గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌
December 20, 2010
పండ్లు, కూరగాయలతో.. దీర్ఘాయుష్షు
December 21, 2010

తుంటికీలు మార్పిడి శస్త్ర చికిత్స

వివిధకారణాల వల్ల ఏర్పడే తుంటికీలు అరుగుదలలో ఇన్‌ఫెక్షన్‌ (క్షయ, ఆర్థ్రయిటీస్‌), రుమటాయిడ్‌ ఆర్థ్రయిటీస్‌, ఎవాస్కులర్‌ నెక్రోసిస్‌, పోస్ట్‌ఫాక్చర్‌ ఆర్థ్రయిటీస్‌, మందులు,ఆల్కహాల్‌ వల్ల వచ్చే ఆర్థ్రయిటీస్‌లో రకరకాల శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మాక్‌ ముర్రేస్‌ ఆస్టియాటమీ చికిత్సలో దెబ్బతిన్న బంతి కీలు మీదపడే బరువు ఆక్సిస్‌ను సంపూర్ణంగా పక్కకు జరుపుతారు. దీని వల్ల దెబ్బతిన్న కీలు యథా తథంగా ఉన్నప్పటికీ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. శాశ్వత ప్రాతిపదికన రోగి తన పనులన్నీ చేసుకోగలడు. గ్రామీణ వ్యవసాయ కుటుంబీల కులకు ఇది అత్యం త ఉపయోగకరమైన చికిత్స. నడకలో కొద్దిగా కుంటు ఉంటుంది.

అలాగే నేలమీద కూర్చోగలిగినా కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ నొప్పి ఏమాత్రం ఉండదు. బరువైన పనులన్నీ సులభంగా చేయొచ్చు.ఖర్చు కేవలం 20 వేల లోపే అవుతుంది. జీవితాంతం రెండోసారి సర్జరీ చేయాల్సిన అవసరం రాదు.

తుంటీకీలు మార్పిడి

పైన పేర్కొన్న రుగ్మతలు కలిగిన వారిలో ముఖ్యంగా పట్టణ జీవనంలో ఉన్నవారికి ఏ ఇతర సర్జరీల ద్వారా కూడా తుంటికీలులో ఉపశమనం లభించదు. మాక్‌ ముర్రేస్‌ ఆస్టియాటమీలో భవిష్యత్తులో వచ్చే కొద్ది కుంటును రోగి ఇష్టపడనప్పుడు తుంటికీలును పూర్తిగా తొలగిస్తారు.

కీలులోని బంతి భాగానికి, కప్పు భాగానికి మెటల్‌ అల్లారు, అల్ట్రాహైడెన్సిటీ పాలిఇథిలీన్‌పూత కలిగిన ఇంప్లాంట్స్‌ ఉపయోగించి శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. దీన్లోకూడా సహజమైన బంతికీలు పూర్తిగా తొలగిస్తారు. బోన్‌సిమెంట్‌, పిన్స్‌, స్క్రూలు ఉపయోగించి కప్పు భాగాన్ని, బంతి భాగాన్ని బిగిస్తారు.

ఈ చికిత్స వ్యయం 1.5లక్షల రూపాయల నుండి రెండు లక్షల రూపాయలవరకు ఉంటుంది. శస్త్ర చికిత్స తర్వాత శాశ్వతంగా నేలమీద కూర్చోలేరు. పాశ్చాత్య టారులెట్‌ ఉపయోగించాలి. క్కువగా మెట్లు ఎక్కకూడదు. ఈ చికిత్స ఫలితం కూడా అధిక బరువు, ఇతర జబ్బులు వాటికి ఉపయోగించే మందులననుసరించి 10 నుంచి 15 ఏళ్ల వరకు సత్ఫలిస్తుంది. అంటే ఈ శస్త్రచికిత్సని కూడా వీలైనంత వరకు 60 ఏళ్లుపైన చేయించుకోవడం మంచిది.

 ఈ రెండు శస్త్రచికిత్సలు రెండింటిలోనూ రివిజన్‌ సర్జరీ, రీప్లేస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఖర్చు, వయసు పెరిగేకొద్దీ శారీరక రుగ్మతలను దృష్టిలో ఉంచుకుని రివిజన్‌ సర్జరీలను ఆలోచించి చేయించుకోవాలి. ఈ సందర్భంగా ఒక సామెతను గుర్తు చేసుకోవాలి. అది నో ట్రీట్‌మెంట్‌ ఈజ్‌ బెటర్‌దాన్‌ ఓవర్‌ ట్రీట్‌మెంట్‌.

డాక్టర్‌ జె. భాను కిరణ్

 ఆర్థొపెడిక్‌ సర్జన్‌,డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌,

సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ

బెంగళూరురోడ్డు, అనంతపురం.

ఫోన్‌ : 08854272881

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.