నిద్ర అంటే రీఛార్జ్‌
January 3, 2011
ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు
January 3, 2011

వెన్నెముక సమస్యలు.. చికిత్స

సాధారణంగా ఉండే వెన్నెముక వెన్నుపాము 33 వెన్నుపూసలు, ఎముకగూడ ఖండరాలతో నిర్మించబడి ఉంటుంది.ఇవి ఒక దాని మరొకటి నిలువుగా పేర్చబడినట్లుంటాయి. వాటికి ఆధారంగా కండరాలు, అస్థిపంజరాలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య బిళ్లలు మెత్తగా ఉంటూ పనిచేస్తాయి. వెన్నుపూస పనేమిటంటే మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని కల్గించడమేకాకుండా వెన్నుపాములో ఉండే సున్నితమైన నరాలను కాపాడడం.ఇటువంటి వెన్నెముకలో పలు సమస్యలు ఎదురవుతాయి.
వెన్నుముక నాలుగు భాగాలుగా విభజించబడింది. మెడభాగం, ఛాతిభాగం, వీపులో కొద్దిభాగం, వెన్నుమూకలో క్రిందభాగం. వెనుకనుంచి నేరుగా వీపును చూసినపుడు వెన్నెముక నిలువగా భుజాలకు సమానంగానూ, తుంటెలు చదునుగానూ కనిపిస్తుంది. మోచేతులు, శరీరం మధ్యదూరం సమానంగా అగుపిస్తుంది. వెన్నె ముకకు లోపలి నుంచి చూస్తే భుజాలు, క్రింది భాగాలు సహజస్థిరమైన ఒంపులు కనిపిస్తాయి. వీపునుంచి చూడవచ్చును. భుజపత్రభాగాలు ప్రతి ప్రక్కవైపు అదే స్థాయిలో ముందుకు పొడుచుకుని ఉంటాయి. వెన్నెముక ప్రతి వైపున సౌష్టవయుతంగా కనిపిస్తాయి.
స్క్రీనింగ్‌విధానం
కూర్చున్నా లేదా నిలుచున్న స్థితిలో ఎగ్జామినర్‌ స్క్రీనింగ్‌ నిర్విహస్తారు.విద్యార్థి ఎక్కడ నిలుచుండాలో తెలిపేందుకు ఫ్లోర్‌పైన ఎగ్జామినర్‌ గుర్తును ఉంచుతారు. ఎగ్జామినర్‌ విద్యార్థి మధ్య 5 నుండి 8 అడుగుల దూరం సిఫార్సు చేస్తారు. విద్యార్థులు చొక్కాలను తొలగించితే తద్వారా స్క్రీనర్‌కు వారి శరీర పైభాగం చక్కగా కనిపిస్తుంది.
ఆడపిల్లలు బాతింగ్‌ సూట్‌ టాప్‌, స్పోర్ట్స్‌ బ్రా లేదా సరైనట్టి ఇతర క్లాతింగ్‌ ఐటమ్‌ను ధరించాలి. షార్ట్‌ ధరించే విద్యార్థులు కూడా వీపు, తుంటిభాగాలు, కాళ్లు చక్కగా అగుపించేట్లు ధరించాలి. ఈ మాన్యువల్‌లో వివరించిన చిత్రాలలో అండర్‌ వేర్‌ ధరించిన విద్యార్థిని చూడవచ్చును.లోదుస్తులు ధరించిన విద్యార్థులు స్క్రీన్‌ చేయబడరు.
స్క్రీనింగ్‌ కోసం కావాలసిన విధంగా విద్యార్థి దుస్తులు ధరించకపోతే సరైన క్లాతింగ్‌ ఏర్పాటు చేయకపోతే. అతను లేదా ఆమె స్క్రీనింగ్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవాలి. విద్యార్థి వీటితో ప్రారంభించబడతాడు.పాదాలు, మోకాళ్లు రెండూ పక్కపక్కన పెట్టి అతను లేదా ఆమె తమ చేతులను కూడా వదులుగా వేళ్లాడదీసి ఎగ్జామినర్‌ ఎదురుగా నిలబడాలి.
