కాలేయ క్యాన్సర్‌
July 28, 2013
కీళ్లనొప్పులు – ఆయుర్వేద పరిష్కారాలు
November 4, 2013

బహిస్టు సమయంలో వేదించే నోప్పి

ఈ రోజుల్లో చాలా మంది స్ర్తీలలో బహిస్టు సమయంలో  బాధిస్తుంది. ఇటువంటి నొప్పినే వైద్య పరిభాషలో డిస్మెనోరియా( పెయిన్‌ మెన్సెస్‌) అంటారు. బహిస్టు కనబడిన తరువాత మొదటి రెండా మూడు సంవత్సరముల వరకూ బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి రావడం సాధారణంగా జరుగదు.సుమారు 50 శాతం మంది స్ర్తీలు బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పితో బాధపడుతుంటారు. యుక్త వయస్సు అంటే 18 సంవత్సరముల నుంచి 24 సంవత్సరముల వరకూ ఉన్న స్ర్తీలలో బహిస్టు సమయంలో కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివాహా అనంతరం నొప్పితో తీవ్రత తగ్గుతుంది.

జాగ్రత్తలు

Periodsహర్మోణుల సమతుల్యతను కాపాడటానికి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, పండ్లు, కాయగూరలు, మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గటానికి ప్రయత్నించాలి.
నిత్యం యోగా, ప్రాణామయం చేయాలి.
మానసిక ఒత్తిడిని నివారించటానికి ధాన్యం చేయాలి.
నొప్పి తీవ్రత రక్తస్రావం ఎక్కువగా ఉన్నపుడు వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.

చికిత్స

హోమియో వైద్యంలో బహిస్టు సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పికి మంచి చికిత్స కలదు. వ్యాధి లక్షణాలను వ్యక్తి మానసిక, శరీరక లక్షణాలను, పరిగణలోకి తీసుకుని మందులను ఎన్నుకుని వైద్యం చేసిన బహిస్టు సమయంలో వచ్చే నొప్పి నుంచి విముక్తి పొందవచ్చును.

మందులు

మెగ్నిషియంఫాన్‌ : బహిస్టు నొప్పికి ఇది అత్యంత ప్రయోజనకరమైన మందు. మెన్సెస్‌ రాకముందే పొత్తి కడుపులో నొప్పి రావడం, కదలిక వలన నొప్పి అధికమవుట ఈ మందు ముఖ్యలక్షణం. వీరికి మన్సెస్‌ ముందుగా రావటం, రక్తస్రావాలు ఎక్కువగా అవుతుంటాయి. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందులు తప్పక ఆలోచించదగినది.

వల్సటిల్లా : హోమియో ఈ మందు స్త్రీల ఔషదంగా పేరొందింది. వీరిలో బాధలు ఒకేసారి పెరిగి ఒకేసారి తగ్గుతాయి. వీరికి బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి బాధిస్తుంది. వీరు మానసికంగా చాలా సున్నిత స్వభావులు, చూడటానికి శాంతంగా ఉండి తేలికగా ఏడుస్తారు. వీరు ఏడువకుండా ఏ సమస్యలు చేప్పలేరు. వీరికి మెన్సెస్‌ కూడా సక్రమంగా రావు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.

లేకిసిస్‌ : మన్సెస్‌ ముందు బాధలు ఎక్కువగా ఉండి, మన్సెస్‌ మొదలు కాగానే బాధలు తగ్గి ఉపశమనం పొందుతారు. నొప్పి ఎడుమ పక్క మొదలై కుడిప్రక్కకు పోవుట ఈ మందు ప్రత్యేక లక్షణం. మెన్సెస్‌ రావటానికి ముందే పొత్తి కడుపులో నొప్పి అధికమగును. వీరికి రక్తస్రావాలు ఎక్కువగా అవుతుంటాయి. వీరికి మన్సెస్‌ ఆలస్యంగా వస్తాయి. వీరు మానసిక స్థాయిలో ధ్వేషపూరిత, పగ పట్టిన స్వభావం కలిగి ఉంటారు. వీరు బద్దకస్తులు, గర్వం ఎక్కువ. తేలికగా కోపానికి వస్తారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడి ప్రయోజనం పొందవచ్చును.

బెల్లడోనా : వీరికి మెన్సెస్‌ మూడురోజుల ముందుగానే నొప్పి వస్తుంది. చిరాకు కోపం ఎక్కువగా ఉంటుంది. కదలిక వలన నొప్పి అధికమగును. వీరిక మెన్సెస్‌ ముందుగా వస్తాయి. రక్తస్రావాలు ఎక్కువగా అవుతుంటాయి. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడి ప్రయోజనం పొందవచ్చును. ఈ మందులు కాకుండా సెపియా, నైట్రోమర్‌, కామామిల్లా, కాల్మియా, సెబైనా, ఎకోనైట్‌, కోలోసింత్‌, కాల్కేరియాకార్బ్‌, వంటి మందులు లక్షణాలను, వ్యాధి లక్షణాలను, శరీర తత్వమును పరిగణలోకి తీసుకుని మందులన ఎన్నుకొని వైద్యం చేసిన బహిస్టు నొప్పి నుంచి విముక్తి పొందవచ్చును.

డిస్మెనోరియాను ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చును. మొదటిది ప్రైమరీ డిస్మెనోరియా, రెండోవది సెకండరి డిస్మెనోరియా.

ప్రైమరీ డిస్మెనోరియా యుక్త వయస్సులో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి బహిస్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా హర్మోణుల అసమతుల్యతే కారణం.

సెకండరీ డిస్మెనోరియా వయస్సులో మీరిన స్ర్తీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గర్భశయ కనతులు పెల్విక్‌ ఇన్‌ఫెన్‌ ఉండటం కారణం.

అలాగే బహిస్టు సమయంలో కండరాలు సంకోచం వల్ల, గర్భకోశ ముఖ ద్వారం వంగి ఉండటం వలన, ఓవేరియన్‌ సిస్టుల వల్ల కూడా బహిస్టు సమయంలో కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది.

– డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌
హోమియో ఫిజిషియన్‌, హాన్మకొండ. సెల్‌ 9440229646

(సూర్య దినపత్రిక, జూలై ౨౨ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.