శబ్దం బాబోయ్ శబ్దం
November 1, 2010
ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి
November 8, 2010

బలాన్ని ఇచ్చే బాదం

బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం.

ఎలా వాడితే మంచిది?

వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది.

బాదంపాలు

 బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది.

మంచి టానిక్‌

 బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది.

కొన్ని సూచనలు

 ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు.

డాక్టర్‌ గాయత్రీదేవి
ఆయుర్వేద వైద్యనిపుణులు
ఆరోగ్యపీఠం, మోతీనగర్‌
హైదరాబాద్‌
ఫోన్‌ నెం. 98488 30055 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.