తొలిదశలోనే చికిత్సకు లొంగే మైలోమా క్యాన్సర్‌

సంతానలేమికి చక్కటి పరిష్కారం ఐవిఎఫ్‌
November 9, 2010
పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ‘సంజీవని’ మొక్కలు
November 13, 2010

తొలిదశలోనే చికిత్సకు లొంగే మైలోమా క్యాన్సర్‌

బోన్‌మారోలో ాద్ణీ లింఫోసైట్స్‌, ప్లాస్మా సెల్సు ఉంటాయి. వీటి నుండి శరీరంలో ఇమ్యునోగ్లోబ్యులిన్‌ తయారవుతాయి. బోన్‌ మారోలో ఈ కణములు బాగా పెరగటం వల్ల నిర్దిష్టంగా కొన్ని రకాల ఇమ్యునోగ్లాబ్యులిన్స్‌ తయారవుతాయి. కొన్ని సందర్భాలలో ప్లాస్మా కణాలు బాగా పెరగటం ావ్ణీ ప్రొటీన్‌ ఉత్పత్తి బాగా పెరగటంజరిగి, సీరమ్‌ ఎలక్ట్రో ఫోరెసిస్‌ అను పరీక్షలో ావ్ణీ ప్రోటీన్‌ రజూఱసవ లాగా బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. శరీరంలో ఎముక లలో కూడా దీనివల్ల చాలా మార్పులు వచ్చి ఎముకలను తినివేయటం జరుగుతుంది. ఒక్కోసారి ఎముకలువిరగటం జరుగుతుంది. ఈ జబ్బును ‘మల్టిపుల్‌ మైలోమా’ అంటారు.

సాధారణంగా ఇది 55 సంవత్సరముల వారిలో కనిపిస్తుంది. ఇది లక్షమందికి ఒకరి లో రావచ్చును. ఆడ, మగ ఇద్దరిలోనూ రావ చ్చును. ఈ జబ్బు రేడియేషన్‌ వఞజూశీరబతీవ వల్ల, క్రానిక్‌ యాంటిజన్‌ స్టిమ్యులేషన్‌ వల్ల (ఎర్రకణాల యాంటిజెన్‌లు, రుమటూ యిడ్‌ ఫ్యాక్టర్‌, కోయాగ్యులేషన్‌ ఫ్యాక్టరు మొ||), కొన్ని పరిశ్రమలలో బెంజీన్‌ వాడకంలో ఎక్పోజర్‌ వల్ల, ”హ్యుమన్‌ హెర్పిస్‌ వైరస్‌8” వల్ల రావచ్చును. కొన్ని జన్యువులలో మార్పుల వల్ల కూడా ఈ జబ్బు రావచ్చును. దీనివల్ల రక్తం బాగా తగ్గి, నీరసం, అలసట వస్తుంది. ఎముకలు దెబ్బతినటం వల్ల, అవి ఎముకలలో తీవ్రంగా ఉందో అక్కడ నొప్పి వస్తుంది. వెన్నుపూసలు దెబ్బతిని, వెన్నుపాము కూడా దెబ్బతింటే, ఆయా సందర్భాన్ని బట్టి నొప్పి, లేక పెరాలిసిస్‌ రావచ్చును. ఒక్కోసారి మూత్రపిండాలు కూడా దీనివల్ల దెబ్బతిన వచ్చును. మూత్రంలో కూడా బెన్స్‌జోన్స్‌ ప్రోటీనులు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్‌ అను రక్తకణాలు తగ్గినప్పుడు చిన్న, చిన్న మచ్చలు రావటం, రక్తస్రావం జరగటం జరగవచ్చు. సాధారణ రక్త పరీక్షలు, సీరమ్‌, ఎలక్ట్రో ఫోరెసిస్‌, మూత్రపరీక్ష, బోన్‌మారో పరీక్ష, ఎముకలఎక్సరే, అల్ట్రాసౌండ్‌ abసశీఎవఅ, ఎంఆర్‌ఐ స్కాన్‌, సిటి స్కాన్‌, పిఇటి స్కాన్‌, బోన్‌ స్కాన్‌ అను రకరకాల పరీక్షల వల్ల దీనిని గుర్తించటం జరుగుతుంది. సాధారణంగా తల ఎముకలు (రసబశ్రీశ్రీ bశీఅవర) తినివేసేటట్లుగా రంధ్రములు పడతాయి. శరీరంలో చాలా ఎముకలు ఈ విధంగా మారవచ్చు. కొన్నిచోట్ల ఎముకలు విరిగిపోవచ్చును. చాలా ఎముకలు తూట్లు పడినట్లు రంధ్రాలు పడతాయి.

వైద్య విధానము 

 దీనికి ఎక్కువగా కీమో థెరపీ వాడుతారు. ‘విన్‌కిస్టిన్‌’, ‘డాక్సోరూ బిసిన్‌’, ‘డెక్సామిధజోన్‌’, ‘మెల్‌ఫలాన్‌’, ‘ధాలిడొమైడ్‌’ మరియు ‘లినాలి డోమైడ్‌’లు మంచి ఫలితాలు ఇస్తాయి. హైడోస్‌ కీమోథెరపీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంకా బోర్టిజోమిబ్‌ అను మందు ఈ మధ్య క్రొత్తగా వచ్చింది. స్టెమ్‌ సెల్‌ ధెరపీ, ఆటోలాగస్‌ బోన్‌మారో రిప్లేస్‌మెంట్‌లు, (కొంచెం ఖరీదైనా కూడా) మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఎముకలు విరిగినా గాని (టవఎశీతీaశ్రీ అవషస), విరగపోయే వాటికి ముందు జాగ్రత్తగా శస్త్ర చికిత్స (అaఱశ్రీఱఅస్త్ర వ్‌ష.) చేస్తారు. కొన్నిచోట్ల ఎముకలు బాగా దెబ్బతిని నొప్పిగా ఉన్న యెడల, ఆ ప్రదేశంలో సందర్భానుసారం గా రేడియోథెరపీ ఇవ్వటం వల్ల నొప్పి తగ్గి రోగికి బాగా ఉపశమనం వస్తుంది. ట్రీట్‌మెంట్‌ కాంప్లికేషన్స్‌ లేనియెడల, మందులకు మంచి ఫలితాలు పొందిన పది సంవత్సరముల దాకా ఏమీ ఇబ్బందిలేకుండా ఉండ వచ్చును. జబ్బు పెరిగినయెడల, అది ఉన్న స్టేజినిబట్టి, సాధారణంగా మూడు నుండి, ఐదు సంవత్సరముల వరకూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లాస్మా ఎలక్ట్రోఫోరెసిస్‌ అను రక్త పరీక్ష సంవత్సరంకు ఒకసారి చేయించటం వల్ల దీనిని తొలిదశలో కనుక్కోవటం వీలవుతుంది.

డా||.V.ూ.చీ. రావు,వీ.ణ.,ణవీ=ు.,

క్యాన్సర్‌ వైద్య నిపుణులు. సెల్‌:9849121050

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.