సంతానలేమితో బాధపడే 45శాతం జంటల్లో లోపం ప్రధానంగా మహిళ ల్లో కానవస్తుంది.వారిలో సంతానలేమికి గల కారణాల్లో ప్రధ నమైనవి:ఖీ బీజవాహికలు దెబ్బతినడం ఖీ రుతుచక్ర సమస్యలు.ఎండోమెట్రియాసిస్: గర్భాశయ కణాల్లాంటివి గర్భాశయంలో గాకుండా దాని వెలుపల అసాధారణ రీతిలో వృద్ధి చెందే పరిస్థితిని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా గర్భాశయం లోపలి కణాలు ప్రతీనెల రుతుస్రావంలో బయటపడుతాయి.వెలుపల ఉండే కణాలు మాత్రం కణజాలా నికి అతుక్కొని ఉంటాయి. అండాశయం పైన, బీజవాహికల వద్ద, గర్భాశయం లేదా పేగు వెలుపలి భాగాల వద్ద ఇవి ఉంటాయి.
సమీపంలోని పలు ఇతర భా గాల వద్ద కూడా ఇవి ఉండే అవకాశం ఉంది. వజీనా, సెర్విక్స్, బ్లాడర్ పైభాగా ల్లో కూడా ఉండే వీలుంది. ఇవి క్యాన్సర్ కారకాలు కానప్పటికీ ఇతరత్రా సమ స్యలను కలిగిస్తాయి. ఈ సమస్య ఉన్న వారు ప్రత్యేకంగా ఎలాంటి లక్షణాలను బయటకు ప్రదర్శించరు. అమెరికన్ మహిళల్లో 3-18 శాతం మంది ఈ సమ స్యతో బాధపడుతున్నట్లు అంచనా. సంతానలేమికి చికిత్స పొందేవారిలో 20- 50 శాతం దాకా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. సాధారణంగా 25 -35 ఏళ్ళ వయస్సులో మహిళలు ఈ సమస్యను నిర్ధారించుకోగలుగుతున్నా రు. 11 ఏళ్ళ వయస్సులోనే బాలికల్లో ఈ సమస్యను గుర్తించిన దాఖలాలూ ఉన్నాయి.
ఆఫ్రికా, ఆసియా మహిళతో పోలిస్తే శ్వేతజాతీయుల్లో ఈ సమస్య మరింత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. పొడవుగా, సన్నగా, పొడవుకు తగ్గ బ రువు ఉండని వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని కూడా అధ్యయనా ల్లో వెల్లడైంది. ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుందో ఇప్పటి వరకూ స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. ఫిజికల్ ఎగ్జామినేషన్, కొన్ని భాగాల్లో ఏర్పడే నొప్పి లాంటి వాటితో ఈ సమస్యను గుర్తించవచ్చు. లాప్రోస్కో పీతో దీన్ని నిర్ధారించు కోవచ్చు.
గర్భాశయాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు:
ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలోపల, వెలుపల పెరిగే, క్యాన్సర్ కారకం కాని ఒక విధమైన కంతుల్లాంటివి) లాంటివి.
ఇతరత్రా రకరకాల కారణాల సమ్మేళనం వల్ల.
స్పష్టమైన కారణం లేకుండా..
రుతుచక్ర సంబంధిత సమస్యలు: మహిళల సంతానలేమికి సంబంధించిన సమస్యల్లో 20 శాతం దాకా పైన పేర్కొన్న కార ణాల వల్ల కలిగేవే. రుతుచక్రం కానరాకపోవడానికి పలు కార ణాలుంటాయి. అనేక క్షణాలు ఈ సందర్భంగా బయటపడు తుంటాయి. ఈ కారణాల్లో కొన్నింటిని మందులతో, మరికొ న్నింటిని జీవనశైలిలో మార్పులతో చక్కబర్చుకోవచ్చు. మరికొ న్ని సమస్యలను మాత్రం సరిదిద్దుకోలేం. ఇలాంటి సందర్భాల్లో ఎగ్ డోనార్ సాయంతో గర్భధారణకు ప్రయత్నించవచ్చు.
