గోరింటాకు కేశ సౌందర్యానికే కాకుండా చర్మానికి కూడా చేసే మేలు అంతా ఇంతా కాదు. లేత గోరింటాకు ప్యాక్ చేసుకుంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే మీ ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది. ఈ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే…
ఐదారు టీస్పూన్ల తేనె, లేత గోరింటాకు ముద్ద, తగినన్ని పాలు కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా ముఖానికి వేసుకుని 5,10 నిమిషాల పాటు మర్ధన చేసి ఆపై కడిగేసుకుంటే ముఖంలో తాజా దనానికి కొదువుండదు.
అలాగే 200 మిల్లీ లీటర్ల్ల చల్లని నీటిలో గోరింటాకుతో పాటు గుడ్డు, తేనే కలపండి. ముఖానికి సరిపడ పలుచని కాటన్ గుడ్డ తీసుకుని ఆ మిశ్రమంలో ముంచి ముఖం మంచి కాసేపు అయ్యాక తీసేయండి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మెరిసే చర్మం మీ సొంతం.
ఇక గుడ్డులో లెసిలిన్ చర్మ సౌందర్యానికి బాగా పనికి వస్తుంది. ఇది ముఖంలోని ముడతలను తొలగించి, చర్మాన్ని బిగుతుగా తయారు చేస్తుంది.
ఆంధ్రప్రభ దినపత్రిక, 28 జూన్ 2011