కదలండి-ఆరోగ్యంగా ఉండండి
December 6, 2010
అందం,ఆరోగ్యానికి దివ్యౌషధం పెరుగు
December 7, 2010

జుట్టు ఊడకుండా

 

ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారం తినడం, స్వచ్ఛమైన కొబ్బరినూనె రాయడం, ఆందోళన తగ్గించటమూ.. తొంభైశాతం వరకు జుట్టు రాలడం తగ్గించగలము.

* జుట్టు హెల్త్ జాగ్రత్తగా గమనించాలి. మలబద్దకం అధికంగా ఉన్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కాబట్టి శరీర ఆరోగ్యం జుట్టుపై ప్రతిఫలిస్తూ వుంటుంది. జ్వరము, హార్మోన్ల లోపము, ఒత్తిడి ఇవి అధిగమించాలి.

* ‘‘బ్రష్ టెస్ట్’’ ఈ పరీక్ష ద్వారా జుట్టు ఎంత ఊడుతుందో పరీక్షించవచ్చు. దీనిలో 14 రోజుల్లో ఎంత జుట్టు ఊడుతుందో తూయబడుతుంది. 0 రోజున జుట్టుని ఎన్నోసార్లు బ్రష్ చేసాక, బ్రష్‌లో జమకూడిన తెగిన చుట్టుని, తర్వాత మొదటి వాష్ అయ్యాకా ఇంకా 14వ రోజున పోగుచేస్తారు. దీన్నిబట్టి ఎంత పోతుందో నిర్ధారిస్తారు.

* విటమిన్ బి5 కేశవర్ధిని అని తేల్చారు. ఇది జుట్టు క్రింది పొరల్లో తేమను చక్కగా ఉంచుతుంది. జుట్టు యొక్క క్యూటికిల్స్‌లో నీటి మోతాదు పెరగడంవల్ల దీని కోమలత్వం ఇంకా టెక్చర్ మెరుగవుతుంది.

* చుండ్రువల్ల జుట్టు రాలితే ‘‘కెటో కొవాజోల్’’ గల షాంపూ మంచిది. మెడికేటెడ్ షాంపూ కంటే మందార రసంగల హెర్బల్ షాంపూ మంచిది. లేదా కుంకళ్ళ రసంలో మందార రసం కలిపి మనమే తయారు చేసుకోవచ్చు. ఎర్ర మందార పువ్వులు మంచివి.

* గోధుమ ప్రొటీన్లతో చేసిన ‘వీట్ ప్రొటీన్ హెయిర్ కండిషనర్’’ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో నీటిలో కరుగబెట్టిన వీట్ ప్రొటీన్, మెంతుల ఎక్స్‌ట్రాక్షన్ వుంటుంది. ఇవేగాక చుండ్రు, షుగర్, అధిక రక్తపోటు, శ్వాసకోశ ఇబ్బందులు, అజీర్ణం వంటి వాటిని తగ్గిస్తే జుట్టు రాలడమూ తగ్గిపోతుంది

 డా. కె. సంధ్యారాణి

1 Comment

  1. send the more details.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.