సర్వైకల్‌ స్పాండిలోసిస్‌
November 16, 2010
హైపర్‌టెన్షన్‌తో బహుపరాక్‌
November 22, 2010

మహిళల్లో పిసిఒడి సమస్య

నేడు మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌(పిసిఒడి) ఒకటి. ఈ వ్యాధితో బాధపడుతున్న స్ర్తీలకు పీరియడ్స్‌ సరిగా రాకపోవడం, బరువు బాగా పెరిగి లావు కావడం, శరీరంలోని వివిధ భాగాల్లో అనవసర వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి మందులు వాడి జీవన విధానాన్ని మార్చుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.

15నుంచి 30 సంవత్సరాల వయస్సులోపు మహిళలు పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లోని మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించగా నేడు మనదేశంలోని స్ర్తీలలో ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం విచారకరం.

నేడు ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నా రు. మహిళల జీవన విధానం సరిగ్గా లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి వారిలో హార్మోన్ల సమ తుల్యత లోపిస్తుంది. దీనితో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్థులు పొట్ట, నడుము, కింది భాగంలో ఎక్కువ లావుగా ఉంటారు. ఛాతి, భుజాలు, కాళ్లు సన్నగానే ఉంటాయి. వీళ్లు బ రువు తగ్గడానికి చాలా ఇబ్బంది పడుతారు. వ్యాయామాలు చేస్తే బరువు తగ్గినా మాని వేయగానే వెంటనే పెరిగిపోతారు.

జాగ్రత్తలు

పాలిసిస్టిక్‌ ఓవరీన్‌ డిసీజ్‌ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు వ్యాయామం తప్ప నిసరిగా చేయాలి. వాకింగ్‌, రన్నింగ్‌, యోగా, ఏరోబిక్స్‌ చేయాలి. తీసు కునే ఆహారం విషయంలో ఎంతో శ్రద్ద వహించాలి. ఆహారంలో ప్రోటీ న్లు, విటమిన్లు అవసరమైన మేరకు ఉండేటట్టు చూసుకోవాలి.

లక్షణాలు

ఈ వ్యాధిగ్రస్థుల్లో పీరియడ్లు సక్రమంగా రావు. ఆలస్యంగా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్లీడింగ్‌ తక్కువ కావడం, ఎక్కువ కావడం జరుగుతుంది. అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల బ్లీడింగ్‌ ప్రా రంభమవుతుంది. ఓవరీస్‌ సైజు పెరిగి వాటిలో నీటి బుడగల మాదిరి గా ఏర్పడతాయి. ఓవరీస్‌ పొర మందంగా మారుతుంది. హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది.

ఇటువంటి మహిళల్లో ఆండ్రోజన్‌ హార్మోన్‌ (మేల్‌ హార్మోన్‌) ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పీరియడ్స్‌ సరిగా రాక వారు ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడతారు. పిల్లల పుట్టడానికి వారిలో అడ్డంకులు ఎదురవుతాయి. అధిక బరువు వల్ల ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడుతుంది. దీంతో వారికి మధుమేహ వ్యాధి కూడా వస్తుంది.యువతుల్లో కూడా షుగర్‌ రావచ్చు. శరీరంలో కొస్ట్రాల్‌ పెరుగుతుంది. బిపి, హైపర్‌ టెన్షన్‌ సమస్యలు రావచ్చు. శరీర భాగాల్లో అనవ సర వెంట్రుకలు పెరుగుతాయి. పెదవి పైన, చుబుకం, చేతులు, కాళ్లు, ఛాతి, పొట్టపైన వెంట్రుకలు వస్తాయి.

తలవెంట్రుకలు కూడా ఊడి బట్టతల కూడా రావచ్చు. ముఖం మీద మొటిమలు రావడం, ముఖమంతా ఆయిల్‌గా అవుతుంది. ఛాతిపైన, పొట్టపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. సరిగాలేని పీరియడ్స్‌ వల్ల గర్భధారణలో అడ్డంకులు ఎదురవు తాయి. అధిక బరువు వల్ల అబార్షన్‌ కూడా కావచ్చు. ఇటువంటి మహిళలకు డెలివరీ అయి తే పుట్టే శిశువు అవయవాల్లో లోపాలు కూడా ఉంటాయి.

పరీక్షలు

పేషెంట్‌ గురించి ముందుగా తెలుసుకోవాలి. వారి బహిష్టు సక్రమంగా కలుగు తుందా, బరువు బాగా పెరిగారా వంటివి తెలుసుకోవడం జరుగుతుంది. వీరికి గుండె సమస్యలు, షుగర్‌, బిపి చెక్‌ చేస్తారు. వీరికి నిర్విహంచిన పరీక్షల్లో ఎల్‌ెహచ్‌ హార్మోన్లు ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా హార్మోన్లు తక్కువగా కనిపి స్తాయి. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో ఓవరీస్‌లో నీటి బుడగల మాదిరిగా అగు పడతా యి. ఇటువంటి వారికి మందులతో వైద్యం చేస్తారు. కానీ అవరమైన కొందరి సర్జరీ కూడా చేస్తారు.

మందులతో బరువు తగ్గేటట్టు చూస్తారు. పీరియడ్స్‌ సక్రమంగా వచ్చేలా వైద్యం చేస్తారు. వారిని ప్రతిరోజు వ్యాయామం చేయమని చెప్పి డైట్‌ మేనేజ్‌ మెంట్‌ సూచిస్తారు. ఒకవేళ వారు ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకుంటే వారిలో అండాలు విడుదలయ్యేందుకు ఇంజెక్షన్లు ఇస్తారు. సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌లో లాప్రోస్కోపిక్‌ చేస్తారు. ఓవరీన్‌లోని నీటి బుడగలను నీడిల్స్‌తో పొడిచి వాటిని తొలగిస్తారు. దీంతో వారిలో హార్మోన్లు సక్రమంగా విడుదల వుతాయి. అండం సక్రమంగా విడుదలై వారికి పీరియడ్లు సరిగ్గా వస్తాయి.

డాక్టర్‌ దివి పద్మావతి
గైనకాలజిస్ట్‌
గాయత్రి నర్సింగ్‌ హోం
రాజీవ్‌ నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
ఫోన్‌ నెం : 9848416929,
040-23840618

 

1 Comment

  1. bindu says:

    NamasteMADAM ,
    I am (age 19 years) suffering from pcod problem .i used to get periods for every 3 months.long back I am medicined (glycomet gp 2 , deivry) .., but still there is the problem. kindly let me know how to start the treatment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.