పీచులో ఉందిలే మజా
October 26, 2010
జ్వరాలతో నా అనుభవాలు
November 1, 2010

పైల్స్‌తో బాధపడుతున్నారా?

ఒకే చోట కదలకుండా కనీసం పది నిముషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటు ఇటూ కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్తా చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే ‘పైల్స్‌’. ఈ సమస్యను బయటకు చెప్ప కోలేక చాలా మంది లోలోన మధనపడుతుంటారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

పైల్స్‌ (హెమరాయిడ్స్‌)లను సాధారణంగా అర్శమొలలు అంటారు. పైల్‌ అంటే గడ్డ అని హెమరాయిడ్‌ అంటే రక్త స్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలకలుగా కనబడినా, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి.

కారణం 

 తీవ్రమానసిక ఒత్తిళ్లు. మల విసర్జన సరిగా జరగక మలబద్దకం ఏర్పడటం. ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం. తక్కువగా నీరు తాగడం. మద్యం అతిగా సేవించడం. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుల్లు అతిగా తినడం. మాంసాహారం తరుచూ తినడం వల్ల పైల్స్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు 

 మల విసర్జన సాఫీగా జరగక తీవ్ర నొప్పి, మంట వుంటాయి. అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.

జాగ్రత్తలు 

 పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు). రోజూ వ్యాయామం చేయాలి. రోజూ మల విసర్జన సాఫీగా జరిగేటట్టు చూసుకోవాలి. మద్యం అతిగా సేవించడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుల్లు, మాంసాహరం, చిరుతిళ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

చికిత్స 

 వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చును. హోమియో వైధ్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచిస్తారు. పైల్స్‌ చికిత్సలో వాడే మందులు..

నక్స్‌వామికా 

 శారీరక శ్రమ లేకుండా, మలబద్దకంతో బాధపడుతూ తరచుగా మలబద్దకం నివారణ మాత్రలు వాడే వారికి ఈ మందు పనిచేస్తుంది. తరుచుగా మల విసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెలితే మలం సాఫీగా జరుగక బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు పనిచేస్తుంది.

సల్ఫర్‌ 

 పైల్స్‌ వ్యాధి నయం చేయుటలో ఈ మందు అతి ముఖ్యమైంది. మలబద్దకంతో బాధపడుతూ, మలవిసర్జనకు వెలితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధాకరంగా ఉంటుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉండి బాధపెడుతుంది. మలవిసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు వచ్చి వేధిస్తాయి.

అస్కులస్‌హిప్‌ 

 మల ద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాంటేనే భయపడి పోతారు. విరేచనం తరువాత నొప్పిగా, బాధగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగినది.

రటానియా 

 వీరికి ఆసనంలో గాజు పెంకులు గుచ్చు తున్నట్లుగా ఉంటుంది. విరేచనం వెళ్లిన తరువాత కొంత సేపు వరకు నొప్పిగా బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు పనిచేస్తుంది.

హెమామెలీస్‌ 

 మలబద్దకంతో బాధ పడుతూ ఉంటారు. మలవిసర్జనకు వెళ్తే మలం సాఫీగా జరగక మంట, నొప్పి కూడా రక్తం విస్తారంగా పడుతూ ఉన్నప్పుడు ఈ మందు పనిచేస్తుంది. ఈ మందులే కాకుండా పైల్స్‌తో బాధ నివారణకు నైట్రిక్‌ ఆసిడ్‌, అలోస్‌, మ్యురాటిక్‌ ఆసిడ్‌, గ్రాఫాయిటీస్‌, మెర్కుసాల్‌, ఫాస్పారస్‌ వంటి మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని పైల్స్‌ నుండి విముక్తి పొందవచ్చు. అయితే వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే మందులు వాడాలి.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌,

హోమియోఫిజీషియన్‌

అంజనా హోమియోక్లినిక్‌, హన్మకొండ, వరంగల్‌

సెల్‌ : 9440229646

 (మూలంప్రజాశక్తి, 25 అక్టోబర్)

4 Comments

  1. kalyani says:

    naku emadyane files vachayani thelisindi appudappudu noppiga untundi ami cheyali operation cheenchukovala

  2. sathyam says:

    i am sufferfing from piles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.