మహిళల్లో సంతానలేమికి చికిత్సలు

మహిళల్లో సంతాన లేమి.. కారణాలు
May 31, 2011
మూర్ఛ వ్యాధి – వైద్యం
June 1, 2011

మహిళల్లో సంతానలేమికి చికిత్సలు

మహిళల్లో సంతానలేమి ఉందని నిర్ధారణ అయినప్పుడు అందుకు చేసే చికిత్స వివిధ రకాలుగా ఉంటుంది.

– మొదట ఆ జంటకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరువాత జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులను గురించి వివరిస్తారు.

– పోషకాహారం ఆవశ్యకతను వివరించడంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాల్సిందిగా సూచిస్తారు.

– ఆ తరువాత సైకోసెక్సువల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు.

– అవసరాన్ని బట్టి ఎండోమెట్రియోసిస్‌, ఫైబ్రాయిడ్స్‌ (గర్భాశయ కంతులు) లాంటి పరీక్షలు చేస్తారు.

– థైరాయిడ్‌ సమస్యలు, హైపర్‌ప్రొలాక్టినేమియా, పీసీఓఎస్‌ లాంటి ఎండోక్రినికల్‌ సమస్యలకు చికిత్స చేస్తారు.

– ఒవులేషన్‌ ఇండక్షన్‌ (ఒక రుతుచక్రంలో పలు అండాలు విడుదల అయ్యేందుకు దోహదం చేసే ఔషధాల వినియోగం), సరైన సమయంలో దంపతులు కలుసుకోవడంపై సూచనలు

– ఒవులేషన్‌ ఇండక్షన్‌ అనంతరం ఐయూఐ (కృత్రిమంగా వీర్య కణాలను రిప్రొడక్టివ్‌ ట్రాక్ట్‌లోకి ప్రవేశపెట్టడం) ప్రక్రియ చేపట్టడం

– కంట్రోల్డ్‌ ఓవరియన్‌ హైపర్‌స్టిమ్యులేషన్‌, అనంతరం ఐవీఎఫ్

– కంట్రోల్డ్‌ ఓవరియన్‌ హైపర్‌స్టిమ్యులేషన్‌, అనంతరం ఐవీఎఫ్‌ – ఐసీఎస్‌ఐ

– ఇన్విట్రో మెచ్యురేషన్‌ (ఐవీఎం)- డ్రగ్‌ ఫ్రీ ఐవీఎం

– లేజర్‌ అసిస్టెడ్‌ హేచింగ్‌

– ఊసైట్‌ విట్రిఫికేషన్‌

– ఎంబ్రోయొ విట్రిఫికేషన్‌

జీవన శైలిలో మార్పులు

రిక్రియేషనల్‌ డ్రగ్స్‌, మానసిక ఒత్తిళ్ళు, స్థూలకాయం, ధూమపానం, ఆల్కహాల్‌, కెఫైన్‌, ఆహారం, వ్యాయామం, విటమిన్లు, వృత్తి ఉద్యో గాలు లాంటి పలు అంశాలు జీవనశైలి పరిధిలోకి వస్తాయి. ఇందుకు సంబంధించి దంపతులు చేసుకోవాల్సిన మార్పులను వైద్యులు సూచి స్తారు. గర్భధారణ సంబంధిత అంశాలపై వారిలో గల అపోహలను తొలగిస్తారు. సహజ, కృత్రిమ గర్భధారణ రెండింటిలోనూ జీవనశైలి ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. వైద్యులు సూచించిన విధంగా దంపతులు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సంతానం పొందే అవకాశాలను వృద్ధి చేసుకోగలుగుతారు.

ఒవులేషన్‌ ఇండక్షన్‌ విత్‌ టైమ్డ్‌ ఇంటర్‌కోర్స్‌

సంతానలేమికి చికిత్స అందించడంలో చేపట్టే తొలి ప్రక్రియ ఇది. ఇందులో మహిళలకు మొదట అండాల వృద్ధికి గాను కొన్ని మదు లతో చికిత్స చేస్తారు. అవసరాన్ని బట్టి వరుసగా అల్ట్రాసౌండ్‌ స్కాన్స్‌ చేస్తారు. అండం వృద్ధిని గమనిస్తారు. అండం పరిపక్వ దశకు చేరుకున్న తరువాత దంపతులను కలుసుకోవాల్సిందిగా సూచిస్తారు. ఫెర్టయిల్‌ పీరియడ్‌లో మార్పులు ఉన్న వారికి, ఒవు లేషన్‌ సమస్యలు ఉన్న వారికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది.

ఒవులేషన్‌ ఇండక్షన్‌ అనంతరం ఐయూఐ

ఐయూఐ (ఇంట్రా యుటెరిన్‌ ఇన్‌సెమినేషన్‌) లేదా ఆర్టిఫిషియల్‌ ఇన్‌సెమినేషన్‌లో భర్త వీర్యకణాలను ప్లాస్టిక్‌ కెథటెర్‌ను ఉపయోగించి నేరుగా గర్భాశయం లేదా సెర్విక్స్‌లోకి ప్రవేశపెడుతారు. పాటెంట్‌ ఫా లోపియన్‌ ట్యూబ్స్‌ సమస్యతో బాధపడే మహిళలకు సంతానాన్ని కలి గించడంతో తక్కువ వ్యయంతో పూర్తయ్యే చికిత్స ఇది.