దిగువ వాటిని అనుసరించాలి.పరీక్షకు కావలసిన పొజిషన్స్‌లో విద్యార్థి నిలుచుని ఉండం విద్యార్థికి చాలా ముఖ్యం. తల తిప్పినట్లైతే, కనుగొనే అంశాలలో మార్పు వస్తుంది. విద్యార్థి వెనుక భాగం పూర్తిగా కనిపించేందుకు పొడవాటి జుట్టును ముందుకు వాల్చుకోవాలి.
తర్వాత స్థితి ఆదర్మ్స్‌ ఫార్వర్డ్‌ – బెండింగ్‌ టెస్ట్‌
పాదాలు, మోకాళ్ళు దగ్గర ఉంచి విద్యార్థి నిటారుగా నిలుచుని ఉండాలి రెండు చేతులు అరచేతులను కలుపుతూ నడుము అడ్డంగా వచ్చేంత వరకు వంగాలి.
వికృతంగా వెన్నెముక వక్రత
వెన్నెముక పరీక్ష రెండు ప్రధాన వెన్నెముక వైకల్యాలు కనుగొనేలా రూపొందించబడినది. రెండు రకాల వెన్నెముక వైకల్యాలు పార్శ్వగూని, గూనితనం.
పార్శ్వగూని
పార్శ్వగూని అంటూ వెన్నెముక 10 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ అసాధారణ రీతిలో పక్కకి వక్రత కలిగి ఉండటం. ఇది వెన్నుపూస ను ఒక పక్క నుంచి మరో పక్కకి కదిలేలా చేస్తుంది. ఎస్‌ ఆకారపు వంపు వెనుకనుంచి కనిపిస్తుంది. కొన్ని సంర్భాలో తక్కువ సమయంలోనే ముదిరిపోతుంది. దాని ఫలితంగా కనిపించకపోవడం, తరచు వెన్నుపోటు రావడం వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయి. బాగా ముదిరిన సంద ర్భాలలో గుండె, ఊపిరి తిత్తుల పనికి అవరోధం కలుగుతుంది. పార్వ్శ గూని నిర్మాణాత్మక మైనవి, నిర్వాహకమైనవిగా విభజించబడతాయి.
వంపుల పార్శ్వగూని
వంపులున్న కారణంగా స్థిరకంగా అతుక్కుపోయిన వెన్నుపూసలోని నిర్మాణాలలో మార్పులు వస్తాయి. నిర్మాణాత్మక వంపులు వాటి కలిపి వున్న వెన్నెముకకు సంబంధించిన మెలి ద్వారా నిర్వాహక వంపులనుంచి వేరు చేయవచ్చును. విద్యార్థులు ముందుకు వంగినప్పుడు మెలిపడిన ఫలితాలు పక్కటెముక గదుల్లో ఒకవైపు మూపురంలో కనిపిస్తాయి. భంగిమలో తేడావుంటే ఈ వంపులను తిన్నగా నిలబడటానికి అధ్యయనం ద్వారా తెలుసుకోలేం.
నిర్వాహక పార్శ్వగూని
ఈ రకపు పార్శ్వగూని వెన్నెముక ఆకారంలోగానీ లేదా నిర్మాణంలోగానీ శాశ్వత మార్పులు ఉండవు. నిర్వాహక పార్శ్వగూని సాధారణంగా తుంటిలో మరో వైకల్యతకు రెండవది వృద్ధిచేయవచ్చును. లేదా తీవ్రత కొద్దిగా ఉండవచ్చును. నిర్వాహక పార్శ్వగూనిలో దాదాపు సాధారణ కారణం విద్యార్థులు సమానంగా నిలబడకుండా చేసే కాళ్ల పొడ వులో తేడా వుండటమే. సమానంగా లేని కాలు పొడవును కొయ్య పలక మీద ఒక కాలుతో నిలబడగలిగి ఉండటం ద్వారా గుర్తించవచ్చును. తుంటిలతో అప్పుడు అదే స్థాయిలో వెన్నెముక తిన్నగా కనిపిస్తుంది.
