జబ్బుల్ని నయం చేసే నీరు!
June 2, 2011
తాజా శ్వాసతో… దగ్గరగా రా…!
June 3, 2011

నైక్రోసిస్‌

విష సర్పం కాటేస్తే సంభవించే అనారోగ్యం నైక్రోసిస్‌. విషసర్పం కాటేస్తే, ఆ పాము కోరల నుంచి విషం మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ విషం శరీరమంతా వ్యాపించి మనిషి మరణించడం జరుగుతుంది. పాము కాటేసినప్పుడు ఆ విషం రక్తంలో కలసి, శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు గుడ్డను గట్టిగా బిగించి కడతారు చాలా మంది. పాము కాటుకు గురైనవారికి ప్రథమచికిత్స జరిపించి, వైద్యుని వద్దకు తీసుకువెళితే ప్రాణాపాయం తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో పాము విషానికి విరుగుడు మందులు లభిస్తున్నాయి.

విష సర్పం కాటేసినప్పుడు ఔషధాలతో ప్రాణాపాయం తప్పినప్పటికీ, పాము కాటుకు గురైన చర్మం వాచిపోతుంది. ఆ ప్రాంతంలో బాక్టీరియాచేరి, విషపదార్ధాలు కూడా కలిసి చీము ఏర్పడుతుంది. ఆ కారణంగా రక్తప్రసరణకు అవరోధం కలుగుతుంది. ఈ స్థితిని వైద్యభాషలో నైక్రోసిస్‌ అంటారు. ఆ దశలో రక్తనాణాల పనితీరుకు కూడా అవరోధం కలుగుతుంది. అనారోగ్యకరమైన సమస్యలు ఏర్పడతాయి. ఆ స్థితిని సరిచేయాలంటే, ప్లాస్టిక్‌ సర్జరీ అవసరమవుతుంది. అయితే, ప్లాస్టిక్‌ సర్జరీ అన్నది అధిక ధన వ్యయంతో కూడుకున్నది కనుక సామాన్యులకు అందుబాటులో ఉండదు.

నైక్రోసిస్‌ నివారణ కోసం, అమెరికాకు చెందిన లూయిస్‌ (ూబఱర) అర్జెంటా ఒక వ్యాక్యుమ్‌క్లీనర్‌ను రూపొందించారు. ఆ పరికరం ద్వారా పాముకాటుకు గురై, వాపు వచ్చి, చీము చేరిన ప్రాంతం నుంచి, ఆ ద్రవాన్ని తొలగిస్తారు. పాము కాటుకు గాయమైన స్థితి తొలగి, చర్మం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే, ఈ వ్యాక్యూమ్‌క్లీనర్‌ను ఉపయోగించే విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

-కె.నిర్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.