మహిళలను బాధించే ఆస్టియోపొరొసిస్‌

ఇదీ ‘అవాండియా’ కథ
October 11, 2010
ఆరోగ్య రక్షణలో అయోడిన్‌
October 18, 2010

మహిళలను బాధించే ఆస్టియోపొరొసిస్‌

ఆస్టియోపొరొసిస్‌ అంటే ఎముకల్లోని ప్రోటీన్‌, మూలాధాతువైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌ వంటివి (హైడ్రాక్సీ అపటైట్‌) లోపించడం. ఆహార పదార్థాలు, మందుల ద్వారా కాల్షియం, ఇతర పోషకాలు విటమిన్‌- డి3, డి4 సహకారంతో ఎముకల్లోని చేరడాన్ని ‘ఆస్టియో బ్లాస్టిక్‌ ప్రక్రియ’ అంటాం. అలాగే ఎముకలో పాతబడిన కాల్షియం, ఇతర పోషకాలు బయటకు వెళ్లడాన్ని ఆస్టియో క్లాస్టిక్‌ ప్రక్రియ అంటాం. వీటి మధ్య ఏర్పడే అసమతుల్యత వల్ల ఎముక బలహీనపడడాన్ని ఆస్టియోపోరొసిస్‌ అంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆర్రైటీస్‌, స్పైన్‌ సమస్యలు, డిస్క్‌ సమస్యలు, ఎముకల నొప్పులు, ఫ్రాక్చర్‌ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా స్త్రీలలో రుతుచక్ర అంత్యదశలో (మెనోపాజ్‌) ఈస్ట్రోజెన్‌ హర్మోను తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. సహజంగా స్త్రీలలో 45 నుండి 45 ఏళ్లు, పురుషుల్లో 55 ఏళ్లుపైబడిన ఆస్టియోపొరోసిస్‌ వచ్చే అవకాశముంటుంది.

నిర్ధారణ : ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు, ఎముకల బలసాంధ్రత పరీక్షల ద్వారా ఆస్టియోపొరొసిస్‌ను నిర్ధారించొచ్చు.

నివారణ : ఆహారంలో అధికంగా ప్రోటీన్లు కలిగిన పదార్థాలు తీసుకోవాలి. అధిక కాల్షియం కలిగిన ఆహారపదార్ధాలు తీసుకోవాలి.

శాఖాహారం : రాగులు, సజ్జలు మొలకెత్తించినవి తినడం, పాలు, స్కిమ్డ్‌ పాల పౌడర్‌వాడడం, ఖర్జూరం, బొప్పాయి, కాయగూరలు అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం పెరుగుతుంది.

మాంసాహారం : చేపలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. కోడిగుడ్డులో 150 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల చికెన్‌లో 150 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల మటన్లఓ 200 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల చేపలు, రొయ్యల్లో 1000 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుంది. సరైన ఆహారంతోపాటు క్రమ పద్ధతిలో వ్యాయామం, నడక, యోగా వంటి అలవాట్లతో ఎముకలలో అధికంగా కాల్షియం గ్రహించబడుతుంది. జీర్ణప్రక్రియ కూడా పెంపొందింపబడుతుంది.

మందులు : కాల్షియం ఫాస్పేట్‌, కార్బొనేట్‌, సిట్రేట్‌, మలేట్‌, ఫక్టోబోరేట్‌, విటమిన్‌-డి3, డి4, విటమిన్‌ కె7 వంటి ఆస్టియోబ్లాస్టిక్‌ ప్రక్రియను పెంపొందించి ఎముకను బలపరుస్తాయి.

అలెండ్రోనేట్‌ – 70 మిల్లీగ్రాములు వారానికికోసారి ఉదయం (20 వారాలు)

ఎటిడ్రోనేట్‌- 150 మిల్లీగ్రాములు రోజుకోసారి ( 3 నెలలు)

రైసిడ్రోనేట్‌ – 35 మిల్లీగ్రాముల ఉదయం ( వారానికోసారి)

ఇబాండ్రోనేట్‌ – 70 మిల్లీగ్రాములు నెలకోసారి

జెలెడ్రోనిక్‌ – ఏడాదికోసారి ఐవి పద్ధతిలో తీసుకోవాలి.

ఈ మందులు ఎముకల్లోని కాల్షియంను బయటకు విసర్జింపబడే ఆస్టియోక్లాస్టిక్‌ ప్రక్రియను తగ్గిస్తాయి. వయో వృద్ధులలో (జిరియాట్రిక్‌ గ్రూపు) ఎక్కువగా కనిపించి ఈ జబ్బును చాలా నివారణాత్మకంగా వైద్యం చేయాలి. వృద్ధులై, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని కుటుంబ సభ్యులు అత్యంత ప్రేమగా ఆదరణ చూపి వారి పోషకాహారం అవసరాలు, మందుల అవసరాలు నెరవేర్చడం ప్రతీ కొడుకు, కూతురు, ప్రభుత్వ సామాజిక బాధ్యత. గణేష్‌ నిమజ్జనాలకు, తిరుపతి హుండీ మొక్కులకు, రకరకాల తీర్థయాత్రలకు, పీర్లపండగలకు, వివిధ రకాల పెళ్లీలకు, ఆర్భాటాలకు, పుట్టినరోజు పండుగలకు, సాలీనా భారత దేశంలో కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. వృద్ధాప్యంలో ఎన్నో బాధలననుభవిస్తున్న వృద్ధులకు ప్రపంచ ఆర్రైటీస్‌, స్పైన్‌, ఆస్టియోపోరొసిస్‌ దినాలను పురస్కరించుకుని జిరియాట్రిక్‌ క్లబ్స్‌ ఏర్పరచి ఈ వ్యాధుల అవగాహన నివారణ, ఉపశమన చర్యలకు ఎంతో కొంత వితరణ ప్రకటిస్తే మంచిది.

(అక్టోబర్‌ 20 ప్రపంచ ఆస్టియోపోరొసిస్‌ దినం)

(మూలం – ప్రజాశక్తి, 11 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.