వైద్యం | Vaidyam
  • Home
  • గృహ వైద్యం
  • ప్రకృతి వైద్యం
  • మానసిక సమస్యలు
  • క్యాన్సర్
    • కాలేయ క్యాన్సర్‌
    • గర్భాశయ క్యాన్సర్‌
  • గ్యాస్ సమస్యలు
  • నొప్పులు
    • కడుపు నొప్పి
    • కీళ్ల వ్యాధులు
    • గొంతు నొప్పి
    • తలనొప్పి
    • నడుమునొప్పి
  • మా గురించి
వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం
November 9, 2010
కీళ్ల నొప్పులు.. హోమియో చికిత్స
November 9, 2010

దగ్గు… ప్రేరకాలు

Categories
  • దగ్గు
Tags

కఫo నాసిక వెనుక నుంచి గొంతు అడుగు భాగం లోపలకు స్రవించటం (పోస్ట్‌నేసల్ డ్రిప్)

మన నాసిక లోపల, గొంతు లోపల ఉండే గ్రంథులు రోజు దాదాపు లీటర్ – లీటరున్నర వరకూ కఫo తయారు చేస్తుంటాయి. ఈ పదార్థం నాసికలను, గొంతును తడిగా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు అంతర్గత ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంటుంది. మామూలు పరిమాణంలో ఉన్నంత వరకూ ఈ పదార్థాన్ని మనకు తెలియకుండానే మింగేస్తుంటాం. అయితే ఎలర్జీలు, జలుబు, సైనస్ ఇనె్ఫక్షన్లు వంటి కారణాల వల్ల ఒకవేళ ఈ కఫo అత్యధిక మొత్తాల్లో విడుదలైతే గొంతు భాగంలో అపరిమితంగా సంచితమవుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘పోస్ట్ నేసల్ డ్రిప్’ అంటారు. దీనివల్ల గొంతులోపల భాగం కల్లోలానికి గురై శోథ తయారవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి చర్యగా దగ్గు ఉత్పన్నమవుతుంది. ఈ సమస్య దీర్ఘకాలం నుండి ఉండే దగ్గుకూడా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. చాలామందిలో ఈ లక్షణం స్పష్టంగానే అనుభవమవుతుంది. అయితే కొంతమంది మాత్రం దీనిని గ్రహించలేరు. దీని ఫలితంగా కనిపించే దగ్గు మాత్రం దీర్ఘకాలం పాటు బాధిస్తుంటుంది.
ఉబ్బసం (ఆస్థమా)

 దీర్ఘకాలపు దగ్గుకు ఉబ్బసం ఒక సాధారణమైన కారణం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపించే మొండి దగ్గుకు ఉబ్బసం ప్రధాన కారణం! కొన్ని సందర్భాల్లో దగ్గుతోపాటు గాలిని బలంగా, వేగంగా తీసుకోవాల్సి రావటం, పిల్లి కూతలు వంటి అనుబంధ లక్షణాలు కూడా కనిపిస్తాయి. కానీ, అనేక సందర్భాల్లో మాత్రం కేవలం పొడి దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఆస్థమా సంబంధమైన దగ్గు రుతువులను బట్టీ వచ్చిపోతుంటుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులను అనుసరించి గాని, చలిగాలిలో గడిపినప్పుడు గానీ తీక్షణ రసాయనాలకు గురైనప్పుడు గాని, ఘాటైన సుగంధ ద్రవ్యాలను పీల్చుకున్నప్పుడు గాని ఈ తరహా దగ్గు వస్తుంటుంది.
ఆమాశయపు ఆమ్లాలు అన్ననాళంలోపలకూ, గొంతులోనికీ పొంగటం (గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్/జియిఆర్‌డి): ఈ వ్యాధి స్థితి చాలా సాధారణమైనది. ఆమాశయంలో మాదిరిగా అన్ననాళంలోనూ, గొంతులోనూ మందపాటి శే్లష్మపు పొర ఉండదు కాబట్టి ఆమ్ల పదార్థం వెనక్కి పోటేసినప్పుడు గొంతులో రేగి దగ్గు వస్తుంది. నిజానికి ఈ సమస్యవల్ల ఛాతిలో మంట, పుల్లని త్రేన్పులు వంటివి కనిపించాలి. అయితే సగానికి సగం మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించకుండా కేవలం దగ్గు మాత్రమే కనిపిస్తుంటుంది.
శ్వాసవ్యవస్థకు చెందిన ఇన్‌ఫెక్షన్లు

