స్థూలకాయం జన్యుకారణమా?
January 3, 2011
నిద్ర అంటే రీఛార్జ్‌
January 3, 2011

నిద్రలేమి

నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి. దీన్నే ఇన్‌సోమ్నియా అంటారు. దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. ‘వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్య మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం’ జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.

కారణాలు

నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. అవి వైద్యపరమైనవి, ఆల్కహాల్స్‌, డ్రగ్స్‌, కొన్ని మందులు, మానసికజబ్బులు.

వైద్యపరమైనవి 

 దీర్ఘకాల నొప్పులతో కూడిన సమస్యలు ( మెడనొప్పి, నడుం నొప్పి, ఇతర శారీక నొప్పులు). శ్వాస సంబంధించిన రుగ్మతలు…దగ్గు, ఆస్తమా, ఆయాసం, అలర్జీ. గుండె సంబంధ జబ్బులు. వృద్ధాప్యం. మెదడులో ఏర్పడే కొన్ని రకాల కణతులు. రక్తప్రసరణలో, కండరాల్లో లోపాలు ఉన్నప్పుడు నిద్రలేమి సమస్య ఉంటుంది.

ఆల్కహాలు-మాదకద్రవ్యాలు 

 ఎక్కువ మోతాదులో ఆల్కహాలు తీసుకోవడం, మెదడును ఉత్తేజపరిచే కాఫీలు, టీలు తీసుకోవడం, ధూమాపానం, గంజాయి తీసుకోవడం, వక్కలు తీసుకోవడం వల్ల నిద్రపట్టదు.

మందులు

శ్వాసక్రియ సమస్యకు వాడే మందులు, ఇతర జబ్బులకు వాడే స్టిరాయిడ్లు, డిప్రెషన్‌కు వాడే మందుల వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.

మానసిక జబ్బులు

డిప్రెషన్‌, మానియా, ఆందోళన, మానసిక ఒత్తిడి కలిగించే ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలు నిద్రను దూరంచేస్తాయి.

హింసాత్మక కార్యక్రమాలు

సినిమాలు, టీవీల్లో కనిపించే హింసాత్మక దృశ్యాలు చూసిన పిల్లలకు నిద్రలో అవే గుర్తుకొస్తుంటాయి. దీంతో నిద్రపట్టదు. ఆందోళనకు గురవుతారు. అందుకని పిల్లలను వీటికి దూరంగా ఉంచాలి.

నిద్రలేమి దశలు 

 నిద్రలేమి నాలుగు దశల్లో ఉంటుంది.

మొదటి దశలో.. రాత్రి నిద్రపోవడానికి కష్టమవుతుంది. ఎప్పుడూ ఇది చింతతో కూడిన కలవరంతో సంబంధం ఉంటుంది.

రెండో దశలో…రాత్రి మధ్యలో నిద్రలేమి ఉంటుంది. మధ్యరాత్రిలో నిద్రలో మెలుకువ వస్తుంది. మధ్య, చివరి నిద్రలేములను ఆవరించిం ఉంటుంది.

మూడో దశలో… మధ్యరాత్రిలో నిద్రలేస్తే తిరగి నిద్రను కొనసాగించడం కష్టమవుతుంది.

నాలుగోదశలో .. . తెల్లవారుజమున నిద్రలేవడం.

అనర్ధాలు 

 నిద్రలేమితో బాధపడే ప్రతీ ఒక్కరిలో అనర్ధాలు కలుగుతాయి. ఇవి వారి జీవనశైలిలో మార్పులు తీసుకొస్తాయి…..

* తొందరగా అలసిపోతారు.

* చేస్తున్న పనిపై ఏకాగ్రత లోపిస్తుంది.

* తల, ఒళ్లు నొప్పులొస్తాయి.

* పని ఒత్తిడిని తట్టుకోలేరు.

* అనవసరమైన కోపం వస్తుంది.

* మతిమరపు మొదలవుతుంది.

* బద్దకంగా ఉంటుంది.

* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వాహనాలు నడపకపోవడం మంచిది. సాధారణ వ్యక్తుల కన్నా నిద్రలేమితో బాధపడే వారి వల్ల కలిగే ప్రమాదాలు 3 నుండి 4 రెట్లు ఎక్కువ.

* వృత్తిలో నైపుణ్యం తగ్గుతుంది.

* వృద్ధులు కిందపడితే ఎముకలు విరిగే అవకాశం ఎక్కువ.

* ఆకలి మందగించి, జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

సుఖనిద్ర కావాలంటే…

* నిద్రలేమితో బాధపడేవారు ప్రతీ ఒక్కరూ నిద్రమాత్రలు వాడాల్సిన అవసరం లేదు.

* నిద్రలేమికి కారణాలను గమనించి, వీటిని పరిష్కరిస్తే మందులు లేకుండానే నివారించొచ్చు.

* నిద్రమాత్రలు 15 రోజులకు మించి వాడకూడదు. వాడితే మందులకు బానిసయ్యే అవకాశముంది.

* నిద్రలేమికి మందులు వాడాల్సినప్పుడు నిద్రలేమికి కారణమైన సమస్య నివారణకు వాడే మందులతోపాటు వాడాలి.

* ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం నివారించాలి.

* రిలాక్సేషన్‌ పద్ధతులు పాటించడం వల్ల దీన్ని నివారించొచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.