‘బద్ధకం’ వదిలించుకోండి

దంత వైద్యానికి లేజర్‌ – చికిత్స
October 4, 2010
ఒంటి బరువు… వదిలించుకోండిలా
October 5, 2010

‘బద్ధకం’ వదిలించుకోండి

మలబద్ధకం. ఎంతోమందిని తరచుగా వేధించే సమస్య. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీనిని తగ్గించుకునే అవకాశమూ ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టే కొన్ని పదార్థాల గురించి తెలుసుకోండి…

 • అప్పుడప్పుడు అల్లం వేసి కాచిన టీ తాగండి. ఇది పేగుల కదలికలను నియంత్రించేందుకు తోడ్పడుతుంది.
 •  జామపండ్లను విత్తనాలతో పాటు తింటే వాటిల్లోని పీచు మలబద్ధకాన్ని తొలగించేందుకు దోహదం చేస్తుంది.
 •  పేగులను ప్రేరేపించటానికి ఆపిల్స్‌ సాయం చేస్తాయి. అయితే వీటిని చెక్కు తీయకుండా తినాలని మరవరాదు.
 •  రోజుకి కనీసం ఒకసారైనా క్యారెట్‌ రసం తాగితే మేలు.
 •  రాత్రిపూట 5-6 ద్రాక్షపండ్లను నీటిలో నానేయాలి. పొద్దున్నే వాటిని తినేసి ఆ నీరు తాగితే ఉపశమనం కలగొచ్చు.
 •  పీచుతో కూడిన బ్రెడ్‌, ధాన్యాలు తినటం మంచిది.
 • క్యాల్షియం దండిగా ఉండే పెరుగు పెద్దపేగు ఆరోగ్యానికీ మంచిదే. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 • రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. ఇది పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది.
 • క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి కూడా పేగుల కదలికలు సాఫీగా ఉండేలా చూస్తాయి.
 • పెద్దపేగు ఆరోగ్యానికి బత్తాయిపండ్లు తోడ్పడతాయి. రోజుకి ఒక గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే పేగులు శుభ్రంగా ఉండేందుకు సాయం చేస్తుంది.
 • బియ్యం బదులు గోధుమలు వాడటమూ ఉపయోగకరమే.
 • మలబద్ధకాన్ని తొలగించటంలో పచ్చి పాలకూర రసం ఎంతగానో దోహదం చేస్తుంది.
 • అన్నింటికన్నా ముఖ్యంగా సమతులాహారం తీసుకోవటం అవసరం. ఇందులో శుద్ధిచేయని తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, తేనె, పండ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

(ఈనాడు, 5 అక్టోబర్ 2010)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.