 జలుబు, ఫ్లూ, నిమోనియా వంటి శ్వాసవ్యవస్థకు చెందిన వ్యాధులు వచ్చి తగ్గిపోయిన తరువాత కూడా చాలా మందిలో దగ్గు మాత్రం అవశేష లక్షణంగా చాలా కాలంపాటు కొనసాగుతుటుంది. ఈ వ్యాధుల్లో గాలి ప్రయాణించే మార్గం శోథకు గురై రేగటం వల్ల దీర్ఘకాలంపాటు దగ్గు కొనసాగుతుంది.
రక్తపోటు మందుల వాడకం: రక్తపోటు, హార్ట్‌ఫెయిల్యూర్ వంటి సమస్యల్లో వాడే ఆంజియోటెన్సిస్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనే మందులు 20 శాతం కేసుల్లో మొండి దగ్గును కలిగించే అవకాశం ఉంది. ఈ మందులను మొదలెట్టిన తరువాత వారం పదిరోజులకు దగ్గు మొదలవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆరు నెలల తరువాత కూడా దగ్గు మొదలు కావచ్చు. ఒకవేళ మందు వాడకం నిలిపివేసినప్పటికీ నెలరోజుల వరకూ దగ్గు కొనసాగుతూనే ఉంటుంది చాలా సందర్భాల్లో.
దీర్ఘకాలపు బ్రాంకైటిస్

 శ్వాస వ్వస్థలోని పెద్ద శ్వాసనాళాలు ఇనె్ఫక్షన్‌కి గురైతే బ్రాంకైటిస్ అంటారన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి స్థితిలో శ్వాసమార్గాలు కఫంతో సంచితమవటం, ఆయాసం, పిల్లికూతలు, దగ్గు, పసుపుపచ్చని రంగులో శే్లష్మం, వెలువడటం వంటి లక్షణాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ధూమపానం చేసే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనేదానికి సూచనగా భావించాలి.
బ్రాంకియక్టాసిస్

 శ్వాసనాళాలు అసాధారణంగా సాగిల పడినప్పుడు ప్రాప్తించే ప్రమాదకర దీర్ఘకాలపు వ్యాధి స్థితి బ్రాంకియక్టాసిస్. శ్వాసనాళాల గోడలు సంకోచించగలిగే స్థితిని కోల్పోవడంతో ఊపిరితిత్తుల్లోని శే్లష్మం ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. దగ్గుతోపాటు శే్లష్మం, రక్తం వంటివి వెలువడటం, ఆయాసం, నిస్త్రాణ వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రముఖంగా కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్

 ఊపిరితిత్తులకు సోకిన క్యాన్సర్ వల్ల కూడా దీర్ఘకాలపు దగ్గు ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో దీనిని తప్పనిసరిగా పరిగణించాలి. దీర్ఘకాలపు మొండి దగ్గులో కఫంతో పాటు రక్తం కనిపించటం, ధూమపానం అలవాటుండటం వంటివి తోడైతే ఆ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి.

పరీక్షలు – నిర్థారణ

దగ్గు దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నప్పుడు సరైన వ్యాధి నిర్ణయం కోసం కూలంకషంగా వ్యాధి ఇతివృత్తాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం ధూమపానం చేసే అలవాటున్నా, వాతావరణ కాలుష్యానికి గురువుతున్నా ఆ విషయం మీ వైద్యుడి దృష్టికి తీసుకెళ్లాలి. ఎలర్జీ, పరీక్షలు, రక్తపరీక్ష ద్వారా ఎలర్జీలను, కంప్యూటరైజ్డ్ టోమోగఫీ (సిటి) స్కాన్ వంటి ఇనె్ఫక్షన్లను పరీక్షించాల్సి ఉంటుంది.
ఛాతి ఎక్స్‌రే పరీక్ష