పార్శ్వ గూని సంఘటన
నిర్మాణాత్మక పార్శ్వగూని విషయాలన్నిటిలో ఎనభై అయిదు శాతానికి కారణాలు తెలియవు. వాటిని కారణం తెలియని పార్శ్వగూనిలుగా పేర్కొంటారు. కారణాలు తెలియని గూని పెద్దలలో రెండు నుంచి మూడు శాతం సంభవిస్తాయి. ఇది సాధారణంగా 10 నుంచి 16 సంవత్సరాలు వయసుగల వారికి వస్తుంది. బాలికలకు కౌమారదశ బాలుర కంటే ముందుకు వస్తుంది కనుగ లింగ బేధాన్ని బట్టి కలుగుతుంది. శీఘ్రగతిన వృద్ధి చెందే వెన్నెముక అభివృద్ధి బాలికలకు 10 నుంచి 14 సంవత్సరాల వరకు, బాలురకు 12 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది.
బాలికల్లో..
బాలికల్లో వంపు పెరగడం సర్వసాధారణం. పెద్ద వంపులు తరచు సంభవిస్తాయి. విద్యార్థులలో పార్శ్వగూని సంఘటనకు దోహదపడేది వారి కుటుంబంలో పార్శ్వగూని చరిత్ర ఉండటం. కారణాలు లేని పార్శ్వగూనికి తారతమ్యతను పరీక్షించి చూస్తే, తెలిసిన కారణాలు ఉన్న పలుతక్కువ పార్శ్వగూని రకాలు వున్నాయి. ఈ వంపులు పుట్టుకతోనే రావచ్చు లేదా కండరాల అస్వస్థత వల్ల రావచ్చును.ఇవి పాఠశాల పరీక్షల వల్ల తేలేదికాదు. ఎందుకంటే అవి జీవితంలో ముందుగానే వచ్చి ఉంటాయి. కారణాలు లేని పార్శ్వగూని విషయంలో, తొలిదశలో వంపును గుర్తిస్తే తీవ్రం కాకుండా చేయవచ్చును.
ఉదాహరణకు పుష్పవతికాని బాలికకు బహిష్టు అయ్యే కౌమారయువతికన్నా లేదా యుక్తవయసు వచ్చినట్టు చిహ్నాలు అంటే చంకల్లో కేశాలు వృద్ధిచెందిన కౌమారబాలునికన్నా వంపులు వృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ. కారణాలు తెలియని పార్శ్వగూని రూపాన్ని ఏర్పరిచే సంవత్సరాలలో తరచుగా బాధగా వుంటుంది కనుక యువకులలో గుర్తించలేము. భుజం వేరొక దానికంటే పెద్దగా ఉంటుంది. ఒక షోల్డర్‌ బ్లేడ్‌ ఇంకొక దానికంటే ఎక్కువగా మరింత ఉన్నతంగా ఉంటుంది. ఒక తుంటి వేరొక దానికంటే పెద్దగా వుంటుంది.
గూని
గూనితనం లేదా ఎతె్తైన వీపును పక్కనుండి చూసినప్పుడు వక్ర సంబంధమైన వెన్నెముక చాలా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అవయవలోపాన్ని అది సరికాకపోతే వ్యాయామాలు, తగిన భంగిమ ద్వారా సరిచేయు వచ్చును. స్కూర్‌మాన్‌ నిపాసిస్‌గా పిలువబడే స్ట్రక్చరల్‌ టైప్‌ కర్వ్‌తో కొంత మంది యువతలో దీనిని అమర్చవచ్చును. ఇందులో వెన్నుపూస బలవంతంగా అమర్చడానికి వీలవుతుంది.
ఈ రకమైన అవయవలోపానికి గల కారణం తెలియదు. స్కూరోమన్‌ కెపాసిస్‌తో లేత వయసుగల వారి కోసం కట్టుకట్టడం లేదా సర్జరీ సిఫార్సు చేయవచ్చును. పక్కగూనికి సంబంధించి టీనేజర్స్‌ స్థిరమైన గూని చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ స్కూల్‌ సై్పనల్‌ స్క్రీనింగ్‌లో తరచుగా దీనిని గుర్తించవచ్చు.

డాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య,
గ్లోబల్‌ హాస్పిటల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.