శోభి మచ్చలు తుడిచేయండి
June 3, 2011
మెడనొప్పతో తస్మాత్‌ జాగ్రత్త
June 6, 2011

గర్భ నిరోధానికి సురక్షితమైన కాపర్టీ

కాన్పు, కాన్పుకు మధ్య కనీసం రెండు, మూడు సంవత్సరాల గ్యాప్‌ ఉన్నప్పుడే మహిళలు ఆరోగ్యంగా ఉండగల్గుతారు. ఇందుకోసం వారు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఫ్యామిలీ ప్లానింగ్‌ పద్ధతుల్లో అన్నింటికంటే సురక్షితమైనది ఇంట్రా యుటిరిన్‌ కాంట్రాసిప్ట్‌ డివైజ్‌ (ఐయుసిడి). దీన్నే కాపర్టీ లేదా లూప్‌ అని కూడా అంటారు. స్ర్తీలు కాపర్టీ వేయించుకోవడం వల్ల దాదాపు పది సంవత్సరాల వరకు గర్భం దాల్చకుండా ఉండవచ్చు.కాపర్టీలో నేడు ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో మెడికేటెడ్‌, మల్టీలోడ్‌, హార్మోన్‌ రిలీజ్‌ రకాలు నేడు అందుబాటులో ఉన్నాయి.

ఉపయోగాలు..

కాపర్టీ వేయించుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం దీన్ని సాధారణంగా అందరూ ఉపయోగిస్తున్నారు. కాన్పు, కాన్పుకు మధ్య గ్యాప్‌ కోసం ఎంతో మంచిది. ఒకటి, రెండు, మూడు, అయిదు, పది సంవత్సరాల వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌ చేసుకోవచుఏ్చ. దీనివల్ల సీరియస్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ ఉండవు. ఒకసారి కాపర్టీ వేస్తే చాలు పది సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు. దీన్ని తీసిన తర్వాత సులభంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫెయిల్యూర్‌ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని వేయించుకోవడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు. ఒకసారి వేస్తే లోపలే ఉంటుంది కాబట్టి టాబ్లెట్ల అవసరం ఉండదు.

సమస్యలు…

సీనియర్‌ గైనకాలజిస్ట్‌ వద్ద కాపర్టీని వేయించుకోవాలి. తరచుగా దీన్ని చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి. దీన్ని వేయించుకున్న 10 శాతం మందిలో మాత్రమే సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావచ్చు. ఒక కాన్పు తర్వాత నార్మల్‌ డెలివరీ అయితే ఒకటిన్నర నెలకు, సిజేరియన్‌ అయితే మూడు నెలల తర్వాత వేయించుకోవచ్చు. పీరియడ్స్‌ వచ్చిన తర్వాత 5 రోజుల నుంచి 8 రోజుల లోపు దీన్ని వేయించుకోవాలి. కాపర్టీ అనేది ఓ పరి కరం మాదిరిగా ఉంటుంది. యుటెరస్‌లో దీన్ని అమరుస్తారు. దీనికి దారాలు బయటకు కనిపిస్తుంటాయి. దారాల అమరికను బట్టి కాపర్టీ లోపల ఎలా ఉందో తెలుసు కోవచ్చు. వేసిన తర్వాత నెల రోజులకు చెకప్‌ చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇన్ఫెక్షన్స్‌ ఏమైనా అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఎవరికి వేయకూడదు…

గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవారికి కాపర్టీని వేయకూడదు. ప్రెగ్నెన్సీ సమయంలో వేయరాదు. యుటెరస్‌లో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నవారికి, యుటెరస్‌లో ఎండ్రోమెట్రియసిస్‌, యుట్రెయిన్‌ క్యాన్సర్‌ ఉంటే దీన్ని వేయకూడదు. అబ్‌నార్మల్‌ బ్లీడింగ్‌, సిజేరియన్‌ అయినవాళ్లకు, గతంలో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వారికి చాలా జాగ్రత్తగా కాపర్టీ వేయాలి.

