కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే వ్యాయామాలు
October 25, 2010
అధిక బరువు… నష్టాలు
October 25, 2010

మీకు సూది పిచ్చి ఉందా?

జలుబుకు సూది, దగ్గుకు సూది, తలనొప్పికి సూది, కడుపు నొప్పికి సూది, విరేచనాలకు సూది, విరేచనాలు కాకున్నా సూది, పిల్లలు ఏడ్చినా సూది, పిల్లలు నవ్వినా సూది… కావాలంటున్నారు ప్రజలు. అసలు ఈ సూది పిచ్చిం ఏంటో తెలుసా…?

* ఇంజక్షను లేనిదే ఏ జబ్బుకు వైద్యం లేదన్నది నేటి సమాజ పోకడ.

* రోగులు కావాలంటున్నారు, కాబట్టి మేం వేస్తున్నామంటున్నారు డాక్టర్లు. డాక్టర్లు సూదులు వేస్తున్నారు కాబట్టే మేం వేయించుకుంటున్నామని అంటున్నారు ప్రజలు.

* ‘ఇప్పుడు మనం వేయించుకునే సూదుల్లో 90 శాతం అవసరం లేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.

* జబ్బు ఒకటే అయినా – పేదలు ఎక్కువ సూదులు వేయించుకుంటున్నారు ! ధనవంతులు తక్కువ సూదులు వేయించుకుంటున్నారు.

* ప్రజలలో ‘సూది పిచ్చి’ పెరగడానికి కారణం వైద్యం చేసే వారే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.

* సూదుల వల్ల గాయాలు, జబ్బులు, మరణాలు సంభవించొచ్చు.

* ‘సూది పిచ్చి’ మన దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లోనూ ఉంది.

* బడుగు దేశాల్లో, గ్రామాల్లో, మురికి వాడల్లోని ప్రజల్లో, పేదవారిలో సూది పిచ్చి ఎక్కువట !

* డాక్టర్లు సూది వేస్తానంటే – ఒక సారి వీలైతే సూది లేకుండా వైద్యం చేయాలని కోరాలి.

* సూది వేయని డాక్టరు అసమర్ధుడు అనుకోకూడదు.

* సూది పిచ్చికి గుడ్‌బై చెప్పండి. సూది ప్రమాదాల నుండి రక్షణ పొందండి.

మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

అనారోగ్య సమస్యలా …?

అయితే మాకు రాసి పంపండి. ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో సమాధానాలిప్పిస్తాం. ప్రశ్నలు పంపే వారు వయస్సు, బరువు, జబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరచాలి 

(మూలంప్రజాశక్తి, 25 అక్టోబర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.