ఒబెసిటీతో గర్భం ప్రమాదమే
December 6, 2010
మీకు తల తిరుగుతుందా ?
December 6, 2010

వెరికోస్‌ వీన్స్‌ వాటి బాధలేమిటి ?

నిజానికి మనం నడుస్తున్నప్పుడు కాలి సిరల్లో ఒత్తిడి తగ్గుతుంటుంది. కానీ వెరికోస్‌ వీన్స్‌ ఉన్నవారికి సిరల్లో ఒత్తిడి తగ్గకపోగాకూ పెరుగుతుంటుంది. దీంతో నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు పిక్క కండరాల్లో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు మొదలవుతాయి. రక్తం సరిగా పైకి వెళ్లిపోవటం లేదు కాబట్టి కాళ్ల వాపులు రావచ్చు. కొన్నిసార్లు ఒత్తిడి బాగా పెరిగిపోయి సూక్ష్మ రక్తనాళాల నుంచి రక్తం బయటకు వచ్చి చర్మం కింద నిల్వ ఉండిపోతుంది.

దీనివల్ల మడమ పైభాగంలో చర్మం రంగు మారి పోయి నల్లగా తయారవుతుంది. దురదతో గోకటం వల్ల పుండ్లు పడతాయి. అరుదుగా ఈ సూక్ష్మ రక్త నాళాలు పగిలి హఠాత్తుగా రక్తం బయటకు చిమ్ముకొస్తుంది కూడా.

స్థూలంగా చెప్పుకోవాలంటే…

సిరలు పైకి ఉబ్బటం

నొప్పి ఉండొచ్చు లేకపోవచ్చు. చాలా కాలంగా వెరికోస్‌ వీన్స్‌ ఉన్నా నొప్పిలేని వారు ఎంతోమంది.

పిక్క నొప్పి

నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు పిక్క కండరాల్లో నొప్పిగా, అసౌకర్యంగా గుంజినట్లు అనిపిస్తుంది.

వాపు

మడమల చుట్టూరా, పాదాల మీద వాపు రావచ్చు.

రంగు మారటం 

 సూక్ష్మ రక్తనాళాల నుంచి రక్తం బయటకొచ్చి చర్మం కింద చేరటం వల్ల చీలమందల చుట్టూ చర్మం నల్లగా అవుతుంది.

పుండ్లు 

 కొందరికి మడమల దగ్గర పుండ్లు పడుతుంటాయి.

ఈ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి రావాలనేం లేదు. 20 ఏళ్లుగా వెరి కోస్‌ వీన్స్‌ ఉండి కూడా ఇప్పటికి ఎలాంటి నొప్పి లేకుండా ఉన్నవారు కని పిస్తారు. కొందరికి ఏడాదిలోపే పుండ్లు పడొచ్చు కూడా. కాబట్టి సమస్య తీవ్రత ఒకొకరొలో ఒకోరకంగా ఉంటుంది.

ఎవరికి రావచ్చు?

వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండోది ఈ సమస్య స్ర్తీలలో అధికం. ముఖ్యంగా గర్భిణుల్లో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వారిలో సిరల్లోని కండర కవాటాలు వదు లుగా తయారవుతాయి. ఫలితంగా రక్తం కిందకి జారిపోతుంటుంది. ఇవి వచ్చే అవకాశం మొదటి మూడు నెలల్లో ఎక్కువ. మళ్లీ కాన్పు తర్వా త మూడు నెలల్లోపు వాటంతటవే తగ్గిపోతాయి.

వయసు-వృత్తి 

 వయసుతో పాటు వెరికోస్‌ వీన్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఎక్కువసేపు నిలబడే వృత్తుల్లో వారికీ ఈ రిస్కు ఎక్కువే. ముఖ్యంగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, సర్జన్ల వంటి వారిలో ఎక్కువే. సహజంగానే ఈ సమస్య వచ్చే ముప్పు ఉన్న వారికి ఈ వృత్తులు మరింత అజ్యం పోస్తాయి.