 గొంతు లోపలకు దిగే కఫం వంటివాటిని ఎక్స్‌రేల్లో తెలుసుకునే అవకాశం లేకపోయినా ఊపిరితిత్తులకు చెందిన క్యాన్సర్ వంటి వాటిని గుర్తించగలిగే అవకాశం ఉంటుంది. ఎక్స్‌రేల్లో లభించే సమాచారాన్ని బట్టీ అవసరమైతే సిటిస్కాన్ వంటి తదుపరి పరీక్షలను సూచించాల్సి ఉంటుంది.
ఊపిరితిత్తుల పనితీరును తెలిపే లంగ్ ఫంక్షన్ టెస్టులు: ఈ పదీక్షల ద్వారా ఊపిరితిత్తుల్లో ఎంత స్థాయిలో గాలిని బంధించి ఉంచగలుగుతున్నారు, గాలిని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి వంటివి తెలుస్తాయ.
ఎండోస్కొపి

 కాంతిని ప్రసరింపచేసే సన్నని వంచగలిగే కెమెరా కలిగిన గొట్టాన్ని గొంతులోపలకు పంపించి చూడటం ద్వారా అన్ననాళంలోపల, ఆమాశయంలోపల వ్రణాలు తయారైతే తెలుసుకోవచ్చు. ఇది దీర్ఘకాలపు దగ్గుకు కారణాలను అనే్వషించడానికి సహాయ పడుతుంది.
బ్రాంకోస్కొపి

 ఊపిరితిత్తులలోపల పెరిగే క్యాన్సర్లు, ఇనె్ఫక్షన్లు, బ్రాంకైటిస్, శరీరేతర పదార్థం ఊపిరితిత్తుల్లో చిక్కుకోవటం వంటివి కారణమేమో తెలుసుకోవడానికి ఈ పరీక్ష సహాయ పడుతుంది. దీనిలో వంచగలిగే కాంతిని ప్రసరింపచేయగలిగిన గొట్టాన్ని శ్వాసమార్గం లోపలకు చొప్పించి చూడటం జరుగుతుంది

–డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

సంబంధిత ఇతర వ్యాసాలు:

  1. పొడి దగ్గు తగ్గాలంటే…?
Share
54
ధన్వంతరి
ధన్వంతరి

Related posts

దగ్గు
January 7, 2014

పొడి దగ్గు తగ్గాలంటే…?


Read more

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.

జబ్బుల సూచీ

  • అమీబియాసిస్‌
  • అలర్జీ
  • అవాంఛిత రోమాలు
  • ఆయాసం
  • ఆయుర్వేదం
  • ఆస్తమా
  • ఊపిరితిత్తుల వ్యాధులు
  • ఎముకల సమస్యలు
    • వెన్నునొప్పి
  • ఎయిడ్స్
  • కంటి సమస్యలు
  • కాలేయ సమస్యలు
  • కుక్క కాటు
  • కోపం
  • క్యాన్సర్
    • కాలేయ క్యాన్సర్‌
    • గర్భాశయ క్యాన్సర్‌
    • ప్రొస్టేట్ కేన్సర్‌
  • క్లోమం వ్యాధి
  • క్షయ
  • గర్భ నిరోధక పద్దతులు
  • గర్భస్త సమస్యలు
  • గాయాలైనప్పుడు
  • గాయిటర్‌
  • గుండె జబ్బులు
  • గృహ వైద్యం
  • గ్యాస్ సమస్యలు
  • చర్మవ్యాధి
  • జలుబు
  • జుట్టు సమస్యలు
  • జ్వరం
  • డిఎన్‌ఏ
  • థైరాయిడ్ సమస్యలు
  • దగ్గు
  • దంత సమస్యలు
    • చిగుళ్ల వ్యాధులు
    • నోటి దుర్వాసన
  • నాడీ సమస్యలు
  • నిద్రలేమి
  • నొప్పులు
    • కడుపు నొప్పి
    • కీళ్ల వ్యాధులు
    • గొంతు నొప్పి
    • తలనొప్పి
    • నడుమునొప్పి
    • పొత్తి కడుపు నొప్పి
    • మెడనొప్పి
    • మోకాలినొప్పి
  • నోటి సంబంధ వ్యాదులు
  • పక్షవాతం
  • పాముకాటు
  • పిసిఒడి సమస్య
  • పొట్ట ఉబ్బరము
  • పోషకాహార సమస్య
    • తల్లిపాలు
  • ప్రకృతి వైద్యం
  • బహిష్టు సమస్యలు
  • మధుమేహం
  • మలబద్ధకం
    • మొలలు
  • మానసిక సమస్యలు
    • ఒత్తిడి
  • మూత్రపిండాల వ్యాధులు
  • మూర్ఛ వ్యాధి
  • మోకాలు నొప్పి
  • యోగా
  • వర్టిగో
  • వెరికోస్‌ వీన్స్‌
  • వ్యాయామం
  • సంతానలేమి
  • సెక్స్ సమస్యలు
  • స్థూలకాయం
  • హెర్నియా
  • హైపర్‌టెన్షన్‌
  • హోమియో చికిత్స

