ్యమని హెచ్చరిస్తున్నారు.

మరి పుట్టే పిల్లల భవిష్యత్‌ని తామే అంధకా రంగా మార్చకుండా… కొన్నాళ్లైనా సెల్‌ ఫోన్లకి దూరంగా ఉంటే మంచి దేమో? మీ కుశల సమాచారం అందించడం ఎంత ముఖ్యమో? మీ బిడ్డ క్షేమాన్ని కూడా ముఖ్యమే.. కదా..

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.