నడుము నొప్పి తీవ్రమైతే విశ్రాంతి తప్పనిసరి

నడుమునొప్పి.. నిర్లక్ష్యం పనికిరాదు!
October 17, 2012
కాలేయ క్యాన్సర్‌
July 28, 2013

నడుము నొప్పి తీవ్రమైతే విశ్రాంతి తప్పనిసరి

ఉదయం లేవగానే ఈ మధ్యకాలంలో చాలామందికి నడుము పట్టేసినట్లుగా ఉండి కదలికలు కష్టంగా మారుతున్నాయి. కొద్దిసేపు వ్యాయామం చేసిన తర్వాతగాని, వాకింగ్ చేసిన తర్వాత మరల మామూలు స్థితికి వచ్చి సులువుగా కదలడం జరుగుతుంది. ఈ సమస్య నేడు యువతి, యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యవల్ల ఒక్కోసారి వెనె్నముక, తొడ ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి జాయింటుల్లో కదలికలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వలన సమస్య తీవ్రత పెరుగకుండా చూసుకోవచ్చును. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.

శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం 33 వెన్నుపూసలతో తయారైన వెనె్నముక మనం వంగినా, లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులే తోడ్పడుతున్నాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్కులు అరిగిపోవుటంవలన లేదా డిస్కులు ప్రక్కకు తొలగటంవలన నడుము పట్టేసినట్లుగా అవుతుంది.
వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్ (మధులాస్థి అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి అస్టియోఫైట్స్ ఏర్పడుతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నడుముకు సంబంధించిన సమస్యలతో వేధించబడతారు.

నడుము బిగుసుకుపోవటానికి కారణాలు:

క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటీస్

 • స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం.
 • ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బతినడం లేదా ప్రక్కకు తొలగటం.
 • కంప్యూటర్స్ ముందు ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
 • ఒకేచోట గంటల తరబడి కదలకుండా పని చేయడం.

నిత్యం తీసుకునే ఆహారంలోకాల్షియం, విటమిన్స్ లోపించటంవలన నడుము బిగుసుకుపోయే సమస్యలు ఉత్పన్నమవుతాయి.

లక్షణాలు

నడుము తొంటి భాగంలో నొప్పి రావటం. నొప్పి తీవ్రంగా ఉండి నడుము ఎటువైపు కదల్చినా వంగినా, కూర్చున్నా నడిచినా నొప్పి తీవ్రత పెరుగును.

జాగ్రత్తలు

 • వ్యాయామం చెయ్యడం, స్విమ్మింగ్‌వంటి ఎక్స్‌ర్‌సైజులు ఉపకరిస్తాయి.
 • నడుము బిగుసుకుపోయి వేధించబడేవారు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది.
 • వాహనము నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుము నిటారుగా ఉండే విధంగా సరియైన స్థితిలో కూర్చోవాలి.
 • బరువులు ఎక్కువగా లేపరాదు. నడుము పట్టేసి నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బెడ్‌రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగాని, నేల మీద గాని పడుకోవాలి.
 • నడుమును ఒకేసారి అకస్మాత్తుగా తిప్పడం, వంచడం చేయకూడదు.
 • నడుము బిగుసుకుపోయి నొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే చేయాలి.
 • పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ప్రాణాయామం, యోగా చేయాలి.
 • స్థూలకాయం ఉన్నవారు వెంటనే బరువు తగ్గించుకోవటానికి ఆహార నియమాలు పాటించాలి. వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్, జింక్ ఫుడ్స్ తీసుకోవడం మానుకోవాలి.

చికిత్స

హోమియోవైద్యంలో నడుము బిగుసుకొనిపోవటాన్ని నివారించటానికి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను మరియు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, పరిగణనలోకి తీసుకొని మందులను ఎన్నుకొని వైద్యం చేసిన నడుమునొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

మందులు

ఆర్నికా:

పడటంవలన నడుము ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నడుము బిగుసుకొని పోతే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం నడుము బిగుసుకొని పోయి వేధిస్తుంటే ఈమందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.

హైపరికం:

వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే నడుము నడుము బిసుకొనిపోతే, అలాగే ఎడమ కాలు లేదా కుడి కాలుకు వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.

బ్రయోనియా:

నడుమును కదిలించినా, వంగినా, నడిచినా, నడుము బిగుసుకొనిపోయి నొప్పి అధికమగును. విశ్రాంతివలన నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్ధకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కువ. వీరిని కదిలించకూడదు. కదలికలవలన వీరికి బాధలు ఎక్కువగుట గమనించదగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

రస్టాక్స్:

నడుము బిగుసుకొనిపోయి నొప్పి ఉదయం నిద్ర లేచిన మొదటికదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించ దగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతోకూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణుకుట వలన వచ్చే నడుము నొప్పికి ఈ మందు బాగా పనిచేయును. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది. ఈ మందులే కాకుండా రూటా, సల్ఫర్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయమును పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల నడుము బిగుసుకొని పోవటాన్ని నివారించవచ్చును.

– డాక్టర్ పావుశెట్టి శ్రీ్ధర్

సెల్‌నెం. 9440229646

E-mail: [email protected]

(ఆంధ్రభూమి దినపత్రిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.