నయం చేయదగ్గ సమస్యలు:
హైపొథాల్మిక్ అన్‌ఒవ్యులేషన్: వ్యాయామం, ఒత్తిళ్ళు, బరువు తగ్గడంలాంటి వాటి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
హైపర్‌ప్రొల్టానేమియా: పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే ప్రొలాక్టిన్ స్థాయి అధికం కావడం
పోలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్): మహిళ రుతుచక్రాన్ని, పిల్లలనుకనే శక్తిని, హార్మోన్లను, గుండెను, రక్త నాళాలను ప్రభావితం చేసే సమస్య ఇది.ఈ సమస్య ఉన్న వారి లో ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్స్ అని కూడా అంటారు) స్థాయి లు అధికంగా ఉంటాయి. ఇవి అధికంగా ఉండడం అండాల అభివృద్ధిని, విడుదలను దెబ్బ తీస్తుంది. రుతుచక్రం క్రమబద్ధం గా ఉండదు.అండాశయాల్లో ద్రవంతో నిండిన కంతుల్లాంటివి ఉంటాయి. ప్రతీ పదిమంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ఈ సమస్యకు ప్రధాన కారణమేం టో నేటికి అంతుచిక్కలేదు. జన్యువులే కారణమని కొందరి భా వన. ఓ మహిళ ఈ సమస్యతో బాధ పడుతుంటే, ఆమె తల్లి లే దా సోదరికి కూడా ఈ సమస్య ఉండి ఉంటుందని మరికొందరు నిపుణుల భావన. ఈ సమస్యకు ప్రధాన కారణం హార్మోన్ల అస మతుల్యతగా గుర్తించారు.
హార్మోన్ సంబంధిత సమస్యలు: పిట్యూటరీ గ్లాండ్ లేదా హైపొథాలమస్ (మెదడులోని ఓ భాగం) పనితీరు సరిగా లేక పరిపక్వ అండాల ఉత్పత్తిలో వైఫల్యం.
స్కార్డ్ ఓవరీస్: సర్జరీలు లేదా రేడియేషన్ చికిత్స సందర్భాల్లో అండాశ యానికి వాటిల్లే నష్టం
ప్రిమెచ్యూర్ మోనోపాజ్: 40ఏళ్ళ కంటే ముందుగానే రుతుచక్రం ఆగి పోవడం
ఫోలిసియెల్ సమస్యలు: అండం ఉత్పత్తి అయ్యే చిన్న కుహరంలో అండం ఉత్పత్తి అయినప్పటికీ బయటకు రాకపోవడం లాంటి సమస్యలు.
బీజవాహికలు సరిగా పని చేయకపోవడం: మహిళల సంతానలేమి సమస్యల్లో 20 శాతం దాకా దీని పరిధిలోకే వస్తాయి.
1. క్షయ వంటి ఇన్‌ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్‌టిడి) లాంటి హైడ్రోసాల్పిన్‌ఎక్స్ (బీజవాహిక మూసుకుపోవడం, లోపల ద్రవం నిండిపోవడం), ట్యూబో-ఓవేరియన్ మాసెస్‌కు కారణమవుతాయి.
2. పొత్తి కడుపు వ్యాధులు: అపెండిసైటిస్, కొలిటిస్ (పేగువాపు లాంటిది) లాంటివి పొత్తికడుపు కేవిటీని ఉబ్బిపోయేలా చేస్తాయి. ఇది బీజవాహికలపై ప్ర భావాన్ని కనబరుస్తుంది. అవి మూసుకుపోయే అవకాశం ఉంటుంది.
3. గతంలో జరిగిన సర్జరీలు: తొడ, పొత్తి కడుపు భాగంలో గతంలో ఎ ప్పుడైనా, ఏవైనా సర్జరీలు జరిగి బీజవాహికలు మూసుకుపోయి, అండాలు వా టి గుండా ప్రయాణించలేక పోవడం.
4. ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ: పిండం గర్భాశయంలో గాకుండా గర్భాశయం వెలు పల బీజవాహికలోనే పెరగడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నన్సీగా వ్యవహరిస్తారు. దీని వల్ల బీజవాహికలు దెబ్బ తినడమే గాకుండా తల్లికి ప్రాణాపాయం కూడా.