సైడ్‌ ఎఫెక్ట్స్‌...

కాపర్టీ వేసిన తర్వాత కడుపులో నొప్పి వస్తుంది. కొంత మందికి బ్లీడింగ్‌ అవ్వచ్చు. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గి అనీమియా రావచ్చు. పెయి న్‌, బ్లీడింగ్‌ కొద్దిగా ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. నొప్పి తీవ్రంగా ఉంటే లూప్‌ తీయించకో వాల్సి ఉంటుంది. ఒక్కోసారి లూప్‌ జారీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా తక్కువ మందిలో లూప్‌ ఫెయిలై ప్రెగ్నెన్సీ రావచ్చు. ట్యూబ ్‌లో ప్రెగ్నెన్సీ రావచ్చు. గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలుంటాయి. లూప్‌ పెట్టేటప్పుడు ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. చాలా రోజుల తర్వాత కూడా ఇన్‌ఫె క్షన్‌లు సోకవచ్చు. ఇటువంటి సమయంలో తరచుగా చెకప్‌గా చేయించు కోవాలి. చాలా తక్కువగా యుటెరస్‌ నుంచి పొట్టలోకి కాపర్టీ వెళ్లవచ్చు.

ఎలా పనిచేస్తుంది…

యుటెరస్‌ లోపల ఏర్పాటుచేసే కాపర్టీ ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుపడుతుంది. పక్కకు, కిందికి జరిగినప్పుడు ప్రెగ్నెన్నీ రావచ్చు. కాపర్టీ అనేది ఈస్ట్రోజన్‌ను ఆపుతుంది. దీంతో గర్భం రాదు.

ఎప్పుడు తొలగించాలి…

ఇబ్బందులు ఎదురైతే కాపర్టీని తొలగించాలి. ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకుంటే లూప్‌ను తొలగించాలి. బ్లీడింగ్‌ ఆగకుండా వస్తుంటే కాపర్టీని తీసివేయాలి. పీరియడ్స్‌లో నొప్పి బాగా ఉన్నప్పుడు మందులు వాడిన తగ్గకపోతే, గర్భాశయం ఇన్‌ఫెక్షన్‌ సోకితే దీన్ని తొలగించాలి. దారం కనబడకుండే ఉండే బయటకు తీయాలి. యుటెరస్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ వస్తే దీన్ని తొలగించాలి.

కాపర్టీ లోపలికి వెళ్తే స్కానింగ్‌, ఎక్స్‌రే చేసి తొలగించాలి. లూప్‌ యుటెరస్‌ నుంచి పొట్టలోకి వస్తే తీసివేయాలి. ఇక కాపర్టీని వేయించే ముందు పేషెంట్‌ను ఎడ్యుకేట్‌ చేయాలి. ఎన్ని సంవత్సరాల పాటు ఉంచుకో వచ్చు, దాని ఉపయోగాలు వివరించాలి. దీనిపట్ల పేషెంట్‌కు ఉన్న అపోహలు తొలగించాలి. కొందరిలో లూప్‌ అంటే కడుపునొప్పి, బ్లీడింగ్‌ అని భయపడు తుంటారు. అటువంటిదేమీ ఉండదని ధైర్యం చెప్పాలి. 10 శాతం కేసులను తప్పించితే అందరికీ లూప్‌ సరిపోతుంది. ఫ్యామిలీ ప్లానింగ్‌కు దీనికంటే సులభమైన, సురక్షితమైన పద్దతి మరొకటి లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు.

డాక్టర్‌ దివి పద్మావతి
గైనకాలజిస్ట్‌
గాయత్రి నర్సింగ్‌ హోం
రాజీవ్‌ నగర్‌ క్రాస్‌రోడ్‌
హైదరాబాద్‌
ఫోన్‌ నెం: 9848416926
04023840618

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.