తాజా చేర్పులు

  • 0
    అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం
    December 5, 2018
  • 0
    అవాంఛిత రోమాలతో అవస్థలు
    December 3, 2018
  • విటమిన్-డి లోపం0
    విటమిన్-డి లోపిస్తే….
    December 3, 2018
  • instant noodles0
    మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!
    May 31, 2015
  • 0
    తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు
    September 12, 2014

ఇటీవలి వ్యాఖ్యలు

  • June 3, 2015

    Srinivas commented on మొలలు – చికిత్స, నివారణ

  • March 1, 2015

    saikrishna commented on కంటిని కాపాడుకోండి…

  • August 22, 2014

    Vinay commented on ఒంటి బరువు … వదిలించుకోండిలా

  • May 7, 2014

    javed commented on కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని

  • January 7, 2014

    ధన్వంతరి commented on కదలండి-ఆరోగ్యంగా ఉండండి

ట్యాగులు

  • అమీబియాసిస్‌
  • అలర్జీ
  • అవాంఛిత రోమాలు
  • ఆయాసం
  • ఆయుర్వేదం
  • ఆస్తమా
  • ఊపిరితిత్తుల వ్యాధులు
  • ఎముకల సమస్యలు
  • ఎయిడ్స్
  • ఒత్తిడి
  • కంటి సమస్యలు
  • కడుపు నొప్పి
  • కాలేయ క్యాన్సర్‌
  • కాలేయ సమస్యలు
  • కీళ్ల వ్యాధులు
  • కుక్క కాటు
  • కోపం
  • క్యాన్సర్
  • క్లోమం వ్యాధి
  • క్షయ
  • గర్భ నిరోధక పద్దతులు
  • గర్భస్త సమస్యలు
  • గర్భాశయ క్యాన్సర్‌
  • గాయాలైనప్పుడు
  • గాయిటర్‌
  • గుండె జబ్బులు
  • గృహ వైద్యం
  • గొంతు నొప్పి
  • గ్యాస్ సమస్యలు
  • చర్మవ్యాధి
  • చిగుళ్ల వ్యాధులు
  • జలుబు
  • జుట్టు సమస్యలు
  • జ్వరం
  • డిఎన్‌ఏ
  • తలనొప్పి
  • తల్లిపాలు
  • థైరాయిడ్ సమస్యలు
  • దగ్గు
  • దంత సమస్యలు
  • నడుమునొప్పి
  • నాడీ సమస్యలు
  • నిద్రలేమి
  • నొప్పులు
  • నోటి దుర్వాసన
  • నోటి సంబంధ వ్యాదులు
  • పక్షవాతం
  • పాముకాటు
  • పిసిఒడి సమస్య
  • పొట్ట ఉబ్బరము
Copy Right © 2017, Vaidyam.info. All Rights Reserved.