డిఎన్‌ఏలో నుదుటి వ్రాత
October 26, 2010
పైల్స్‌తో బాధపడుతున్నారా?
October 28, 2010

పీచులో ఉందిలే మజా

‘పీచు చేసే మేలు ఈనాటి ఫాస్ట్ తరానికి తెలీదు. వృద్ధాప్య తరానికి తెలుస్తుంది. ఉదయానే్న మోషన్ అవక వాళ్లెంత ఇబ్బంది పడ్తారో… అసలు పీచు పదార్థం తీసుకొన్నవాళ్ళకు ఆహారం జీర్ణమవడమేకాదు చర్మానికి కాంతి కూడా వస్తుంది.

* నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, కెంటకీ చికెన్లు… వీటిలో పీచుపదార్థం ఏదీ ఉండదు. నోటికి టేస్ట్… ప్రేవులకు రెస్ట్. ఉదయానే్న మలబద్దకం.. పీచు ఎక్కువ తింటే జీర్ణశక్తిలో ఎలాంటి లోపాలు కలుగవు. ప్యాకేజ్ ఆహారాన్ని పక్కన బెట్టండి. ఇవి ఫైబర్‌ని నాశనం చేస్తాయి.

* పూర్వం బీరకాయ కూర చేసేటప్పుడు, బీరకాయ తొక్కు వృథా పోనిచ్చేవారు కారు. తొక్కు పచ్చడి ఉండేది… కేలరీలకు కేలరీలు. ఫైబర్‌కి ఫైబర్.

* పీచు పదార్థములు తినడం కష్టం కాదు. అదో అలవాటుగా చేసుకోవాలి. వినడానికి, చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నా ఆచరించి తీరాల్సిన నిజాలవి. వేరుశెనక్కాయలు తింటున్నారనుకోండి.. తొక్కలు పారేస్తారు కదా! నాల్గైదు కాయలు గింజలతో సహా నమిలి మింగండి. ఏ కూరగాయకూ తొక్కును సాధారణంగా తీయకండి.

ముడిబియ్యం ఎక్కువ వాడండి

మైదా పిండికంటె చపాతీ పిండి, మొక్కజొన్న పిండి, జొన్నపిండిని బాగా వాడండి.

రాగి అన్నం, జొన్న అన్నం, ఇలా వెరైటీ ట్రై చెయ్యండి. ముదురు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి.

*బీన్స్, బక్రా, పొట్టు ధాన్యాలు, ఓట్స్, ధాన్యంతో తయారయిన బ్రెడ్ వీటిల్లో పీచు అధికమోతాదులోనే ఉంటుంది.

*రోజూ పీచు 25 గాములు తప్పనసరిగా తినాలి. అప్పుడే మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పీచు పదార్థం మనం తీసుకోకపోతే అనారోగ్యం పలుకరిస్తుంది.

* 35 గ్రాముల పీచు తింటే… మీకు కోవాన్‌క్యాన్సర్ 40 శాతం తగ్గినట్టే అంటున్నారు పీచు నిపుణులు.

డా. కె. సంధ్యారాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.