విషజ్వరాలను ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా ?
October 5, 2010
విటమిన్‌ బితో పక్షవాతం, గుండెజబ్బులు దూరం
October 10, 2010

నోట్లో పుండ్లు – చికిత్స

నోట్లో పూత అంటే, నోట్లో పుండ్లు, నాలుక ఎర్రగా వుండడం పెదవుల మీద పుండ్లు, నోటి కొసలో చీలినట్టువుండడం. చిగుళ్లు వాపు, నోటి పైభాగాన అంగిళి (ప్లాలెట్‌) మీదపుండ్లను కూడా కొందరు నోటి పూత అంటారు.

కారణాలు : ధూమపానం, మద్యపానం అలవాటు. నోటి అపరిశుభ్రత. సరిగ్గా పోషక పదార్థాలు శరీరానికి అందకపోవడం. వ్యాధి నిరోధకశక్తి క్షీణించి నోట్లో వుండే సూక్ష్మక్రిములు బాగా అభివృద్ధి చెందినప్పుడు. కొన్ని దీర్ఘకాల వ్యాధులు. ఫంగల్‌, బ్యాక్టిరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల. జీర్ణాశయ, పేగుల వ్యాధుల వల్ల. మరికొందరిలో మలబద్ధకం వల్ల. ఎక్కువ ఆందోళన చెందడం. ఆడవారిలో నెల సరి వచ్చే ముందు రోజుల్లో. మధుమేహం, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌లలో ఎక్కువ కార్టిజోన్‌ మందులు వాడేవారిలో. జీర్ణవ్యవస్థ లోపం వల్ల బి-కాంప్లెక్స్‌ (నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌ పోలిక్‌ యాసిడ్‌, బి-12 ఐరన్‌ జింకు) శరీరానికి సరిపాళ్ళలో అందకపోడం వల్ల ఈ నోటి పూత ఏర్పడుతాయి.

లక్షణాలు : నాలుక బాగా ఎర్రగా వుండడం. కొందరిలో తెల్లగా గుంత పడినట్టు పుండు, దాని చుట్టూ ఎర్రగా కనిపించడం. కొద్దిగా కూడా వేడి పదార్థాలు తినలేకపోవడం. కారం, మసాల దినుసులు తినలేక పోవడం. పంటి నొప్పి, నోట్లో నీరు ఊరునట్టుండడం.

చికిత్స : విటమిన్లు, పోషకపదార్థాలు సరిగ్గా లేక నీరసించి వున్నవాళ్ళు బి-కాంప్లెక్స్‌ (నియాసిన్‌, ఫోలిక్‌ ఆమ్లం, రిబోఫ్లేవిన్‌ బి12 జింకు, ఐరన్‌ కలిగిన) మాత్రలు వాడాలి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వుంటే మెట్రోనిడియోజాల్‌ 200 మిల్లీగ్రాములు రోజుకు మూడేసి, ఫంగస్‌ వుంటే నిస్టాంటిన్‌ లాజెంజెస్‌, క్యాడిడ్‌ లోషన్‌ లేక జెల్లి అంటించాలి. నోటిని పరిశుభ్రతగా వుంచాలి. చిగుళ్ళ వ్యాధికి తగు చికిత్స చేయించాలి. క్లోర్‌హెక్సిడిన్‌ మౌత్‌ పెయింటు వాడాలి. మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి. ఆందోళనను నియంత్రించుకొని ప్రశాంత జీవన శైలి అలవర్చుకోవాలి. జీర్ణాశయప్రక్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానాలి. కిళ్లీ, జర్దా, పాన్‌ పరాగ్‌ వాడకం మానాలి. అవసరాన్ని బట్టి హైడ్రోకార్టిజోన్‌ లాజెంజెస్‌ గాని, బిళ్లలుగాని డాక్టరు సలహా మేరకు కొద్ది రోజులే వాడాలి. కొన్ని వ్యాధులు (ఎయిడ్స్‌, మధుమేహం వంటివి) కొన్ని మందుల వల్ల కల్గితే, రక్తంలో దోషముంటే వాటికి తగిన చికిత్స చేయించాలి.

డాక్టర్‌ హెచ్‌. కృష్ణమూర్తి

చీఫ్‌ ఫిజిషియన్‌, మల్లు వెంకటనర్సింహారెడ్డి,

మెమోరియల్‌ క్లీనిక్‌, ఎంహెచ్‌ భవన్,‌

అజామాబాద్‌, హైద్రాబాద్‌.

ఫోన్‌ : 9676376669

(

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.