గట్టిపడ్డ కాలేయానికి చికిత్స
November 1, 2010
శబ్దం బాబోయ్ శబ్దం
November 1, 2010

పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం

పరిణామక్రమంలో సకశేరుకాలైన వివిధ జంతువులు నాలుగు కాళ్లు కలిగి, వాటి వెన్నెముకలు, వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండేవి. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. మిగతా జంతువుల కన్నా తన చేతుల ద్వారా రాయడం, తద్వారా జ్ఞాన సముపార్జన పొంది ఎంతో అభివృద్ధి చెందాడు. క్రమంగా వెన్నెముకలు, వెన్నుపూస భూమికి లంబకోణ ముఖంలో మార్పు చెందింది.

తన దైనందిన కార్యక్రమంలో అన్ని పనులు ముందుకు వంగి చేసుకోవడానికి అలవాటు పడ్డాడు. పరిణామ క్రమంలో వెన్నుపూస ముందు భాగాన అంటే ఉదరభాగం మెడ ముందు భాగం, ఎదభాగంలోని కండలు బాగా అభివృద్ధి చెందాయి. వెనుక పక్కన అంటే వీపు, పైవీపులో కండలు బలహీనపడి నడుం బ్యాలెన్స్‌లో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో వివిధ రకాల వెన్నుపూసలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. వీటిని స్పాండైలోసిస్‌ అంటారు.

 

మనిషి వెన్నెముక మొత్తం 33 ఎముకల సమూహారం. ఈ ఎముకల మధ్య ఘర్షణ తగ్గడానికి ఏర్పడిన మృదువైన కణజాలమే డిస్క్‌. సాధారణంగా నడుం (లంబార్‌), మెడ (సర్వైకల్‌) ఎముకల్లో అరుగుదల మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఇతర కీళ్లలోని ఆర్త్రైటీస్‌ కారణాలన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. వీటితోపాటు పడుకునే విధానంలోను, పనిచేయడంలో ఎక్కువగా వంగడం ద్వారా కూడా ఈ కీళ్లలో ఎక్కువగా మార్పులు వస్తుంటాయి. ఆర్రైటీస్‌లోని ఆయా కీళ్ల వద్ద నొప్పులు, ఇతర రోగ లక్షణాలు కనిపిస్తాయి. కానీ స్పాండైలోసిస్‌లో అరుగుదల మార్పులు ఏర్పడినప్పుడు డిస్క్‌లు వెనకకు జరిగి, మెదడు నుండి వెన్నుపూసల ద్వారా చేతులు, కాళ్ల దేహంలోని వివిధ ఇతర భాగాలకు వచ్చే స్పైనల్‌ నరాలు ఒత్తిడికి లోనై, వెన్నుముక, పూసల్లోనేకాక నరాల పొడవునా నొప్పి ఏర్పడుతుంది. దీన్నే న్యూరాల్జియా అంటాం. ఈ ప్రత్యేక లక్షణాన్ననుసరించి స్పాండైలోసిస్‌ వైద్యం వైవిద్యభరితంగా ఉంటుంది.

డాక్టర్జె. భాను కిరణ్

ఆర్థొపెడిక్సర్జన్డాక్టర్వెంకట రామప్ప హాస్పిటల్

సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ

బెంగళూరురోడ్డు, అనంతపురం.

ఫోన్‌ : 08854272881

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.