ఈ విధమైన చికిత్స చేసేందుకు ఈ చికిత్స ఆ దంపతులకు పనికొ స్తుందో లేదో నిర్ధారించుకునేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. మహిళ లకు ఎఫ్‌ఎస్‌హెచ్‌ (ఫోలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌), ఎల్‌ హెచ్‌ (ల్యుటినైజింగ్‌ హార్మోన్‌), ఈస్ట్రాడియెల్‌, థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ వంటి హార్మోనల్‌ బ్లడ్‌టెస్ట్‌లు, పీరియడ్స్‌ రెండో రోజున ప్రొలాక్టిన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఫాలోపియన్‌ ట్యూబ్‌లు తెరుచుకుని ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు హిస్టెరొసాల్పిం గోగ్రామ్‌ లేదా లాప్రోస్కోపిక్‌ ట్యూబల్‌ డై స్టడీ చేస్తారు. భర్తకు బేసిక్‌ సెమన్‌ అనా లిసిస్‌ (వీర్యకణాల విశ్లేషణ) పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ఫలితం ఆధారంగా అవసరమైతే సెమెన్‌ ఫంక్షనల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు.

వీటితో పాటుగా దంపతులిద్దరికీ బ్లడ్‌గ్రూపింగ్‌, హెపటైటిస్‌ బి, సి, ఎస్టీడీ సంబంధిత రక్తపరీక్షలు నిర్వహిస్తారు.

ఐయూఐ చేసేందుకు పలు రకాల కారణాలుంటాయి. భర్త స్పెర్మ్‌ కౌంట్‌, మొటిలిటీ లేదా ఆకారం తగు విధంగా లేనప్పుడు ఈ విధానం ఉపయోగపడుతుంది. అండంతో వీర్యకణాలు కలిసేందుకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుంది.

కంట్రోల్డ్‌ హైపర్‌ స్టిమ్యులేషన్‌ తదనంతర ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌): ఇందులో ఒకే రుతుచక్రంలో సాధారణం కంటే అధిక సంఖ్యలో అండాలు విడుదలయ్యేలా చేస్తారు. విట్రో ఫెర్టిలైజేషన్‌లో భాగంగా కూ డా ఇలా చేస్తారు. రుతుస్రావం ఆరంభమైన మూడో రోజు నుంచి చికి త్స ఆరంభమవుతుంది. అవసరమైన సందర్భాల్లో టూ డైమెన్షనల్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు. వివిధ దశల్లో వైద్యుల నియంత్రణ ఉంటుంది.

ఐవీఎఫ్‌: శరీరం వెలుపల అండాలు వీర్యకణాలతో ఫలదీకరణం చెందడాన్ని ఐవీఎఫ్‌ గా వ్యవహరిస్తారు. సంతాన లేమి చికిత్సలో దీన్ని మేజర్‌ ట్రీట్‌మెంట్‌గా పేర్కొంటారు.

అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ విధానాలు విఫలమైన సందర్భాల్లో ఈ ప్రక్రియను అనుసరిస్తారు. ఈ ప్రక్రియలో ఒవులేషన్‌ ప్రక్రియను హార్మోన్ల ద్వారా నియంత్రించడం, అండాశయాల నుంచి అండాలు తీసి ఫ్లూయిడ్‌ మీడియంలో వీర్యకణాలచే ఫలదీకరింపజేయడం ఉంటాయి. ఫలదీకరణం చెందిన అండాన్ని (సంయుక్త బీజం) మహిళ గర్భంలో ప్రవేశపెడుతారు. విట్రో అంటే లాటిన్‌ భాషలో గాజు అని అర్థం. ఈ ప్రక్రియను చేపట్టిన తొలిదశలో ఈ ప్రయో గాలు గాజు బీకర్లు, టెస్ట్‌ట్యూబ్‌లలో జరిగేవి. నేడు విట్రో అనే పదాన్ని శరీర కణజాలం వెలుపల జరిగే అన్ని ప్రక్రియలకు ఉపయోగిస్తున్నారు. నేడు విట్రో ఫెర్టిలైజేషన్‌ను శాలోవర్‌ కంటె యినర్‌లలో చేస్తున్నారు. ఆటోలొగొస్‌ ఎండోమెటీరియల్‌ కోకల్చర్‌ అనే ప్రక్రియను ఆర్గానిక్‌ మెటీరియల్‌తో చేసినప్పటికీ దాన్ని కూడా విట్రోగానే పరిగణిస్తున్నారు.

డాక్టర్‌ దుర్గ రావు
మెడికల్‌ డైరెక్టర్‌
ఒయాసిస్‌ సెంటర్‌ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌
రోడ్‌ నెం.2, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌
ఫోన్‌ నెం. 040-2355 1119,
040-4241 777

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.