5. కాంజెనిటల్ లోపాలు: కొన్ని సందర్భాల్లో పుట్టుకతోనే కొందరికి బీజవాహిక సంబంధిత లోపాలు ఉంటాయి.
సాల్‌పింగింటిస్: బీజవాహికలు వాయడం అనేది లోపలి నుంచి (గర్భాశ యం వైపు నుంచి) కూడా జరగవచ్చు. గనేరియా, క్లామైడియా లాంటి లైంగిక సంక్రమణ వ్యాధుల (ఎస్‌టీడీ) సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది. బీజవాహిక వెలుపలి వైపు నుంచి అపెండిక్స్ లాంటి వాటి ద్వారా కూడా బీజవాహిక వాయ డానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బీజవాహికలు దెబ్బ తిం టాయి. వాహికపై దెబ్బతిన్న రెండు ఉపరితలాలు కలసిపోవడం వల్ల బీజ వాిహ క దెబ్బ తింటుంది. ఈ విధంగా అంటుకుపోవడం అనేది పెల్విక్ సర్జరీ అనం తరం లేదా ఎండోమెట్రియాసిస్‌ల కారణంగా కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి అతుకులు రకరకాలుగా నష్టం కలిగిస్తాయి.నూతన కణ జా లం ద్వారా అండాశయాన్ని బీజవాహిక నుంచి వేరు చేస్తాయి లేదా వాహిక మ రోవైపు కొనను మూసివేస్తాయి. ఈ విధమైన అడ్డంకిని తొలగించేందుకు చాలా సందర్భాల్లో మైక్రోసర్జరీ తోడ్పడుతుంది.
హైడ్రోసాల్పిన్‌ఎక్స్, ప్యోసాల్పిన్‌ఎక్స్: హైడ్రోసాల్పిన్‌ఎక్స్ అనేది ఓ నిర్దిష్ట రకానికి చెందిన ట్యూబల్ బ్లాకేజ్ (బీజ వాహిక మూసుకు పోవడం) లాంటిది. అప్పుడిిది నీరులాంటి ద్రవంతో నిండి పోతుంది. కొన్ని సందర్భాల్లో ఐవిఎఫ్ చేసిన తరువాత, ప్రొజెెస్టెరాతన్ స్థాయి పెరగడం వల్ల ఈ ద్రవం గర్భాశయంలోకి ప్రవహిస్తుంది. అప్పుడది పిండాన్ని కూడా తుడిచి పెట్టేస్తుంది.కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ విఫలమయ్యేందుకు ఇదీ ఓ కారణమే.ప్యోసాల్పిన్‌ఎక్స్ అనేది బీజ వాహిక చీములాంటి పదార్థంతో నిండిపోవడం. యాంటీబయాటిక్స్ వాడడంద్వారా దీన్ని హైడ్రోసాల్పిన్ ఎక్స్ స్థాయికి చేర్చ వచ్చు. లేని పక్షంలో అపెం డిసైటిస్ తరహాలో ఇది లోప లే బద్దలైపోవచ్చు. అలాంటి సందర్భాల్లో దాన్ని తొలగిం చేందుకు ఆపరేషన్ అవస రం అవుతుంది.
గర్భాశయ, సెర్వికల్ సంబంధిత కారణాలు: మహిళల్లో సంతానలేమి సమస్యల్లో 5 శాతం ఈ కో వకు చెందినవే. గర్భాశ యంలో ఏర్పడే అడ్డుగోడ లులాంటివాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. పాథోలజీ – ఫైబ్రాయిడ్స్ (గర్భాశయ కంతులు), పోలిప్స్ (వెలుపలి మార్గాల వద్ద కణజాల అసాధారణవృద్ధి), అడెనొమయోసిస్ (గర్భాశయ వెలుపలి భాగంలో ఓ రకమైన కణజాల అసాధారణ వృద్ధి), అషెర్‌మాన్స్ సిండ్రోమ్ (కోత తదితరాల వల్ల గర్భాశయ కంఠమార్గం వద్ద ఏర్పడే అతుకులు, కంతులు మొదలైనవి) లాంటివి ఇందులోకి వస్తాయి.
