మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం
August 9, 2012
నల్లేరు గొప్ప ఔషధం!
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, రక్తనాళాలు చిట్లడం ఇత్యాది కారణాలు వుంటాయి. చిన్నపిల్లల్లో మెదడులో ‘న్యూరోసిస్టీ సర్కోసిస్’ అనే పరాన్నజీవి కంతులు వుండటంవల్ల మెదడులోని ద్రవం పీడనం పెరిగి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాలు, చేయి తాత్కాలికంగా పడిపోవచ్చు. అలాగే స్ర్తిలలో అధికంగా వచ్చే ‘మైగ్రేన్’ లేదా‘పార్శ్వనొప్పి’ వలన స్ట్రోక్ రావచ్చు. మైగ్రేన్ రోగుల్లో వాంతులు, ఎక్కువగా ఉంటే స్ట్రోక్ అధికంగా వస్తుంది. దీనే్న ‘ఆరా’ లక్షణాలుంటారు. ‘మైగ్రేన్’ అనేది తలలోని రక్తనాళాలు ఏదేని కారణంవల్ల ‘వాయడం’వల్ల వస్తుంది. ఇది ఇన్‌ఫెక్షన్‌వలన కావచ్చు, సంయోజక కణజాలాల అవలక్షణంవలన కావచ్చు. మైగ్రేన్‌వలన రక్తనాళాలు సంకోచం చెందడం వల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. వెంటనే స్ట్రోకు వస్తుంది. ఇలా కాకూడదంటే-ఆందోళన, నిద్రలేమి, డ్రగ్స్.. మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలి.

– డా.కె.సంధ్యారాణి, 
ప్లాట్ నెంబర్-3, అమాని అపార్ట్‌మెంట్, 
గాయత్రి నగర్, కంచుకోట వీధి, విజయవాడ-8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.