చికిత్సకు లొంగే సోరియాసిస్‌

అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు
December 7, 2010
చలికాలంలో… జబ్బులకు దూరంగా…
December 13, 2010

చికిత్సకు లొంగే సోరియాసిస్‌

సోరియాసిస్‌ అన్నది చర్మానికి సంబంధించిన అనారోగ్యం. ఈ వ్యాధి అయిదు సంవత్సరాల వయస్సు నుంచి 25 సంవత్సరాల వయస్సులోపల ఏ వయస్సులో నయినా రావచ్చు. స్త్రీలలో మెనోపాజ్‌ స్థితికి చేరుకున్న వారికి కూడా రావచ్చు.

ఈ వ్యాధి స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద, వయస్సు తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. ఈ వ్యాధి శీతల ప్రాంతంలో నివశించేవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి ఆరంభమయిన తర్వాత, త్వరగా తగ్గదు. జీవిత కాలమంతా ఉండ వచ్చు.

సోరియాసిస్‌ వ్యాధి ఆరంభానికి ముందుగా చర్మం మీద ఎర్రటి మచ్చలు వస్తాయి. ఆ తర్వాత మచ్చమీద దళసరి పొలుసులు ఏర్పడతాయి. అవిపక్క పక్కనే చర్మంమీద ఏర్పడి, ఆ మచ్చలన్నీ కలిసిపోయి చర్మం చెక్కులు చెక్కులుగా కనిపిస్తుంది. ఆ చెక్కుల క్రింద రక్తంఉంటుంది.

 ఈ వ్యాధి కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, మోచేతులు వీపు క్రింద భాగంలో కనిపిస్తుంది. గోళ్ళుకూడా సోరియాసిస్‌కు గురవుతాయి. గోళ్ళమీద గుంటలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రమయితే, గోళ్ళ అడుగు భాగాన మందంగా చెక్కులు వస్తాయి. వేళ్ళకు, గోళ్ళకు మధ్య ఖాళీ కనిపిస్తుంది.

సోరియాసిస్‌ వ్యాధి వచ్చినప్పుడు చర్మంపై పొర అయిన ఎపిడెర్మిస్‌ నాలుగు రోజుల్లో పరిపక్వ దశకు చేరుకుంటుంది. రక్తంలో మార్పులు కనిపించకపోయినప్పటికీ, యూరిక్‌ యాసిడ్‌ శాతం మాత్రం పెరుగుతుంది. సోరియాసిస్‌ వ్యాధికి గురయినప్పుడు హోమియో వైద్యం చేయించుకోవడమే మంచిది.

కె.నిర్మల

 

1 Comment

  1. please soloution soriyasis treatment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.