సెర్వికల్ కారణాలు:
హార్మోన్ల అసమతుల్యత కారణంగా సెర్వికల్ స్రావాలు చిక్కగామారి వీర్యకణాలు ఈదుతూ బీజవాహికల్లోకి ప్రవేశించడాన్ని అడ్డుకుంటాయి.
పాథాలజీ – సెర్వికల్ ఫైబ్రాయిడ్స్ (కంతులు లాంటివి)
ఎండోమెట్రియాసిస్-సంతానలేమి: గర్భాశయంలో ఉండే కణాల్లాంటివి గర్భాశయం వెలుపల ప్రధానంగా అండాశయాన్ని, బీజవాహికలను అంటు కొ ని వృద్ధి చెందడాన్ని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తుంటారు. ఇది తక్కువ స్థాయిలో ఉన్న వారిలో క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధమైన కణాల వృద్ధి ఎక్కువగా ఉంటే మాత్రం ఐయూఐ (ఇంట్రా యుటెరి న్ ఇన్‌సెమినేషన్ – ఇతర స్రావాల నుంచి వేరు చేసిన వీర్యకణాలను నేరుగా గర్భాశయంలోకి చొప్పించడం) లేదా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ – మహి ళ శరీరం వెలుపల అండాన్ని, వీర్యకణాలను ఫలదీకరించడం) అవసరమ వుతుంది.
సంతానలేమితో బాధపడే జంటల్లో సుమారు 10 శాతం ఇలాంటి సమస్యలతో ఉంటారు. ఈ సమస్యతో బాధపడే మహిళల్లో గర్భధారణ అవకాశం 12-36 శాతం దాకా తగ్గుతుంది. రుతుస్రావం అధికంగా, బాధాకరంగా, దీర్ఘకాలం ఉండడాన్ని, అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్ళాల్సి రావడాన్ని, మద్వారం నుంచి రక్తస్రావం కావడాన్ని, బహిష్టు కావడానికి ముందే ఆ లక్షణాలు కనబడ డాన్ని ఈ సమస్య లక్షణాలుగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలేవీ బయటపడకపోవచ్చు. మెడికల్-హార్మోనల్ ట్రీట్‌మెంట్ లేదా సర్జికల్ – అబ్లేషన్ ద్వారా ఈ సమస్యను నయం చేయవచ్చు.
కారణాలు వివరించలేని సంతానలేమి – 25 శాతం
కొన్ని సందర్భాల్లో ఎన్ని రకాల వైద్యపరీక్షలు చేసినా ఆ జంటలో సంతానలేమికి సరైన కారణమేదో అంతుపట్టకపోవచ్చు. ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు చిత్స అందుబాటులో ఉంది.
ఇతరత్రా ముఖ్యకారణాలు:
వయస్సు – 35 ఏళ్ళు దాటిన తరువాత మహిళ గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి.
పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ – పీసీఓఎస్
గైనకాలాజికల్ సమస్యలు – గతంలో గర్భాశయం వెలుపల పిండం వృద్ధి చెందడం లేదా ఒకటికి మించిన అబార్షన్లు కావడం, లైంగిక సాంక్రమిక వ్యాధులు లాంటివి.
ఆరోగ్యస్థితిగతులు – మధుమేహం, మూర్ఛ, థైరాయిడ్, మలాశయ సంబంధ వ్యాధులు
జీవనశైలి- వివిధ రకాల ఒత్తిళ్ళు, స్థూలకాయం లేదా తక్కువ బరువు, ధూమపానం
గర్భాశయంలో కంతులు లాంటివి.
డాక్టర్ దుర్గ రావు
మెడికల్ డైరెక్టర్
ఒయాసిస్ సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ మెడిసిన్
రోడ్ నెం.2, బంజారాహిల్స్, హైదరాబాద్
ఫోన్ నెం. 040-2355 1119,
040-4241 777