మధుమేహం అత్యంత ప్రమాదకారి

ప్రొస్టేట్ కేన్సర్‌ను పసిగట్టేదెలా?
August 28, 2011
పిసిఒడి ఉంటే..
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా ఇది అన్ని వయస్సుల వారిని టార్గెట్‌ చేస్తున్నది. పిల్లల్లోను ఈ వ్యాధి కనిపిస్తున్నది.

మధుమేహం బిపి, గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. ఇది సైలెంట్‌ కిల్లర్‌. శారీరక వ్యవస్థను ఇది దెబ్బతీసే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉంటుంది. అందుకే దీనిని వైద్యుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకుంటే ప్రాణాపాయం తప్పదని చెప్పవచ్చు.

ఈ వ్యాధిని తగ్గించడంలో ఆహారం పాత్ర చాలా అమోఘమైనది. భోజనంలో కుటుంబ సభ్యులకు వండిన వంటకాలనే భుజించవచ్చు. కాని, తినదగిన ఆహార పదార్థాలను మాత్రమే తగు మోతాదులో వాడాలి. నూనె పరిమాణం 5 టీ స్పూన్‌లకు మించి వాడకూడదు. ఆహారంలో పీచు పదార్థాలు తప్పకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకు కూరల్లో పీచు హెచ్చుస్థాయిలో ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వాడితే గుండె జబ్బులు, ప్రేగుల కాన్సర్‌ రాకుండా కాపాడుతాయి. అలాగే బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ కొలెస్టరాల్‌ను ఇవి తగ్గిస్తాయి.
హైపోగ్లైసీమియా అనగా రక్తంలో షుగర్‌ సాధారణ స్థాయి వరకు తగ్గిపోవడం, ఆకలి హెచ్చుగా, నీరసం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దడ, గాబరా హెచ్చుగా ఉంటుంది. వెంటనే చక్కెర లేక గ్లూకోజ్‌ను తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అనంతరం వైద్యుడ్ని సంప్రదించాలి. కిటోసిస్‌ అనగా శరీరంలో మోతాదుకు మించి కీటోన్స్‌ చేరడం, ఈ పరిస్థితుల్లో వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించాల్సివుంటుంది. లేనిపక్షంలో కోమాలోకి వెళ్ళడం లేదా మరణించడం సంభవిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ కొలెస్టరాల్‌ ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.

బ్లడ్‌ షుగర్‌ స్థాయి 120 నుండి 180 ఎంజి/డిఎల్‌ వరకు మించకూడదు. బ్లడ్‌ కొలెస్టరాల్‌ 200 నుండి 240 ఎంజి/డిఎల్‌ వరకు మించకూ డదు. బ్లడ్‌ షుగర్‌ దీర్ఘకాలం పాటు అదుపులో ఉంచుకోన ట్టయితే కంటి చూపు దెబ్బతింటుంది. అంతేకాక గుండె జబ్బు లు సైతం వచ్చే ప్రమా దం ఉంది. దీంతో పాటు మూత్ర పిండా లు సైతం చెడిపోతాయి.

శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. మన ఎత్తు మన బరువుకు అనుగుణంగా ఉండాలి. మెంతి పొడి బ్లడ్‌షుగర్‌, బ్లడ్‌ కొలెస్టరాల్‌ను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. రోజుకు 25 గ్రాముల మెంతులు అనగా 121/2 గ్రాములు, మధ్యాహ్నం భోజనానికి ముందు, మళ్ళీ 121/2 గ్రాములు, రాత్రి భోజనానికి ముందు నీళ్ళతోగాని, మజ్జిగతో కాని వాడాలి. మెంతులపొడి తీసుకున్న 15-20 నిమిషాల అనంతరం భోజనం చేయాలి. ఇది చక్కెర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది.

నిర్ణీత సమయాల్లో భోజనం చేయడం ఎంతో మంచిది. క్రమబద్ధంగా వైద్యుని సలహాలు పాటించాలి. వైద్యుని సూచనల మేరకు మందులు వాడుతూ ఉండాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. ప్రతిరోజూ వ్యాయామం 30-60 నిమిషాల వరకు చేయాలి. నడవడం, జాగింగ్‌, బైసైక్లింగ్‌, బాడ్మింటన్‌, షటిల్‌కాక్‌ ఆడడం, ఈత కొట్టడం చేయాలి. యోగాసనాలు అనగా యోగముద్ర, ధనురాసనం, పశ్చిమోత్తాసనం, కోనాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం, శవాసనం, భుజంగాసనం, పద్మాసనం, చక్రాసనం, శలభాసనం, వజ్రాసనం, ప్రాణాయామం ప్రతి రోజూ తప్పక చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే మంచి ఆహార అలవాట్లు పాటించాలి. తీయని పదార్ధాలు, తియ్యని పిండి పదార్థాలు, తియ్యని పానీయాలు, మద్యం సేవించడం, తియ్యటి పండ్లు, వేపుడు వంటకాలు తదితరాలను చాలా వరకు తగ్గించాలి. అలాగే పాలు, పాలతో చేసిన వంటకాలు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, మరమురాలు, గోధుమలు, సేమియా వంటివి వాడాలి. అలాగే పప్పుధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, పోపు పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్‌ వంటి పండ్లు మధుమేహాన్ని నియం త్రణలో ఉంచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయి.

ఎ.వి.రామకృష్ణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.