వివిధ రకాలుగా ఊపిరితిత్తుల వ్యాధులు
December 13, 2010
వేధించే మెడనొప్పి
December 14, 2010

గాయాలైనప్పుడు

మనలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు గాయాలవుతుంటాయి. గాయాలైనప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. అవి….

* గాయమేదైనప్పటికీ, వెంటనే శుభ్రమైన నీటితోకానీ, గోరు వెచ్చని నీటితో గానీ గాయాన్ని కడగాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌ పూయకండి. చిన్న చిన్నగాయాలకు కట్టుకూడా అక్కరలేదు.

* గాయం నుండి రక్తం కారుతూ ఉంటే, పరిశుభ్రమైన గుడ్డతో కొద్దిసేపు ఒత్తి పట్టుకోండి. సాధారణంగా రక్తం కారడం ఆగిపోతుంది.

* గాయాలకు బొగ్గు, కాఫీపొడి, పసుపు, సున్నం, చక్కెర, తేనె, దంచిన ఆకులు, పేడ లాంటివి పెట్టడం చాలా ప్రమాదకరం.

* గాయం ఒక సెంటీమీటరు కన్నా ఎక్కువ ఉంటే కుట్లు వేయడంమంచిది. ప్రథమ చికిత్స తర్వాత డాక్టరును కలవండి.

* గాయాలు తగిలినప్పుడు మందులు మింగక్కరలేదు. చిన్నచిన్న గాయాలు శుభ్రంగా ఉంచితే చాలా వరకు మానిపోతాయి.

* గాయాలు సూక్ష్మజీవుల బారినపడితే ఆంటిబయాటిక్‌ మందులు అవసరం.

* ఏ గాయమైనా వారం పదిరోజుల్లో మానకుంటే డాక్టరును కలవండి.

* గాయాలు తగిలినప్పుడు డాక్టరు సలహాతో అవసరమైతే టెటనస్‌ టాక్సాయిడ్‌ (టిటి) టీకా వేయించుకోవాలి.

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.