చర్మ క్యాన్సర్లు రకరకాలు

అద్భుతమైన ఆహార విలువలు గల మొక్కలు
December 14, 2010
క్లోమం వ్యాధి-వైద్యం
December 20, 2010

చర్మ క్యాన్సర్లు రకరకాలు

చాలారకాల చర్మవ్యాధులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత జటిలంగా తయారవుతాయి.క్రమేపీ అవి మొండివ్యాధులుగా మారి క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు. అజాగ్రత్తగా ఉంటే క్యాన్సర్‌గా పరిణమించే ఈ చర్మక్యాన్సర్‌ వ్యాధులు చాలా రకాలు ఉన్నాయి.

మాలిగెంట్‌ మెలనోమా, స్క్వేమస్‌ సెల్‌ కార్సినోమా, బేసల్‌ సెల్‌ కార్సి నోమా మరియు ”మిర్‌కిల్‌ కార్సినోమా” అని ఉన్నాయి. అల్ట్రావయిలెట్‌ టైటు, అయినైజింగ్‌ రేడియేషన్‌లకు ఎక్స్‌పోజ్‌ అవటం, ఇమ్యూనిటీ బాగా తగ్గటం, ఎక్కువగా కార్పికో స్టీరాయిడ్‌ వాడటం, కొంత జన్యుసంబంధం (నవతీఱసఱ్‌aతీy) జబ్బు.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లవల్ల ఉదా:హెచ్‌పివివల్ల జననేంద్రియాల దగ్గర, స్వ్కేమిస్‌ సెలో కార్పొనోమా, వెర్రుకాస్‌ కార్సినోమా అను చర్మక్యాన్సర్లు వస్తాయి.

లూకో ప్లేకియా (వంటిమీద తెల్లటి మచ్చలుంటాయి), జీరో డెర్మా పిగ్‌మెంటో జమ్‌ (వంటినిండా ముదురు రంగు మచ్చలుంటాయి. ఇది జన్యుపరమయిన వ్యాధి.) మొదలగు వాటిని ”జూతీవ షaఅషవతీశీబర శ్రీవరఱశీఅర ” గా పరిగణిస్తారు. స్కేమస్‌ సెల్‌ కార్సినోమా పుండుపడి, పువ్వువిచ్చుకున్నట్లు మారుతుంది. లింఫ్‌ గ్రంధులు వాచి ఉబ్బుగా ఉంటాయి.

బేసస్‌ సెల్‌ కార్సినోమాను ‘రోడెంట్‌ అల్సరు” అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ముఖము మీద ముక్కుచెవు మధ్యభాగములో ఎక్కడయినా రావచ్చును. దీని నుండి రక్త రావటం, నొప్పిరావటం ఉంటుంది. ఇది పుండు లాగా ఉండి, ఎండిన పెలుసులాగా ఉంటుంది. ఈ క్యాన్సరు పుండు చాలాసార్లు బయటికన్నా లోపల లోపల పెరుగుతుంది. ముక్కులోపలి భాగాలకు, అక్కడ ఉండే సైనస్‌ గదులకు, కంటి భాగాలకు వ్యాపించి వాటిని దెబ్బతీసే అవకాశము ఉంది.

వీలయినప్పుడు ఈ క్యాన్సర్లను శస్త్ర చికిత్స ద్వారా వైద్యము చేస్తారు. తక్కువగా ఉన్నవాటిని, 5 ఫ్లోరో యురాసిల్‌ అనే మందు ఆయింట్‌మెంట్‌ రూపంలో వాడటం ద్వారా నయము చేయవచ్చును. కొన్నిసార్లు ఆపరేషన్‌కు వీలుకాని వాటిని రేడియో థెరపి ద్వారా వైద్యము చేస్తారు. ఒక్కోసారి కీమోథెరపి ఇస్తారు.

