వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం

మీకు మీరే డాక్టర్‌
November 9, 2010
దగ్గు… ప్రేరకాలు
November 9, 2010

వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం

మనలో చాలామందికి జలుబు ముక్కు దిబ్బడ, జ్వరం వస్తూ వుంటాయి. వాళ్ళు వెల్లుల్లి రోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధశక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది. అందువల్ల అరచెమ్చా నేతిలో వేయించిన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజు తినడం మంచిది.

నీ ముఖం, శరీరం, వర్చస్సు ఆకర్షణీయంగా వుండాలంటే రెండు వెల్లుల్లి పాయలరసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తీసుకోండి. దీని వలన రక్తం శుభ్రపడుతుంది. దేహకాంతి పెరుగుతుంది. అపుడు చాక్లెట్లు మసాలావస్తువులు తినకూడదు. ఒళ్ళు తగ్గాలనుకుంటున్నారా, సగం నిమ్మ కాయ రసంతో, కొంచెం వేడినీళ్ళు కలిపి అందులో రెండు చిన్నవెల్లుల్లి పాయలని కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే క్రమంగా ఒళ్ళు తగ్గుతుంది. అలా మూడు నెలలు తీసుకోండి చాలు. కాని ఆ సమయం లో కొవ్వు పదార్థాలు, పగటినిద్ర మానేయండి. కొంచెం సేపు నడవండి. చెవిపోటు వస్తే వేడి చేసిన వెల్లుల్లిరసం నాలుగు చుక్కలు చెవిలో వేయండి.

కడుపుతో వున్నప్పుడు రోజు ఒక వెల్లుల్లిని పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతాడు.

రోజూ రెండు వెల్లుల్లిపాయలను క్యాన్సర్‌ వున్నవాళ్ళు తీసుకుంటే, క్యాన్సర్‌ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమవుతుంది.

మోకాళ్ళు నొప్పులు వున్నవాళ్ళు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసుపాలలో కలిపి తీసుకుంటే చాలా మంచిది. వెల్లుల్లి నూనెగా, చుక్కల మందుగా రసాయనిగా ఆయింట్‌మెంట్‌గా వాడతారు. వెల్లుల్లి, గుండెజబ్బులు రాకుండా, రక్తవాహికలో కొవ్వు చేరకుండా శరీరంలో సహజరక్షణశక్తి తగ్గకుండా ఉంచుతుంది. అని నిర్ధారించారు వైద్యులు. క్యాన్సర్‌ వ్యాధి నుండి వెల్లుల్లి రక్షణనిస్తుంది.

వెల్లుల్లిలో అత్యవసర విటమిన్లు మినరల్స్‌ ఉంటాయి. ఎబిసిడిఇ విటమిన్లు జర్మేనియం వున్నాయి. ఇది శరీర రక్షణ శక్తిని పెంచి శరీరంలో వున్న మలినాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.

అనేక పరిశోధనల్లో తేలిందేమంటే పాత వెల్లుల్లి వండికాని వండకుండా కాని తీసుకుంటే గుండెజబ్బులురావని వచ్చినవాళ్ళకి గుండెని కాపాడే చక్కటి మందు. పాతవెల్లుల్లిలో సల్ఫర్‌ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వంటబట్టేశక్తి వుండటం వల్ల గుండె జబ్బులోను శరీరపు గాయాలు మానేశక్తిని పెంపొందించటంలో చాలా సహాయపడుతుంది. వెల్లుల్లిని మితంగా వాడకూడదు. కొంతమందికి వేడి చేస్తుంది. కొంతమందికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాంటప్పుడు వెల్లుల్లి వాడకాన్ని తగ్గించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.