చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష

సొరియాసిస్‌కు.. శాశ్వత పరిష్కారమా?
November 16, 2010
జుట్టూడుతోందా?
November 16, 2010

చిగుళ్లవ్యాధి.. చేపనూనె రక్ష

వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో వేధించే చిగుళ్లవ్యాధి బారిన పడకూడదని కోరుకుంటున్నారా?

అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపల వంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి తరచుగా తీసుకుంటున్నవారిలో చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం 23-30 శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.ఈ యాసిడ్లలో ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. చేపల్లో సార్త్డెన్స్‌, మాకెరెల్‌, స్వార్డ్‌ఫిష్‌లతో పాటు అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌), వాల్‌నట్స్‌ల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.

50-65 వయసువారిలో సుమారు 11 శాతం మంది ఈ చిగుళ్లవ్యాధి బారిన పడుతున్నారని అంచనా. ఇక 75 ఏళ్లు పైబడినవారిలోనైతే 20 శాతం మందికి పైగా దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఈ చిగుళ్లవ్యాధి రావటానికి కారణమేంటో తెలుసా? చిగుళ్ల చుట్టూ బ్యాక్టీరియా పేరుకుపోవటమే. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే క్రమంగా చిగుళ్ల కణజాలం తగ్గిపోయి దంతం మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీంతో దంతానికి అవసరమైన దన్ను లేకుండాపోయి బలహీనపడుతుంది.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే దీని నుంచి కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే కచ్చితంగా ఎంత మొత్తంలో చేపనూనె తీసుకోవాల్సి ఉంటుందనేది మాత్రం వివరించలేదు. కానీ వారానికి రెండుసార్లు చేపలను తినటం ఒక్క చిగుళ్ల వ్యాధికే కాదు.. మొత్తం ఆరోగ్యానికీ మేలు చేస్తుందని ఆరోగ్య సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు.. గుండెలయ తప్పటం, గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయనీ నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.