మైకోసిస్‌ ఫంగాయిడ్స్‌

 ఇది చర్మానికి సోకిన లింఫోమా అను క్యాన్సరు వ్యాధి. దీని వలన శరీరములో ఎక్కడయినా చర్మంమీద ఎర్రటి మచ్చలు, వాటిపై పొలుసులు లాగా వస్తాయి. దురదకూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఇది శరీరముపైన చర్మము అంతా ప్రాకవచ్చును. లేదా వేరే అవయవాలకూ ప్రాకవచ్చును. దీనిని రేడియో థెరపి-టోటల్‌ బాడి ఎలక్ట్రాన్‌ రేడియోథెరపి (టిబిఈఆర్‌టి) ద్వారా వైద్యం చేస్తారు.

 ఈ టిబిఆర్‌టి వైద్యము కొన్ని హైయర్‌ లినియర్‌ యాక్సిలేటర్‌ మెషిన్‌ ఉన్న క్యాన్సరు సెంటరులలో మాత్రమే చేయగలరు. ప్రస్తుతానికి మనరాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడలలో ఇటు వంటి సదుపాయములు ఉన్నాయి. ఇంకా కొన్ని నగరాలలో కూడా ఈ సదుపాయము రావచ్చును. ఈ వ్యాధికి అవసరాన్ని బట్టి ఒక్కోసారి కీమోథెరపి కూడా వాడుతారు.

మాలిగంట్‌ మెలనోమా 

 ఇదిపుట్టు మచ్చలకు సంబంధించిన క్యాన్సరు. పుట్టుమచ్చలు పెరిగి చివరకు క్యాన్సరుగా మారుతాయి. దీనిని సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా తీసివేస్తారు. అవసరాన్ని బట్టి అపుడప్పుడు కీమోథెరపి వాడుతారు.

మెర్‌కిల్‌ సెల్‌ కార్సినోమా

ఇది అరుదైన చర్మక్యాన్సరు. చాలా ఉధృతంగా క్యాన్సర్‌ పెరుగుతుంది. శరీరంలో ఎండ తగిలే ప్రాంతములోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని శస్త్రచికిత్స ద్వారా లేక రేడియో థెరపి ద్వారా వైద్యము చేయుదురు. అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడ వాడుతారు.

ఏరకమయిన చర్శ క్యాన్సరు చూచినా కూడా లక్షణాలు, సాధారణ చర్మ వ్యాధులతో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదా: చర్మం రంగుమారటం – విటమిన్‌ ‘ఎ’ లోపము లోను, శ్రీవబసశీజూశ్రీaసఱa లోనూ, కుష్టువ్యాధిలోనూ, మైకోసిస్‌ పంగాయిడ్స్‌ లోనూ, చర్మక్యాన్సరులోనూ ఉంటుంది. చర్మం ఎర్రగా అవటం, దురద, పొలుసులు, ఫంగల్‌ ఇన్పెక్షన్‌లోను, పిటిరియాసిస్‌ రోజియం లోనూ, సోరియాసిస్‌లోనూ, మైకోసిస్‌ ఫంగాయిడ్స్‌ మొదలగు వ్యాధులలో ఉంటాయి.

పుండు పడటం చాలా రకాల చర్మ వ్యాధులలోను, క్యాన్సరు వ్యాధిలోనూ ఉండవచ్చును. ఏమార్పు వచ్చినా చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించి తగుసలహా పొందటం మంచిది. ఇదే విధంగా ఏమార్పు గమనించినా క్యాన్సరేమో అని భయపడకుండా అది అసలు క్యాన్సరా లేక సాధారణ చర్మవ్యాధా అను విషయాలు వైద్యుని సంప్రదించితే వారు కొన్ని పరీక్షలు చేసి నిర్ణయిస్తారు. ఏ రకము అయినా తొలిదశలో మంచి వైద్యము ఉంది కాబట్టి మూర్ఖంగా ఏ వ్యాధిని పెంచుకోవటం ఆరోగ్యానికి శ్రేయస్కరము కాదు.

డా||.V.ూ.చీ. రావు,వీ.ణ.,ణవీ=ు.,

క్యాన్సర్‌ వైద్య నిపుణులు.

సెల్‌:9849121050

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.