దంత వైద్యానికి లేజర్‌ – చికిత్స

మొలలు – చికిత్స, నివారణ
October 4, 2010
‘బద్ధకం’ వదిలించుకోండి
October 5, 2010

దంత వైద్యానికి లేజర్‌ – చికిత్స

దంత అనారోగ్యం కలిగితేనే కాదు-చికిత్స కూడా బాధా కరం అనే అభిప్రాయం మనందరిలో ఉంది. పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొల గించడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివే యడం, హిమాంజి యోమాల వంటి వాటినీ తొలగించడం, నోటిలో అల్సర్స్‌ని తగ్గించ డం, పళ్ల హైపర్‌ సెన్సిటివిటి లాంటి దాన్ని తగ్గించడం వంటి చికి త్సల్ని- కత్తితో సంబంధం లేకుండా కాంతితో, ఏ నొప్పి, రక్తస్రావం లేకుండా రాష్ట్రంలో చేయగలుగుతున్నామంటే దంత వైద్యవిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. లేజర్‌ కిరణాలతో దంత చికిత్స కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. గతంలో కొన్ని మెట్రో నగరాలకే పరిమితమైన ఈ టెక్నాలజీ నేడు హైదరాబాద్‌లోనూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. లేజర్‌ కిరణాల సాయంతో ఈ వినూత్న పరిక రం ద్వారా దంతాలు, చిగుళ్లు, నోటి ఎముకకు సంబంధించిన అనే క చికిత్సల్ని చేస్తున్నారు… ఇంతకు ముందు మెత్తటి కణాలకి చికి త్స చేసే లేజర్స్‌ మనకు అందుబాటులో ఉన్నాయి.

’ఔఅఖిఉ’ పదాన్ని విస్తరిస్తే ‘లైల్‌ యాంప్లికేషన్‌ స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌’ అని అర్థం. లేజర్‌ యంత్రం నుంచి హార్డ్‌ టిష్యూ, సా ఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌- వేరు వేరుగా ఉంటాయి. దెబ్బ తిన్న సాఫ్ట్‌ టిష్యూని తొలగించే సన్నటి పైప్‌కి చివర్న గాస్‌టిప్‌ ఉం టుంది. దీనిలోంచి లేజర్‌ కిరణాన్ని అవసరమైన ప్రాంతంలోకి ప్రసరించేట్టు చేస్తారు చికిత్సలో. ఇది ఫైబర్‌ ఆఫ్టిక్‌ట్యూబ్‌. తర్వాత చికిత్సలో అప్పుడు పైనున్న టిప్‌ని తీసివేస్తే, టిప్‌ని పెంచుతారు. ఇలా క్రమంగా ఈ ఫైబ ర్‌ ఆఫ్టిక్‌ ట్యూబ్‌ అయిపోవచ్చు. అప్పుడు కొత్తతీగని వేసుకోవలసి వస్తుంది. ఇదే మెషిన్‌కి -హార్డ్‌ టిష్యూకి చికిత్స చేయడానికి వీలుగా ఎక్కువ లేజర్‌ కిరణాన్ని ప్రసరింపజేసే ట్యూబ్‌ ఉంటుంది. ఇవి రెండూ ఒకే మెషిన్‌కి ఉంటాయి. ఇది విద్యుచ్ఛక్తితో పనిచేస్తుంది.

ఈ లేజర్‌ మెషీన్‌ని ఆపరేట్‌ చేయాలంటే చేతులతో నైపుణ్యమే కాదు, కాళ్లలో నైపుణ్యమూ ఉండాలి. ఎందుకంటే లేజర్‌ కిరణాన్ని ప్రసరింపచేసే పైప్‌ని రోగి నోటిలోని ఆ భాగం వరకూ తీసుకు వచ్చినా కింద పాదంతో పెడల్‌ మీద అవసర మైనంత ఒత్తిడిని కలిగించినప్పుడే లేజర్‌ కిరణాలు బయటకు రావడం ప్రారంభి స్తాయి. ఎప్పుడు పాదాన్ని పైకెత్తితే అప్పుడే లేజర్‌ కిరణాలు బయటికి ప్రసరించడం ఆగిపోతుంది.లేజర్‌ పనిచేసేది ‘ధెర్మకో యాగ్యులేటివ్‌ ఎఫెక్ట్‌’తో. ఈ లేజర్‌ కిరణాలలో చాలా ఉష్ణముంటుంది.

200 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకూ ఉన్నా, కాలదు. నొప్పి ఉండదు. రక్తస్రావం ఉండదు. చికిత్స పొందే వారికి ఇదంతా ఎం తో ఆశ్చర్యంగా ఉంటుంది. హార్డ్‌, సాఫ్ట్‌ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్‌ వేరు వేరుగా ఉండడమే కాదు. ప్రోగ్రామ్‌ మార్చినప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌ కెనాల్‌ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్‌…ఇలా హార్డ్‌ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే, సాఫ్ట్‌ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో.

– డాక్టర్‌ సుధీర్‌ చౌదరి,
దంత వైద్యనిపుణులు
డెంటల్‌ స్పెషాలిటీస్‌ అమీర్‌పేట్‌,
హైదరాబాద్‌ ఫోన్‌: 98850 12444

(సూర్య దినపత్రిక, 4 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.