మధుమేహం అత్యంత ప్రమాదకారి
September 27, 2011
మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం
August 9, 2012

పిసిఒడి ఉంటే..

ఇటీవల చాలామంది స్ర్తిలు అంటే సుమారుగా 100కి 75 నుండి 80 మంది మహిళలు, యుక్త వయస్కులు ఈ బాధపడుతున్నట్లు సర్వేల్లో తేలింది. వైద్య పరిభాషలో పిసిఒడి (పాలి సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అనగా అండాశయంలో చిన్నచిన్న నీటి బుడుగులాంటి ‘సిస్ట్’లు ఏర్పడటం. ఇలాంటి ‘సిస్ట్’లు అండం విడుదలకు అడ్డంకిగా మారి సంతానలేమికి కారణమగుచున్నవి. ఒకవేళ కొందరు సిస్ట్ ఉండి గర్భం ధరించినా నిలువకుండా అబార్షన్ కావటం జరుగుతోంది.
కారణాలు
మానసిక ఒత్తిడి, హార్మోనుల (ఈస్ట్రోజన్, ప్రోజెస్టిరాన్) అసమతుల్యత, ఆందోళన, సరైన ఆహారం తీసుకోకపోవడం.
లక్షణాలు
* పిసిఒడి వలన గర్భం ధరించలేకపోవటం, ఒకవేళ గర్భం ధరించినా గర్భస్రావం జరిగిపోవటం.
* పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా ఉంటుంది. పీరియడ్స్ సక్రమంగా రాకపోవటం
* బరువు పెరుగడం, శరీరంపై, ముఖంపై అవాంచిత రోమాలు రావడం.
* మానసికంగా చికాకుగా ఉండటం.
జాగ్రత్తలు
* ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించటానికి యోగ, మెడిటేషన్, వ్యాయామం నిత్యం చేయాలి.
* వ్యాయామం అంటే ఒక నడకనే కాకుండా స్కిప్పింగ్, స్విమ్మింగ్, పరుగెత్తడం, ఏరోబిక్ వంటివి చేయాలి.
* బరువున్నవారు క్యాలరీలు తగ్గించుకునేటువంటి వాటిపై వ్యాయామాలు నిత్యం చేయాలి.
* అధిక ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
* తాజాకూరగాయలు, పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు వంటివి నిత్యం తీసుకోవడం వలన హార్మోనుల పనితీరు మెరుగుపడుతుంది.
* అలాగే ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని కొనసాగించాలి.
చికిత్స
హోమియో వైద్యంలో పిసిఒడికి మంచి చికిత్సఉంది. వ్యక్తి శరీరతత్వం, మానసిక లక్షణాలు, వ్యక్తి అలవాట్లు మరియు ఆలోచన విధానం ఆధారం చేసుకొని మందులను ఎంచుకొని చికిత్స తీసుకొంటే ‘హార్మోనులు’ సమతుల్యంగా పనిచేస్తాయ. నెలనెల పీరియడ్స్ సక్రమంగా వస్తాయ. దీనివల్ల సంతానం కలిగే అవకాశాన్ని ఏర్పడుతుంది.
మందులు
సెపియా: నెలసరి చాలా ఆలస్యంగా రావడం, రుతుస్రావం చాలా తక్కువగా అవ్వడం లేదా నెల పూర్తవకుండానే అధిక రక్తస్రావం జరగడం, ఆ ప్రదేశం నొప్పి ఉండి, గర్భాశయం కిందకి జారిపోతుందేమోనన్న భయం. దేనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం. ఒత్తిడితో అలిసిపోయిన స్ర్తిలకు ఈ మందు బాగా పని చేస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఎక్కువగా చికాకుగా ఉంటూ, భర్త పిల్లల ఎడ అనురాగం చూపించక పోవడం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
గ్రాఫైటీస్: అధిక బరువు ఉండి, బద్ధకం, భయం, పిరికితనం, సొంత నిర్ణయం తీసుకోలేక పోవడం, మలబద్ధకం నెలసరి చాలా ఆలస్యంగా రావడం, సరిగ్గా రక్తస్రావం జరగకుండా దగ్గు, చెమటలు, గర్భాశయం అంతా నొప్పి, మూడు నుంచి ఆరు నెలలకు నెలసరి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.
సిమిసిప్యూగా: చాలా రోజులకు నెలసరి రావడం అధిక రక్తస్రావం. క్లాట్స్‌గా అవ్వడం, నడుంనొప్పి, తొడల నొప్పి, అండశయంలో నొప్పి, ఆందోళన, భయం, నీరసం, నెలసరి రాకపోవడంతో గర్భం దాల్చినట్టుగా అనుకోవడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
పల్సటిల్లా: మానసిక స్థాయిలో వీరిది సున్నితమనస్తత్వం, ప్రతి చిన్న విషయానికి బాధపడటం, ఏడవటం, ప్రతి విషయానికి గాబరాపడటం, భయం, మనసు చంచలంగా ఉండటం, నిలకడ లేకపోవడం వంటి లక్షణాలు ఉండి రుతుక్రమం కూడా ఒక పద్ధతి లేకుండా త్వరగా, ఆలస్యంగా, తరచుగా అనేక రకాలుగా, నెలసరి సమయంలో నీళ్ళ విరేచనాలు, నీళ్ళల్లో తడవగానే బ్లీడింగ్ ఆగిపోవడం, దాహం లేకపోవడం, వేడిని తట్టుకునే శరీరతత్వం ఉన్నవారికి ఈ మందు సరిపడుతుంది.
ఇవేకాకుండా ఇగ్నిషియా, సల్ఫర్, నైట్రోమోర్, లేకసిస్, పల్సటిల్లా, కాల్కేరియాకార్బ్, సైలీషియా, మెడోరినమ్, బెల్లడోనా, కాల్యేరియా ఫాస్, అరంమురాటికం, నైట్రికం వంటి కొన్ని మందులను డాక్టర్ సలహా మేరకు వాడి పి.సి.ఒడి నుండి బయటపడి మంచి జీవనం కొనసాగించవచ్చును.

-డాక్టర్ పావుశెట్టి శ్రీధర్,

హోమియోఫిజిషియన్


E-mail: [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.