గుర్తించేదెలా? 

 చాలాసార్లు కాళ్ల మీద సిరలు పైకి ఉబ్బి స్పష్టంగానే కనిపిస్తుంటాయి. వీటిని చూస్తూనే గుర్తించొచ్చు అయితే అందరిలోనూ ఇలాగే ఉండాలనేం లేదు. కొందరి లో ఇవి పైకి కనిపించవు. చర్మం రంగు మారటం, పుండ్లు పడటం, వాపు వంటివి మాత్రం ఉంటాయి. మరి కొందరి లో చీలమండల ప్రాంతంలో దురదతో ఎండు గజ్జిలా కూడా వస్తుంది. దాన్ని కేవలం చర్మ సమస్యగా పొరబడి, సకాలం లో సరైన చికిత్స తీసుకొని వారూ ఉంటారు. కాబట్టి కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బినట్టు కనబడినా లేకున్నా. ఈ లక్షణా ల ఆధారంగా సమస్యను పట్టుకోవటం కీలకమైన అంశ మని గుర్తించాలి.

వెరికోస్‌ వీన్స్‌ని గుర్తించటానికి చాలా తేలికైనదీ, సులు వైనదీ ‘కలర్‌ డాప్లర్‌’ పరీక్ష, దీనిలో నాళాలు లోపల రక్త ప్రవాహం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఈ పరీక్షను పడుకు న్నప్పటి కంటే నిలబడి ఉన్నప్పుడే చేయటం మేలు. దీనిలో సమస్య నిర్థారణ కావటమే కాదు, ఒకవేళ ఆపరేషన్‌ అవ సరమైతే అదెలా చేయాలో నిర్ణయించేందుకూ తోడ్ప డుతుంది.

సమస్య ఏ సిరలో 

 కాళ్ళల్లో-చర్మం కిందే ఉండే ‘సూపర్‌ ఫిషియల్‌’ సిరల్లో కూడా ప్రధానంగా రెండు సిరలుంటాయి. ఒకటి మోకాలు నుండి తొడల ద్వారా గజ్జల వరకుండేదాన్ని ‘లాంగ్‌ సఫెనస్‌ వీన్‌’ అంటారు. రెండోది కాలు వెనక భాగం లో మడమ నుంచి మోకాలు కీలు వరకు ఉండే ‘షార్ట్‌ సఫెన స్‌ వీన్‌’ సాధారణంగా వెరికోస్‌ వీన్స్‌ సమస్య ఎక్కువగా ఈ రెంటిలోనే తలెత్తుతుంది. అయితే చర్మం కిందే ఉన్నా సాధా రణంగా ఇవి బయటకు కనబడేవి కావు. కాలి మీద మనకు ఉబ్బి కనిపించేవి నిజానికి వీటికి చెందిన సూక్ష్మ శాఖలే.

నిత్యం వ్యాయామం చెయ్యటం వల్ల కండరాల పనితీరు మెరుగై, విరికోస్‌ వీన్స్‌ సమస్య ముదరకుండా ఉంటుంది. జాగింగ్‌, ఈత, సైక్లింగ్‌ వంటి వ్యాయామాలన్నీ మేలు చేసే వేగానీ దీనికి నడక మరింత మంచిది. బిగుతైన మేజోళ్లు వేసుకుని నడవటం అవసరం.

కూర్చున్నప్పుడు కాళ్లు ఎత్తు మీద పెట్టుకోవటం, పడుకునేటప్పుడు కాళ్ల కింద ఎత్తు పెంచుకోవటం మేలు.
ఊబకాయం, అధిక బరువు వెరికోస్‌ వీన్స్‌ బాధలను మరింత పెంచటమే కాదు. వాటివల్ల చికిత్స కూడా కష్టంగా తయారవుతుంది.

డా రమేశ్‌ కుమార్‌
వ్యాస్కులార్‌ సర్జన్‌
అవేర్‌ గ్లోబల్‌ హాస్పటల్‌, హైదరాబాద్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.